కేసీఆర్‌ను పరిగెత్తించడం ఖాయం, రాక్షస పాలన, వారికి పింక్ డ్రెస్: బండి సంజయ్, రమణ్ సింగ్, తరుణ్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని కేసీఆర్ సర్కారుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ విమర్శించారు. కరీంనగర్ నుంచి హైదరాబాద్ కు వెళ్తున్న బండి సంజయ్ సిద్ధిపేటలోని రంగదాంపల్లి వద్ద కార్యకర్తలను కలిసి వారితో ముచ్చటించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు.

రాష్ట్రంలో రాక్షస పాలన అంటూ కేసీఆర్‌పై బండి సంజయ్ ఫైర్
రాష్ట్ర
ముఖ్యమంత్రి
కేసీఆర్
నేతృత్వంలో
పోలీసులు
దాడి
చేసిన
తీరును
దేశం
మొత్తం
చూసిందన్నారు.
'నీకు
వత్తాసు
పలికితే
కేసులు
లేవు..
లేదంటే
కేసులు
పెట్టి
బెదిరిస్తావా'
అంటూ
బండి
సంజయ్
మండిపడ్డారు.
రాష్ర్టంలో
రాక్షస
పాలన
నడుస్తుందన్నారు.
తన
కార్యాలయంలో
దాడులు
చేసి,
ధ్వంసం
చేశారన్నారు.
తన
కార్యాలయంలో
ఫైల్స్‌ను
అన్నింటిని
నాశనం
చేశారని
తెలిపారు.
317
జీవో
రద్దు
చేయాలని
బండి
సంజయ్
డిమాండ్
చేశారు.
కేసీఆర్‌ను
ఫామ్
హౌస్‌లో
పడుకోవడానికి
ముఖ్యమంత్రిగా
ఎన్నుకోలేదని..
ప్రజల
సమస్యలను
తీర్చడానికి
ముఖ్యమంత్రిగా
ఎన్నుకున్నారని
బండి
సంజయ్
మండిపడ్డారు.
ఉద్యోగుల
ఆరోగ్యం
పాడవ్వకముందే
ఈ
జీవోకు
సవరణ
చేయాలన్నారు.
యూట్
ట్యూబ్
విలేకరులపైనా
కేసులు
పెడుతున్నారని
బండి
సంజయ్
మండిపడ్డారు.

కేసీఆర్‌ను పరిగెత్తించడం ఖాయమంటూ బండి సంజయ్
'నిన్ను,
నీ
కొడుకును
ఎట్టి
పరిస్థితుల్లో
వదలం..
నీ
కొడుకు
మైండ్
కరాబు
అయింది'
అని
కేటీఆర్‌పై
విమర్శలు
గుప్పించారు
బండి
సంజయ్.
ఈ
సమస్యను
ఇంకా
జటిలం
చేయాలని
చూడొద్దని
హితవు
పలికారు.
ఉద్యోగుల
ఇప్పుడు
పోరాటం
చేయండి,
మీరు
చేయకపోతే
మీరే
నష్ట
పోతారు..
మీ
వెంట
మేము,
బీజేపీ
పార్టీ
అండగా
ఉంటుందని
వారికి
భరోసా
ఇచ్చారు
బండి
సంజయ్.
ముఖ్యమంత్రి
ఉద్యోగులను,
ఉద్యోగ
సంఘాలు
చీల్చి
పరిపాలన
చేస్తున్నాడని
దుయ్యబట్టారు.
నిరుద్యోగ
సమస్య
మీద
పోరాడుదాం..
ఎంతమంది
నిరుద్యోగులు
ఉన్నారో
తెలుసా
అంటూ
కేసీఆర్‌ను
విమర్శించారు.
రానున్న
రోజుల్లో
ముఖ్యమంత్రిని
ప్రజలు
పరిగెత్తిస్తారని
బండి
సంజయ్
వ్యాఖ్యానించారు.

కేసీఆర్ ఇంటికిపోయే కాలం అంటూ మాజీ సీఎం రమణ్ సింగ్ ఫైర్
ఛత్తీస్
గఢ్
మాజీ
సీఎం
రమణ్
సింగ్..
తెలంగాణ
సీఎం
కేసీఆర్‌పై
తీవ్రస్థాయిలో
మండిపడ్డారు.
తెలంగాణ
బీజేపీ
రాష్ట్ర
అధ్యక్షుడు
బండి
సంజయ్
పై
దాడి
చాలా
దుర్మార్గమైన
చర్య
అన్నారు
రమణ్
సింగ్.
తన
అనుభవంలో
ఒక
పార్లమెంటు
సభ్యుడి
కార్యాలయం
తలుపులు
పగులగొట్టి
దాడి
చేయడం
మొదటిసారి
చూశానన్నారు.
కేసీఆర్‌కు
సిగ్గుంటే..
ఇప్పటికైనా
దాడి
చేసిన
పోలీసు
అధికారులపై
కేసులు
నమోదు
చేసి
సస్పెండ్
చేయాలన్నారు.
తెలంగాణ
ముఖ్యమంత్రి
కేసీఆర్
ఇంటికి
పోయే
కాలం
ఆసన్నమైందన్నారు.
తెలంగాణ
ప్రభుత్వంపై
పోరాడేందుకు
బీజేపీ
సంసిద్ధంగా
ఉందన్నారు
రమణ్
సింగ్.
వెనకడుగు
వేసే
సమస్య
లేదన్నారు.
బండి
సంజయ్
అరెస్టుతోనే
టీఆర్ఎస్
పార్టీ
తన
పతనానికి
పునాది
వేసుకుందన్నారు.
తెలంగాణలో
నిజాం
తరహా
పరిపాలన
సాగుతోందని
విమర్శించారు.
మహిళల
పట్ల
కూడా
పోలీసులు
కర్కశంగా
వ్యవహరించారన్నారు.
కోట్లు
ఖర్చు
పెట్టినా
హుజురాబాద్
లో
ఓటమి
ఎదురు
కావడంతోనే
ముఖ్యమంత్రి
కేసీఆర్‌కు
మతి
భ్రమించిందని
వ్యాఖ్యానించారు.
తెలంగాణను
తన
జాగీరుగా
చేసుకొని
కేసీఆర్
కుటుంబపాలన
చేస్తున్నారని
మండిపడ్డారు.
ప్రజాస్వామ్యాన్ని
అపహాస్యం
చేసిన
తెలంగాణ
ప్రభుత్వానికి
కొనసాగే
హక్కు
లేదని
రమణ్
సింగ్
ధ్వజమెత్తారు.

ఖాకీ కాదు వారు పింక్ డ్రెస్.. బ్రిటీష్ పాలకుల్లా కేసీఆర్.. తరుణ్ చుగ్ ఫైర్
తెలంగాణ
రాష్ట్ర
బీజేపీ
ఇంచార్జ్
తరుణ్
చుగ్..
కేసీఆర్
సర్కారుపై
తీవ్రంగా
మండిపడ్డారు.
బీజేపీ
రాష్ట్ర
అధ్యక్షుడు
బండి
సంజయ్
పై
పోలీసులు
తప్పుడు
కేసులు
పెట్టారని
ఆయన
ఆగ్రహం
వ్యక్తం
చేశారు.
హైదరాబాద్‌లో
బీజేపీ
కార్యాలయంలో
ఆయన
మాట్లాడుతూ....
గ్యాంగ్‌స్టర్
దావుద్
ఇబ్రహీంతో
వ్యవహరించినట్లుగా
బండి
సంజయ్‌ను
పోలీసులు
అరెస్టు
చేశారని
మండిపడ్డారు.
పోలీసులు
టీఆర్ఎస్
జెండా
మోస్తూ...ప్రశ్నించిన
వారిపై
అక్రమ
కేసులు
పెడుతున్నారని
విమర్శించారు.
వారు
ఖాకీ
డ్రెస్
విడిచి
పింక్
డ్రెస్
వేసుకోవాలన్నారు.
అబద్దపు
కేసులతో
బండి
సంజయ్‌ని
కేసీఆర్
ప్రభుత్వం
జైల్లో
పెట్టిస్తే..
కోర్టు
న్యాయం
చేస్తూ..
ఆయన్ను
విడుదల
చేసిందన్నారు.
సర్కారు
తప్పు
చేసిందని
హైకోర్టు
ఆదేశాలతో
స్పష్టమైందన్నారు.
బ్రిటిష్
పాలకుల్లా
కేసీఆర్
వ్యవహరిస్తున్నారని
మండిపడ్డారు.
తెలంగాణ
ప్రజల
కోసం
బీజేపీ
పోరాడుతోందని,
అప్రజాస్వామిక
ప్రభుత్వంపై
పోరాటం
చేస్తునే
ఉంటామమని
తరుణ్
చుగ్
స్పష్టం
చేశారు.