వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఈడీకి భయపడేది లేదు.. బండి సంజయ్ గల్లీ లీడర్: మంత్రి జగదీశ్ రెడ్డి

|
Google Oneindia TeluguNews

మునుగోడు బై పోల్.. గెలిచేందుకు ప్రధాన పార్టీలు తమ వ్యుహాలకు మరింత పదును పెడుతున్నాయి. బై పోల్ ఎలాగైనా గెలవాలని టీఆర్ఎస్ పార్టీ అనుకుంటుంది. ఆ మేరకు ప్రయత్నాలను చేస్తోంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్‌పై మంత్రి జగదీశ్‌రెడ్డి ఫైర్ అయ్యారు. బండి సంజయ్ ఓ గల్లీ లీడర్ అని.. గల్లీ లీడర్ ను తీసుకొచ్చి అధ్యక్షుడిని చేశారంటూ మండిపడ్డారు. ఈడీకు భయపడేది లేదని మంత్రి జగదీశ్‌రెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్‌ని లొంగ తీసుకోవడం ఎవరి తరం కాదని బీజేపీ టార్గెట్‌గా విమర్శలు గుప్పించారు.

మునుగోడులో టీఆర్‌ఎస్‌ పార్టీనే ఘన విజయం సాధిస్తుందని జగదీష్ రెడ్డి అన్నారు. నల్లగొండలో పలు అభవృద్ధి కార్యక్రమాలకు స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు. బీజేపీకి అక్కడ మూడో స్థానమే దక్కుతుందన్నారు. బీజేపీపై పోరాటంలో కేసీఆర్‌ది రాజీలేని పోరాటం అన్నారు. బీజేపీ వ్యతిరేక శక్తులు ఐక్యం కావాలని వామపక్షాలు కోరుతున్నాయి. బీజేపీపై పోరాటంలో టీఆర్ఎస్‌తో వామపక్షాలు కలిసి రావాలన్నారు. మునుగోడులో బీజేపీని ఓడించడమే లక్ష్యమని సీపీఎం, సీపీఐలు ప్రకటించడం ఆహ్వానించ తగ్గ పరిణామం అన్నారు.

bandi sanjay is street leader:minister jagadish reddy

Recommended Video

అధ్యకుడి క్షమాపణకి శాంతించని కోమటిరెడ్డి *Telangana | Telugu Oneindia

మోడీ ఇచ్చిన రూ.22 వేల కోట్ల కాంట్రాక్ట్ తో రాజగోపాల్ రెడ్డి అహంకారంగా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్‌ పార్టీ వాడుకొని ఎదిగిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన స్వార్థం కోసం పార్టీని, తనను ఎన్నుకున్న ప్రజల్ని మోసం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి కింద కుక్కల్లా కాంగ్రెస్‌లో ఎదిగి న కోమటిరెడ్డి బ్రదర్స్.. చివరికి ద్రోహులుగా మారారని ఘాటుగా విమర్శించారు. కోమటిరెడ్డి బ్రదర్స్‌కు ఈ ఎన్నికలే చివరి ఎన్నికలు కానున్నాయని జోస్యం చెప్పారు.

English summary
bandi sanjay is street leader telangana minister jagadish reddy alleges.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X