వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉద్యమం టైంలో అలా కుట్ర, కేటీఆర్ లగ్జరీ లైఫ్ త్యాగం: కోదండపై సుమన్ సంచలనం

తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరాం పైన తెరాస ఎంపీ బాల్క సుమన్ ఆదివారం నాడు సంచలన వ్యాఖ్యలు చేసారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరాం పైన తెరాస ఎంపీ బాల్క సుమన్ ఆదివారం నాడు సంచలన వ్యాఖ్యలు చేసారు. తెలంగాణ ఉద్యమం సమయంలో కోదండరాం కుట్రలు పన్నారని ఆరోపించారు.

ఉద్యమాన్ని హింసవైపు మళ్లించేదుకు ప్రయత్నించారని మండిపడ్డారు. అప్పుడు వాటిని అన్నింటిని భరించామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ చేతిలో ఇప్పుడు కోదండరాం కీలుబొమ్మగా మారారని చెప్పారు. వెంటి లెటర్ పైన ఉన్న కోదండరాంను బతికించే ప్రయత్నం కోదండ చేస్తున్నారన్నారు.

కాంగ్రెస్ డైరెక్షన్లో ఆయన పని చేస్తున్నారన్నారు. ఇలాగే ఉంటే కోదండ అభివృద్ధి నిరోధకులుగా మారిపోతారన్నారు. తెలంగాణ కోసం నాడు రాజీనామాలు చేయని వారు ఇప్పుడు విమర్శలు చేయడం విడ్డూరమన్నారు.

balka suman

జేఏసీ చైర్మన్‌గా కోదండను చేసిందే కేసీఆర్ అని గుర్తుంచుకోవాలన్నారు. కేసీఆర్ అంతకుముందు పదేళ్లు ఉద్యమాన్ని నడిపించారని చెప్పారు. తెలంగాణ కోసం మంత్రి కేటీఆర్ కూడా అమెరికాలో తన లగ్జరీ జీవితాన్ని వదులుకొని వచ్చారని చెప్పారు.

మిషన్ కాకతీయ, మిషన్ భగీరథలు కోదండకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. నీటి పారుదల ప్రాజెక్టులకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. సుమన్ తెలంగాణ టిడిపి నేత రేవంత్ రెడ్డి పైన కూడా మండిపడ్డారు. రేవంత్ పెద్ద దొంగ అని, ఆయనకు ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. ఆయన రాజకీయ జీవితం చరమాంకంలో ఉందన్నారు.

మోడీ నిర్ణయాన్ని ఆపే శక్తి మనకు లేదు: హరీష్

ప్రధాని మోడీ నిర్ణయాన్ని ఆపేశక్తి మనకు లేదని మంత్రి హరీష్ రావు అన్నారు. నగదు రహిత లావాదేవీలతో ఇబ్బందులను అధిగమించవచ్చునని చెప్పారు. కావాలనే పాత నోట్లు తీసుకొని కొత్త నోట్లు ఇవ్వడం లేదని మండిపడ్డారు. త్వరలో సమస్యలన్నీ అధిగమిస్తామని చెప్పారు. ఇంటికే వచేచి రూపే కార్డులు అందిస్తామన్నారు.

English summary
Balka Suman controversial comments on Kodandaram.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X