India
  • search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నాలుక చీరేస్తాం! బాబు బినామీవీ నువ్వేం చేస్తావ్?: జగన్‌లా ఎదుర్కోమంటూ సుమన్ వార్నింగ్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ ఆపద్ధర్మ సీఎం, టీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావుపై శనివారం మీడియాతో మాట్లాడిన కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించడంపై టీఆర్ఎస్ పార్టీ ఎంపీ బాల్క సుమన్ ఘాటుగా స్పందించారు. అడ్డగోలుగా మాట్లాడితే తాటతీస్తానంటూ రేవంత్ రెడ్డిని హెచ్చరించారు.

 బాబు అండతో చీకటి సామ్రాజ్యం

బాబు అండతో చీకటి సామ్రాజ్యం

తామంతా తెలంగాణ ఉద్యమంలో జైలుకు వెళ్లినప్పుడు కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పక్కన ఉన్నారని బాల్క సుమన్ అన్నారు. తేలు కుట్టిన దొంగలా ఇప్పుడు రేవంత్ దొరికిపోయారని చెప్పారు. ఇప్పటికీ రేవంత్ చీకటి బాస్ చంద్రబాబు అని... ఆయన అండతో చీకటి సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటున్నారని అన్నారు. బాబు సింగపూర్ ఆస్తుల్లో రేవంత్ రెడ్డి బినామీ అని, ఓటుకు నోటు కేసులో బాబు డబ్బుతోనే దొరికారని అన్నారు. గతంలో రాజశేఖరరెడ్డి మనుషులతో కలిసి ఎన్నో పనులు చేశారని విమర్శించారు.

ఎన్ని కుట్రలు చేసినా తగ్గేది లేదు: కేసీఆర్‌కు రేవంత్ సవాల్ ‘మా మామ కోటీశ్వరుడు'ఎన్ని కుట్రలు చేసినా తగ్గేది లేదు: కేసీఆర్‌కు రేవంత్ సవాల్ ‘మా మామ కోటీశ్వరుడు'

దమ్ముంటే జగన్‌లా ఎదుర్కో..

దమ్ముంటే జగన్‌లా ఎదుర్కో..

ఐటీ శాఖల దాడులకు, టీఆర్ఎస్ పార్టీకి సంబంధం ఏమిటని బాల్క సుమన్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. ఎంతో మంది నేతలు విచారణలు ఎదుర్కొంటున్నారని... వైసీపీ అధినేత జగన్ విచారణ ఎదుర్కొంటున్నారని... దమ్ముంటే మీరు కూడా అలా విచారణ చేయించుకోవాలని సవాల్ విసిరారు.

 అసెంబ్లీ ఎవరు కూర్చుంటారో చూద్దాం..

అసెంబ్లీ ఎవరు కూర్చుంటారో చూద్దాం..

రేవంత్ రెడ్డి చరిత్ర మొత్తం తమకు తెలుసని సుమన్ చెప్పారు. తెలంగాణలోకి కుల రాజకీయాలను చొప్పించేందుకు యత్నిస్తున్నారని... కులాల రాజకీయాలు ఏపీలో ఉంటాయని, తెలంగాణలో కుల రాజకీయాలకు చోటు లేదని అన్నారు. ఎన్నికల తర్వాత ఏర్పాటయ్యే అసెంబ్లీలో బాల్క సుమన్ కూర్చుంటాడో, రేవంత్ రెడ్డి కూర్చుంటాడో చూద్దామని చెప్పారు. రేవంత్‌కు ముఖ్యమంత్రి అన్నా, పోలీసు వ్యవస్థ అన్నా గౌరవం లేదని సుమన్ విమర్శించారు.

బాబే ఏం చేయలేదు.. నువ్వేం చేస్తావ్.. సుమన్ వార్నింగ్

బాబే ఏం చేయలేదు.. నువ్వేం చేస్తావ్.. సుమన్ వార్నింగ్

‘చంద్రబాబే కేసీఆర్‌ను ఏం చేయలేకపోయారు. అలాంటిది నీవెంతా?. కేసీఆర్‌ వేల ఎకరాల ఫామ్‌ హౌస్‌ చూపిస్తావా? లేకపోతే అక్కడే బొందపెట్టాలా. అడ్డగొలుగా మాట్లాడితే తాట తీస్తా. బాగా ఎగిరిపడుతున్నావ్‌. నీ గురించి ప్రధాని మోడీ, కేసీఆర్‌లు కలిసి ఐటీ దాడులు చేపిస్తారా? మా పఠాన్‌ చెరువు ఎమ్మెల్యే, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి ఇళ్లపై కూడా ఐటీ సోదాలు జరిగాయి. వారికి లెక్కల్లో తేడా ఉంటే.. నోటీసులిచ్చి సోదాలు చేస్తారు. దీనికి టీఆర్‌ఎస్‌కే ఏం సంబంధం. నీ గురించి ఎవరికి తెలియదు. ఎన్ని బ్లాక్‌మెయిల్‌ పనులు చేశావ్‌.. నీ దోస్తులను ఎలా మోసం చేశావో తెలియదనుకుంటున్నావా? నీతిగా నిజాయితీగా విలువలతో కూడిన తెలంగాణలో, విషపు మొక్కలా చంద్రబాబు ఏజెంట్‌లా తెలంగాణను భ్రష్టు పట్టిస్తున్నావ్‌. మిమ్మల్ని తిట్టడం మాకు రాదా? నీ తప్పుల గురించి రాసిన విలేకరులను, మీడియా సంస్థలను తిడుతావా? నీవు తప్పు చేస్తే తప్పు అనవద్దా? దమ్ముంటే విచారణ ఎదుర్కో? ఇప్పటికైనా పద్దతిగా, సంస్కారవంతంగా మాట్లాడు.. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఖబర్దార్‌?. ఇకపై, అనవసర వ్యాఖ్యలు చేస్తే రేవంత్ నాలుకను చీరేస్తాం' అని బాల్క హెచ్చరించారు.

English summary
TRS MP Balka Suman on Saturday takes on at Congress MLA Revanth Reddy for his comments on CM KCR.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X