వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చర్చి, మసీదుల్లో ఫోటో పెట్టగలరా..? యాదాద్రిలో కేసీఆర్ ఫోటోపై బండి సంజయ్ ఫైర్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : సీఎం కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్. యాదాద్రి ఆలయంలో తన ఫోటోలు పెట్టుకోవడం ఏంటి అని ప్రశ్నించారు. ఇది మంచి పద్ధతి కాదని .. చర్చి, మసీదుల్లో ఫోటో పెట్టుకునే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. శనివారం వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు.

కేసీఆర్ సరికాదు ..
పవిత్ర పుణ్యక్షేత్రం యాదాద్రి ఆలయంలో సీఎం కేసీఆర్ ఫోటో పెట్టుకోవడం సరికాదన్నారు సంజయ్. ఆలయంలో ఫోటోలు పెట్టుకున్న కేసీఆర్ .. చర్చి, మసీదుల్లో కూడా పెట్టుకోగలరా అని ప్రశ్నించారు. ఆలయంలో పార్టీ పోటోలు ప్రదర్శించడం మంచిది కాదన్నారు. ఇప్పటికైనా వైఖరి మార్చుకోవాలని సూచించారు. లేదంటే ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొవాల్సి వస్తోందని హితవు పలికారు.

bandi sanjay fire on cm kcr

తొలగించి తప్పును సరిదిద్దండి ..
కరీంనగర్ వేదికగా హిందుగాళ్లు, బొందుగాళ్లు అని కామెంట్ చేసిన కేసీఆర్‌కు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు. దేవాలయంలో ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. దేవుడిపై, ధర్మం పట్ల కేసీఆర్‌కు చిత్తశుద్ది ఉంటే యాదాద్రి వెళ్లి అర్చకులతో కలిసి ఫోటోలు తొలగించాలని డిమాండ్ చేశారు. చేసిన తప్పుకు పరిహారంగా పాలాభిషేకం చేయాలని సూచించారు. అప్పుడే కేసీఆర్‌ను హిందూ సమాజం క్షమిస్తోందని చెప్పారు. లేదంటే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు.

English summary
Sanjay says it is inappropriate to take a photo of CM KCR at the holy shrine Yadadri temple. Asked whether it is possible to invest in the church and mosques in the temple. It is not advisable to display party photos in the temple. It is suggested that the attitude be changed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X