వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘ఆంధ్రా నాయుడు’! కేసీఆర్‌ను ఎదుర్కొనే సత్తా వుందా?: సుమన్ నిప్పులు

టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఎదుర్కొనే సత్తా ఏ పార్టీకి లేదని ఆయన అన్నారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఎదుర్కొనే సత్తా ఏ పార్టీకి లేదని ఆయన అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని టీజీబీకేఎస్ కార్యాలయంలో ఆయన సోమవారం మాట్లాడారు.

ఏపీ సీఎం చంద్రబాబు డైరెక్షన్‌లో టీడీపీ, కాంగ్రెస్, సీపీఐలు కూటమిగా ఏర్పడ్డాయని సుమన్ ఆరోపించారు. ఆంధ్రా నాయుడు పంపిన డబ్బు సంచులతో సింగరేణి ఎన్నికల్లో కూటమి నేతలు ప్రలోభాలకు గురిచేయాలని యత్నిస్తున్నారని మండిపడ్డారు.

Balka Suman fires at Chandrababu and Revanth Reddy

ఆ డబ్బు అండతోనే సింగరేణిలో మీటింగ్‌లు పెట్టి ఏఐటీయూసీకి ఓటు వేయాలంటూ టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పిలుపునిస్తున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ పార్టీని బలహీనపర్చేందుకు ఈ కూటమి చేస్తున్న కుయుక్తులు ఫలించబోవని సుమన్ అన్నారు. 2014 తర్వాత టీఆర్ఎస్ పార్టీని నిలువరించడం ఎవరితరం కావడం లేదని అన్నారు.

చీరల పంపిణీపై చిల్లర రాజకీయాలు

టీఆర్‌ఎస్‌కు తెలంగాణ మహిళలు దగ్గర కావడం, చీరల పంపిణీని టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య జీర్ణించుకోలేకపోతున్నారని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చే చీరలు అందకుండా సండ్ర, ఆయన అనుచరులు ఉద్దేశపూర్వకంగా చీరలను తగులబెట్టారని మండిపడ్డారు.

'పెద్దన్నలా సీఎం కేసీఆర్ అందించిన చీరలను ఏ మహిళా తగులబెట్టారు' అని తెలిపారు. రాజకీయ లబ్ది కోసమే సండ్ర దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని, చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.

English summary
TRS MP Balka Suman on Monday fired at TDP president and AP CM Chandrababu Naidu and TDP leader Revanth reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X