• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

నీ ఫాంహౌస్‌కు వస్తా-బీజేపీ కార్యకర్తలతో కలిసి దున్నేస్తా-తెలంగాణలో ఎంఐఎం వేర్లు పెకిలించేస్తా: బండి

|
Google Oneindia TeluguNews

తెలంగాణ ఉద్యమం పేరుతో హిందూ సంస్కృతీ సాంప్రదాయాలను,తెలంగాణ సంస్కృతీ సాంప్రదాయాలను నీరుగార్చారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఉద్యమ సమయంలో చెప్పులు పెట్టి,హ్యాండ్ బ్యాగులు పెట్టి బతుకమ్మ ఆడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బతుకమ్మ అంటే ఎవరికి తెలియదన్నట్లుగా కవితతోనే బతుకమ్మ అందరికీ తెలిసినట్లుగా మాట్లాడుతున్నారని అన్నారు. బతుకమ్మ ఎప్పుడు పుట్టింది కవిత ఎప్పుడు పుట్టిందని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రం కోసం శ్రీకాంతచారి,సుమన్,పోలీస్ కిష్టన్న,యాదిరెడ్డి లాంటి ఎందరో ఆత్మబలిదానం చేస్తే... తమ వల్లే తెలంగాణ వచ్చిందని కేసీఆర్ కుటుంబం చెప్పుకుంటోందని మండిపడ్డారు. బడుగు బలహీనవర్గాల ప్రజల త్యాగాలతోనే తెలంగాణ సాధించుకున్నామన్నారు.

మూర్ఖుడి చేతిలో బందీగా తెలంగాణ : బండి సంజయ్

మూర్ఖుడి చేతిలో బందీగా తెలంగాణ : బండి సంజయ్

తెలంగాణ తల్లి కేసీఆర్ అనే మూర్ఖుడి చేతిలో బందీ అయిందని బండి సంజయ్ విమర్శించారు.నిజాం షుగర్ ఫ్యాక్టరీని ఎందుకు మూసివేశారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ఒకప్పుడు లక్షాధికారులుగా ఉన్న బెల్లం,చెరుకు రైతులు ఇప్పుడు బికారీలుగా మారారని పేర్కొన్నారు.'ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకసారి పత్తి వేయొద్దంటాడు... ఒకసారి దొడ్డు వడ్లు వేయొద్దంటాడు.. వరి వేస్తే ఉరే అని మాట్లాడుతున్నాడు... వరితో ఉరే అనే వ్యాఖ్యలు ఎందుకు చేశారో సమాధానం చెప్పాలి. రైతులు పండించిన ప్రతీ గింజను కొంటానని గతంలో చెప్పాడు.ఇప్పుడేమో కేంద్రం కొనట్లేదని చెబుతున్నాడు... కేసీఆర్ వ్యాఖ్యలతో రైతులంతా అయోమయానికి గురవుతున్నారు.బాధ్యతాయుతమైన పదవిలో ఉండి వరి వేస్తే ఉరే అని మాట్లాడటం సబబేనా... ఇప్పటికైనా కేసీఆర్ ఫాంహౌస్ నుంచి బయటకొచ్చి రైతులకు భరోసా ఇవ్వాలి.' అని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

కేసీఆర్‌కు సంజయ్ వార్నింగ్...

కేసీఆర్‌కు సంజయ్ వార్నింగ్...

తెలంగాణలో పండించే పంటలో కేంద్రమే 60లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తోంది. కేవలంల 20లక్షల టన్నులే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలి. ఇతర రాష్ట్రాలు, విదేశాలకు ఎగుమతి చేసే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు.పక్క రాష్ట్రం కర్నూలులో పండించిన బియ్యం ఇక్కడికి వస్తున్నాయి.. కానీ ఈ రాష్ట్రంలో పండించిన బియ్యాన్ని రాష్ట్ర ప్రజలకు ఎందుకివ్వట్లేదు.బియ్యం కొనుగోలుకు కూడా కేంద్రమే పైసలు ఇస్తున్నది... కేజీ బియ్యానికి రూ.1 కేసీఆర్ ప్రభుత్వం ఇస్తుంటే... రూ.29 కేంద్రం ఇస్తోంది.రైతుల పొట్టకొట్టవద్దు.రైతులను బెదిరించవద్దు.ఎకరానికి 20 క్వింటాళ్లు మాత్రమే కొంటానని మొక్కజొన్న రైతులను బెదిరిస్తున్నాడు కేసీఆర్. రైతులను బెదిరిస్తే నీ ఫాం హౌస్‌కు వస్తా... నా కార్యకర్తలతో కలిసి ఫాంహౌస్‌ను దున్నేస్తా...' అని సంజయ్ హెచ్చరించారు.

ఆ హామీలు ఏమయ్యాయి...

ఆ హామీలు ఏమయ్యాయి...

'కామారెడ్డి ప్రజలకు కేసీఆర్ అనేక హామీలిచ్చి నిలబెట్టుకోలేకపోయారని సంజయ్ ఆరోపించారు.ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంటికో ఉద్యోగం అన్నాడు... డీఎస్సీ లేదు గ్రూప్ 1 లేదు... నిరుద్యోగ భృతి లేదు.. ఒక్కో నిరుద్యోగికి రూ.1లక్ష బాకీ ఉంది ప్రభుత్వం... డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టివ్వలేదు... 2లక్షల 91వేల ఇళ్లు ప్రధానమంత్రి ఆవాస్ యోజనా పథకం కింద కేంద్రం ఇస్తే... కామారెడ్డి ప్రజలకు వాటిని ఎందుకివ్వలేదో స్పష్టం చేయాలి. కేంద్రం మంజూరు చేసిన 3లక్షల ఇళ్లు సరిపోవు... మరిన్ని ఇళ్లు మంజూరు చేయించేందుకు కేసీఆర్‌ను నాతో ఢిల్లీకి రమ్మంటే రానంటున్నాడు. కేసీఆర్ నాతో పాటు రా... మోదీకి వద్దకు తీసుకెళ్లి 10 లక్షల ఇళ్లు మంజూరు చేయిస్తా...' అని సంజయ్ పేర్కొన్నారు.

బీజేపీ కార్యకర్తల పోరాటం వల్లే ఆర్టికల్ 370 రద్దు

బీజేపీ కార్యకర్తల పోరాటం వల్లే ఆర్టికల్ 370 రద్దు

కామారెడ్డిలో జర్నలిస్టులకు ఇళ్ల పట్టాలు ఇస్తానని చెప్పిన కేసీఆర్ ఆ హామీని నిలబెట్టుకోలేదని సంజయ్ పేర్కొన్నారు. రేవూరి సురేందర్ తన ప్రాణాన్ని త్యాగం చేసిన గడ్డ కామారెడ్డి అన్నారు. ఆనాడు నక్సలైట్లు ఆయన్ను చంపేస్తామని బెదిరించినా సరే భయపడలేదని... బీజేపీ కార్యకర్తగా నిజాయితీగా పనిచేశారని చెప్పుకొచ్చారు.ఆనాటి కరసేవకుల ప్రాణత్యాగాన్ని వృథాగా పోనివ్వొద్దనే.. ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మిస్తున్నారని చెప్పారు. ఆర్ఎస్ఎస్,బీజేపీ కార్యకర్తల వల్లే కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దయిందన్నారు.

ప్రజాసంగ్రామ యాత్ర.. ప్రజల దృష్టి మరల్చేందుకే వైట్ ఛాలెంజ్...

ప్రజాసంగ్రామ యాత్ర.. ప్రజల దృష్టి మరల్చేందుకే వైట్ ఛాలెంజ్...


ఇటీవల ఢిల్లీ వెళ్లి కేసీఆర్‌ను కలిసిన మోదీ... తెలంగాణ ప్రయోజనాల గురించి చర్చించలేదన్నారు. ప్రధానిని కలిసి బీజేపీ,టీఆర్ఎస్ ఒక్కటేనని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌తో కలిసి టీఆర్ఎస్ నాటకమాడుతోందని... పేదలు కష్టాల్లో ఉంటే డ్రగ్స్ ఛాలెంజ్‌ను ముందుకు తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ప్రజాసంగ్రామ యాత్ర నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే వైట్ ఛాలెంజ్‌ను ముందుకు తెచ్చారని అన్నారు. డ్రగ్స్ ఎవరు తీసుకుంటున్నారు... బలిసినోడు తీసుకుంటున్నాడు... అంటూ ఫైర్ అయ్యారు. రైతులకు మద్దతు ధర... రైతులకు రుణమాఫీ... రైతుల కష్టానికి ఫలితం దక్కాలని తాము మాట్లాడుతున్నామని అన్నారు.ఇవాళ తెలంగాణ రైతులు తాము కోటీశ్వరులు కావాలని కోరుకోవట్లేదన్నారు. ఏ రైతు లక్షాధికారి కావాలని కోరుకోవట్లేదన్నారు. కేవలం చేసిన అప్పులు తీరితే చాలనుకుంటున్నారని చెప్పారు. అలాంటిది... కేసీఆర్ మాత్రం ఎకరానికి రూ.1కోటి సంపాదిస్తున్నాడని... అందులో గంజాయి ఏమైనా పండిస్తున్నాడేమోనని విమర్శించారు.తెలంగాణ రాకముందు బతుకు బొగ్గుబాయి,బొంబాయి,దుబాయి అన్నట్లు ఉండేదని... ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉందన్నారు. ఉన్న కొద్దిపాటి భూమి అమ్ముకునో లేక తల్లి పుస్తెలతాడు,బంగారం,కుదవపెట్టి గల్ఫ్‌కి పోతే... చేసిన అప్పు తీర్చడానికే సరిపోతోందన్నారు. అలాంటి గల్ఫ్‌లో ఉన్న బిడ్డలను కేసీఆర్ తన మాటలతో అవమానించాడని మండిపడ్డారు.

Surya Kumar Yadav కి లక్కీగా Rahane బ్యాడ్ టైమ్.. మాజీలు ఆడేసుకుంటున్నారు!! || Oneindia Telugu
ఎంఐఎం వేర్లు పెకిలించేస్తా : బండి సంజయ్

ఎంఐఎం వేర్లు పెకిలించేస్తా : బండి సంజయ్

ప్రజల కష్టాలను తెలుసుకోవడానికి, కన్నీళ్లు తుడవడానికే ప్రజాసంగ్రామ యాత్ర చేపడుతున్నామని తెలిపారు.ఎన్నికల ముందు ఇచ్చిన ఏ హామీని కేసీఆర్ నెరవేర్చలేదన్నారు. 2023లో మళ్లీ వస్తాడు... మళ్లీ హామీలు ఇస్తాడు... మోసం చేసే మాటలు చెబుతాడని విమర్శించారు.తాను రైతులు,నిరుద్యోగం,స్థానిక సమస్యలు,దేశ సమస్యలు,రాష్ట్ర సమస్యలు అన్నింటి పైనా మాట్లాడుతున్నానని... కానీ మతతత్వ వ్యాఖ్యలు చేస్తున్నాడని తనపై ముద్ర వేస్తున్నారని మండిపడ్డారు. గతంలో 17 మందిపై ఎంఐఎం నేతలు దాడులు చేస్తే సంతోష్ అనే బీజేపీ కార్యకర్త చనిపోయాడన్నారు.ఆ ఘటనలో నిందితులను ఎందుకు అరెస్ట్ చేయలేదో టీఆర్ఎస్,కాంగ్రెస్ సమాధానం చెప్పాలన్నారు.హైదరాబాద్‌లో ఉన్న ఎంఐఎం వేర్లు కామారెడ్డిలో ఉన్నాయని... వాటిని పెకిలిస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు.తాను ఏ మతానికి వ్యతిరేకం కాదన్నారు.కామారెడ్డిలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగరాలన్నారు.

English summary
Bandi Sajay Padayatra-Telangana BJP chief Bandi Sanjay criticised CM KCR that he is not implemented any of his promise which were given in 2018 assembly elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X