వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వద్దన్నా ఫుడ్ డెలివరీలు ... స్విగ్గి , జొమాటో డెలివరీ బాయ్స్ వాహనాలు సీజ్

|
Google Oneindia TeluguNews

ఫుడ్ డెలివరీ బాయ్ కు కరోనా వచ్చిందన్న వార్తలతో తెలంగాణా ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది . స్విగ్గీ, జొమాటో తదితర ఫుడ్ డెలివరీ యాప్స్ లో పనిచేస్తున్న డెలివరీ బాయ్స్ ద్వారా కూడా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోందన్న వార్తల నేపథ్యంలో, వీటిని తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుత లాక్ డౌన్ సమయంలో నిషేధం విధించింది. అయినా సరే స్విగ్గీ , జోమాటో సంస్థలు ఫుడ్ డెలివరీ కొనసాగిస్తున్నాయి . ఫుడ్ డెలివరీలను చేస్తున్న వారిపై హైదరాబాద్ పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు.

108 కు కాల్స్ వెల్లువ .. మద్యం షాపులు తెరిపించండి .. గోడు వెళ్ళబోసుకుంటున్న మందుబాబులు108 కు కాల్స్ వెల్లువ .. మద్యం షాపులు తెరిపించండి .. గోడు వెళ్ళబోసుకుంటున్న మందుబాబులు

''పిజ్జ ఎందుకు బొజ్జా ఎందుకు. ఇంత పప్పు ఏదో తింటే సరిపోదా. నాలుగు రోజులు పిజ్జా తినకుండా ఉండలేమా. ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు. అలాంటివి తినటం మంచిది కాదు. బయట నుంచి తినుబండారాలు తెప్పించుకోకండి.'' అంటూ సీఎం కేసీఆర్ చెప్పారు. ఇక హైదరాబాద్ నాంపల్లికి సంబంధించిన కరోనా డెలివరీ బాయ్ కు కరోనా వైరస్ పాజిటివ్ రావటంతో మే 7వ తేదీ వరకు ఫుడ్ డెలివరీలు చేసే స్విగ్గీ ,జొమాటోలపై నిషేధం విధించారు . అయితే నిబంధనలను అతిక్రమించి వద్దన్నా ఫుడ్ డెలివరీలను చేస్తున్నారు కొందరు.

ban on Food Deliveries ... Swiggy, Zomato Delivery Boys Vehicles Siege

ఈ క్రమంలో నిబంధనలను ధిక్కరించిన వారిని పట్టుకునేందుకు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట ట్రాఫిక్ పోలీసు స్టేషన్ల పరిధిలో ప్రత్యేక చెక్ పోస్టులను ఏర్పాటు చేసి, డెలివరీ బాయ్స్ వాహనాలను వచ్చినవి వచ్చినట్టు సీజ్ చేసి, పోలీసులు కేసులను నమోదు చేశారు.ఇక ఇప్పటికే ఫుడ్ డెలివరీల మీద ఆంక్షలు ఉన్నాయని ఎవరైనా ఫుడ్ డెలివరీ చేస్తే కేసులు పెడతామని హెచ్చరించిన పోలీసులు అన్నంత పని చేశారు . లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నామని, వాటిని మీరితే, చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. నిషేధం విధించినా, ఆర్డర్స్ తీసుకుంటున్న ఫుడ్ డెలివరీ యాప్స్ పైన కేసులు నమోదు చేయనున్నట్టు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు.

Recommended Video

Coronavirus : Telangana Government Decided To Take Corona Samples @ Home

English summary
Telangana government banned the food delivery apps swiggy and zomato till may 7th due to the lock down continuing in telangna. Special check posts have been set up at Banjarahills, Jubilee Hills and Panjagutta traffic police stations to arrest those who have violated the rules and filed cases vehicles seize .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X