భారత్ బంద్ కు కేసీఆర్ మద్దతుపై బండి సంజయ్ కౌంటర్ .. త్వరలో బీజేపీ ఛలో హైదరాబాద్
భారత్ బంద్ కు తెలంగాణ ప్రభుత్వం మద్దతు తెలపడంపై తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం ఆదేశాల మేరకు బంద్ నిర్వహించారు కానీ రైతులు ఎవరూ పాల్గొనలేదని బందు విఫలమైందని బండి సంజయ్ అభిప్రాయపడ్డారు. టిఆర్ఎస్, కాంగ్రెస్, కమ్యూనిస్టు నేతలు ఒకరినొకరు తనకున్నారంటూ బండి సంజయ్ ఆరోపించారు.
త్వరలో సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో రైతులను పెడుతున్న ఇబ్బందులకు వ్యతిరేకంగా చలో హైదరాబాద్ నిర్వహిస్తామని బండి సంజయ్ స్పష్టం చేశారు .

ఛలో హైదరాబాద్ .. పోలీసులు సహకరించాలన్న బండి సంజయ్
భారత్ బంద్ కు అధికార పార్టీకి పోలీసులు సేకరించినట్లు ఛలో హైదరాబాద్ కు బీజేపీకి సహకరించాలని పేర్కొన్నారు. సీఎం మోచేతి నీళ్లు తాగుతున్న టీఎన్జీవో నాయకులు, సీఎం బెదిరిస్తే ఆయనకు జై కొడుతున్నారని, అడ్డగోలుగా గుంట నక్కల మాదిరిగా ఆస్తులు సంపాదిస్తున్నారని మండిపడ్డారు. టీఎన్జీవో కు ఇప్పుడున్న అధ్యక్షుడు రాజీనామా చేసి తిరిగి ఓటింగ్ పెట్టాలని, బంద్ విషయంలో మద్దతిచ్చిన టీఎన్జీవో నాయకుల సంగతి తేలుస్తామని, ఉద్యోగ సంఘ నేత పై లీగల్ గా ప్రొసీడ్ అవుతామని బండి సంజయ్ పేర్కొన్నారు.

కేసీఆర్ ఫామ్ హౌస్ లోనో, ప్రగతి భవన్ లోనో ఎందుకు .. బంద్ లో పాల్గొనలేదే ?
ఈ ప్రభుత్వం, ఈ సీఎం శాశ్వతం కాదు అన్న బండి సంజయ్ రాబోయే రోజుల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని, బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. భారత్ బంద్ కు మద్దతు ఇచ్చిన సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ లోనో , ప్రగతి భవన్ లోనో ఎందుకు పడుకున్నాడో చెప్పాలని డిమాండ్ చేశారు. అసలు సీఎం కేసీఆర్ బంద్ కు మద్దతు ఇస్తున్న కారణం చెప్పలేదన్నారు .మరి ఇన్ని రోజులు ఎందుకు స్పందించలేదో కూడా చెప్పాలని డిమాండ్ చేశారు. కెసిఆర్ ఫామ్ హౌస్ లో పండిన పంటకు ఎవరు ధర నిర్ణయించారు. నీకు ఒక రూల్.. రైతులకు మరో రూల్ నా అని బండి సంజయ్ ప్రశ్నించారు.

సీఎం కేసీఆర్ మెడలు వంచే విధంగా ఛలో హైదరాబాద్
సన్న వడ్లు చేయమని చెప్పి రైతులను మోసం చేసిన వ్యక్తి సీఎం కెసిఆర్ అని మండిపడ్డారు. నిర్బంధ వ్యవసాయ విధానం చెప్పిన సీఎం పై పోరాటం చేస్తామని చెప్పారు . సన్న వడ్లు వేయమని చెప్పేముందు నువ్వేమైనా కేంద్రాన్ని అడిగావా అంటూ ప్రశ్నించారు బండి సంజయ్. ఇక సన్న వడ్లకు రెండు వేల ఐదు వందల రూపాయల చొప్పున ఇవ్వాలని, రాష్ట్ర ప్రభుత్వం వాటిని కొనవలసిందే అని , కౌలు రైతుకు కూడా రైతు బంధు ఇవ్వాలని, రుణ మాఫీ చేయాలని బండి సండే డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ మెడలు వంచే విధంగా రైతు సమస్యలపై ఆందోళనలు చేస్తామని త్వరలో చలో హైదరాబాద్ నిర్వహిస్తామని బండి సంజయ్ స్పష్టం చేశారు.