వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ నిధులిచ్చేందుకు సిద్ధంగా ఉన్నా కెసిఆరే వద్దంటున్నారు(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ టిఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కెసిఆర్‌పై విమర్శలు గుప్పించారు. హైదరాబాద్‌ను స్మార్ట్‌సిటీగా రూపొందించేందుకు అవసరమైన నిధులను ప్రధాని నరేంద్ర మోడీ మంజూరు చేసేందుకు సుముఖంగా ఉన్నప్పటికీ తెలంగాణ సీఎం కేసీఆర్‌ అందుకు అంగీకరించడం లేదని కేంద్రమంత్రి దత్తాత్రేయ అన్నారు.

పైగా కేంద్రం నిధులు ఇవ్వడం లేదంటూ ఆరోపిస్తున్నారని దత్తాత్రేయ విమర్శించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాంనగర్‌చౌరస్తాలో గురువారం నిర్వహించిన భారతీయ జనతా పార్టీ ఎన్నికల సభలో దత్తాత్రేయ పాల్గొని ప్రసంగించారు.

కేంద్రం హైదరాబాద్‌ను ఆకర్షణీయ నగరాల జాబితాలో చేర్చుతామంటే.. కేసీఆర్‌ మాత్రం కరీంనగర్‌ను జాబితాలో చేర్చాలని కోరారన్నారు. ఇది చూస్తే హైదరాబాద్‌ పట్ల కేసీఆర్‌ ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారనేది తేటతెల్లమవుతోందన్నారు.

హైదరాబాద్‌ ఆకర్షణీయ నగరంగా రూపొందినట్లయితే రూ.కోట్ల పెట్టుబడులు నగరానికి వస్తాయని, లక్షల మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. ఇవన్నీ అవసరం లేదనట్టుగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రికి గ్రేటర్‌ ఎన్నికల్లో గట్టిగా సమాధానం చెప్పాలని దత్తాత్రేయ పిలుపునిచ్చారు.

ఇది ఇలా ఉండగా, హైదరాబాద్‌ అభివృద్ధికి కేంద్రం సహకారం అవసరమని, ఇందుకు గ్రేటర్‌ ఎన్నికల్లో భాజపా-తేదేపా కూటమికి పట్టం కట్టాలని కేంద్ర జౌళి శాఖ మంత్రి సంతోష్‌కుమార్‌ గంగ్వార్‌ పిలుపునిచ్చారు. ఎన్నికల్లో భాగంగా ఆయన గురువారం గన్‌ఫౌంఢ్రీ డివిజన్‌ బిజెపి అభ్యర్ధి ఎం సరితా మధుగౌడ్‌తో కలిసి ప్రచారం చేశారు.

బిజెపి ప్రచారం

బిజెపి ప్రచారం

గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ టిఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కెసిఆర్‌పై విమర్శలు గుప్పించారు.

బిజెపి ప్రచారం

బిజెపి ప్రచారం

హైదరాబాద్‌ను స్మార్ట్‌సిటీగా రూపొందించేందుకు అవసరమైన నిధులను ప్రధాని నరేంద్ర మోడీ మంజూరు చేసేందుకు సుముఖంగా ఉన్నప్పటికీ తెలంగాణ సీఎం కేసీఆర్‌ అందుకు అంగీకరించడం లేదని కేంద్రమంత్రి దత్తాత్రేయ అన్నారు.

బండారు దత్తాత్రేయ ప్రచారం

బండారు దత్తాత్రేయ ప్రచారం

పైగా కేంద్రం నిధులు ఇవ్వడం లేదంటూ ఆరోపిస్తున్నారని దత్తాత్రేయ విమర్శించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాంనగర్‌చౌరస్తాలో గురువారం నిర్వహించిన భారతీయ జనతా పార్టీ ఎన్నికల సభలో దత్తాత్రేయ పాల్గొని ప్రసంగించారు.

బిజెపి ప్రచారం

బిజెపి ప్రచారం

కేంద్రం హైదరాబాద్‌ను ఆకర్షణీయ నగరాల జాబితాలో చేర్చుతామంటే.. కేసీఆర్‌ మాత్రం కరీంనగర్‌ను జాబితాలో చేర్చాలని కోరారన్నారు. ఇది చూస్తే హైదరాబాద్‌ పట్ల కేసీఆర్‌ ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారనేది తేటతెల్లమవుతోందన్నారు.

బిజెపి ప్రచారం

బిజెపి ప్రచారం

హైదరాబాద్‌ అభివృద్ధికి కేంద్రం సహకారం అవసరమని, ఇందుకు గ్రేటర్‌ ఎన్నికల్లో బిజెపి-టిడిపి కూటమికి పట్టం కట్టాలని కేంద్ర జౌళి శాఖ మంత్రి సంతోష్‌కుమార్‌ గంగ్వార్‌ పిలుపునిచ్చారు. ఎన్నికల్లో భాగంగా ఆయన గురువారం గన్‌ఫౌంఢ్రీ డివిజన్‌ బిజెపి అభ్యర్ధి ఎం సరితా మధుగౌడ్‌తో కలిసి ప్రచారం చేశారు.

బిజెపి ప్రచారం

బిజెపి ప్రచారం

డివిజన్‌ పరిధిలోని ఇసామియాబజార్‌, మోతిమార్కెట్‌, కుత్భిగూడ, బడీచౌడి, పోచమ్మ టెంపుల్‌ లేన్‌ తదితర ప్రాంతాల్లో రోడ్‌-షో నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోడీ సారధ్యంలో భారత్‌ ప్రపంచ దేశాలకు దీటుగా అభివృద్ధిలో దూసుకుపోతోందని పేర్కొన్నారు.

బిజెపి ప్రచారం

బిజెపి ప్రచారం

హైదరాబాద్‌ అభివృద్ధికి కేంద్రం సహకారం అవసరమని, ఇందుకు గ్రేటర్‌ ఎన్నికల్లో భాజపా-తేదేపా కూటమికి పట్టం కట్టాలని కేంద్ర జౌళి శాఖ మంత్రి సంతోష్‌కుమార్‌ గంగ్వార్‌ పిలుపునిచ్చారు. ఎన్నికల్లో భాగంగా ఆయన గురువారం గన్‌ఫౌంఢ్రీ డివిజన్‌ బిజెపి అభ్యర్ధి ఎం సరితా మధుగౌడ్‌తో కలిసి ప్రచారం చేశారు.

బిజెపి ప్రచారం

బిజెపి ప్రచారం

డివిజన్‌ పరిధిలోని ఇసామియాబజార్‌, మోతిమార్కెట్‌, కుత్భిగూడ, బడీచౌడి, పోచమ్మ టెంపుల్‌ లేన్‌ తదితర ప్రాంతాల్లో రోడ్‌-షో నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోడీ సారధ్యంలో భారత్‌ ప్రపంచ దేశాలకు దీటుగా అభివృద్ధిలో దూసుకుపోతోందని పేర్కొన్నారు.

English summary
Union Minister Bandaru Dattatreya on Thursday fired at Telangana CM K Chandrasekhar Rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X