వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మేడారం జాతరలో జంతుబలి నిషేధం

గిరిజనుల ఆరాధ్యదైవమైన మేడారం సమక్క, సారలమ్మ మినీ జాతర 8న (బుధవారం) ప్రారంభమైంది.

|
Google Oneindia TeluguNews

భూపాలపల్లి: గిరిజనుల ఆరాధ్యదైవమైన మేడారం సమక్క, సారలమ్మ మినీ జాతర 8న (బుధవారం) ప్రారంభమైంది. జారతలో సమ్మక్క, సారలమ్మలకు తమ మొక్కులు చెల్లించుకోవడంతోపాటు ఇక్కడ జంతుబలులు ఇవ్వడం సాంప్రదాయంగా వస్తోంది.

అంతేగాక, కోళ్ల షాపులకు టెండర్లు వేయించి అమ్మకాలు చేయించడం జాతరలో ఆనవాయితీ. మద్యం, మటన్‌, బెల్లం కలగలిపి జరిగే ఈ జాతరకు కోట్లాది మంది భక్తులు మొక్కులు తీర్చుకుంటారు. అయితే జిల్లా కలెక్టర్‌ ఆకునూరి మురళి.. జాతరకు ఒక్క రోజు ముందు పాత చట్టానికి బూజు దులిపి ఓ పత్రికా ప్రకటన జారీ చేయడం భక్తులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.

జంతువులు, పకక్షులను బలి చేయడం చట్టప్రకారం నేరమంటూ ఆ ప్రకటనలో కలెక్టర్‌ పేర్కొన్నారు. అంతేగాకుండా 1950 సంవత్సరం 32వ చట్టాన్ని ప్రయోగించి కేసులు నమోదు చేస్తామని హెచ్చరించడం భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్‌ ఏ ఉద్దేశంతో ఈ ప్రకటన జారీ చేశారో గానీ, జాతరకు ఒక్కరోజు ముందు ఈ ప్రకటన రావడం భక్తులను కలవరానికి గురిచేస్తోంది.

Ban on Animal Sacrifice in Medaram Jatara

వీరభద్రుడి కల్యాణాన్ని వైభవంగా జరిపిద్దాం: సీఎం మొక్కు తీర్చుకునేందకు రావొచ్చు..

కురవి: కురవి శ్రీవీరభద్రస్వామి జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించాలని, మానుకోట జిల్లాలో పెద్దదైన జాతరను జిల్లా ప్రజలు గర్వించేలా జరిపించాలని ఎమ్మెల్యే డీఎస్‌ రెడ్యానాయక్‌, జాయింట్ కలెక్టర్‌ దామోదర్‌రెడ్డి అన్నారు. కురవి వీరభద్రస్వామి ఆలయ ప్రాంగణంలో మంగళవారం మహాశివరాత్రి జాతరపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే రెడ్యానాయక్‌ మాట్లాడుతూ.. కురవి వీరన్నకు కోరమీసాల మొక్కు ఉన్నందున నూటికి తొంబై శాతం ఈ శివరాత్రికి ముఖ్యమంత్రి కురవికి వస్తారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జాతరకు వస్తున్నారనే విధంగానే అధికారులు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అధికారులు జాతర పనుల్లో ఏమాత్రం అశ్రద్ధ వహించినా కఠిన చర్యలు తీసుకుంటామని జేసీ దామోదర్‌రెడ్డి హెచ్చరించారు.

English summary
Ban on Animal Sacrifice in Medaram Jatara.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X