వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మూడు రోజులుగా కేసీఆర్ దోష నివారణ పూజలు .. కేటీఆర్ సీఎం కావాలనే కాళేశ్వరం టూర్ : బండి సంజయ్ సంచలనం

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ సీఎం అవుతారని ఊహాగానాలు పెద్దఎత్తున కొనసాగుతున్నాయి. అందుకు తగ్గట్టుగా టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు కేటీఆర్ సీఎం అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సీఎంగా కేటీఆర్ ను చూడటం కోసం అకస్మాత్తుగా సీఎం కేసీఆర్ సాగించిన కాళేశ్వరం టూర్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

కేసీఆర్ తోపుగాడు ఏం కాదు, బడా చోర్ సీఎం .. భద్రకాళీ ఆలయంలో ప్రమాణానికి సిద్ధమా ? బండి సంజయ్ సవాల్కేసీఆర్ తోపుగాడు ఏం కాదు, బడా చోర్ సీఎం .. భద్రకాళీ ఆలయంలో ప్రమాణానికి సిద్ధమా ? బండి సంజయ్ సవాల్

 కేసీఆర్ అకస్మాత్ కాళేశ్వరం టూర్ వెనుక రహస్యమిదే

కేసీఆర్ అకస్మాత్ కాళేశ్వరం టూర్ వెనుక రహస్యమిదే

సీఎం కేసీఆర్ నిన్న కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శించిన విషయం తెలిసిందే. అయితే ఆయన కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని సతీసమేతంగా దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించి కాళేశ్వరం ప్రాజెక్టు ను సందర్శించారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ పర్యటన పై ప్రతిపక్ష పార్టీలు ఆసక్తికర చర్చ చేస్తున్నాయి. అందులో భాగంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. సీఎం కేసీఆర్ నిన్న అకస్మాత్తుగా కాళేశ్వరం వెళ్లడం వెనుక రహస్యమిదే అంటూ మాట్లాడిన బండి సంజయ్ అకస్మాత్తుగా సీఎం కేసీఆర్, తన శ్రీమతిని వెంటబెట్టుకొని కాళేశ్వరం వెళ్లడం ఆయన కల సాకారమైనందుకే నని చెప్పుకుంటున్నారు అంటూ పేర్కొన్నారు.

ఫామ్ హౌస్ లో దోష నివారణ పూజలు చేసి , కాళేశ్వరంలో కలిపారన్న బండి సంజయ్

ఫామ్ హౌస్ లో దోష నివారణ పూజలు చేసి , కాళేశ్వరంలో కలిపారన్న బండి సంజయ్

మూడు రోజులుగా ఆయన తన ఫామ్ హౌస్ లో దోష నివారణ పూజలు చేశారని, ఇక వాటిని కాళేశ్వరంలో కలపడానికే వెళ్లాడని బండి సంజయ్ విమర్శించారు. కొడుకును సీఎం చేయడం కోసం పూజలు చేసి, యాగాలు చేసి కెసిఆర్ కాళేశ్వరం వెళ్లాడని విమర్శించారు. కెసిఆర్ యజ్ఞాలు, పూజలు అన్ని స్వార్థం కోసమే అంటూ బండి సంజయ్ నిప్పులు చెరిగారు. ఎవరు ఊహించని విధంగా, అకస్మాత్తుగా సీఎం కేసీఆర్ కాళేశ్వరం పర్యటన దేనికని అందరికీ అనుమానం వచ్చింది పేర్కొన్న బండి సంజయ్ తెలంగాణ ప్రజలకు కెసిఆర్ కథలు అన్నీ తెలుసు అంటూ వ్యాఖ్యానించారు.

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తనకు చెప్పారన్న బీజేపీ తెలంగాణా చీఫ్

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తనకు చెప్పారన్న బీజేపీ తెలంగాణా చీఫ్

సీఎం కాళేశ్వరం ఎందుకు వెళ్లారో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తనకు చెప్పారని పేర్కొన్న ఆయన, తెలంగాణ ఉద్యమ ద్రోహులే కేటీఆర్ సీఎం కావాలని కోరుకుంటున్నారని విమర్శించారు. నటించడం, మోసం చేయడం అబద్దాలు చెప్పడం వంటివాటిలో కెసిఆర్ దిట్ట అని పేర్కొన్న బండి సంజయ్ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారిని కాకుండా కొడుకుని సీఎం చేస్తున్నాడని, దళితుడిని సీఎం చేస్తానని ప్రకటించిన మాట ఏమైంది అని ప్రశ్నించారు.

సీఎం కావాలని ఈరోజు పూజల్లో కేటీఆర్ ... అందుకే అన్ని కార్యక్రమాల రద్దు

సీఎం కావాలని ఈరోజు పూజల్లో కేటీఆర్ ... అందుకే అన్ని కార్యక్రమాల రద్దు

మరోవైపు కేటీఆర్ సీఎం అంటూ టిఆర్ఎస్ నేతలు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్ ముఖ్యమంత్రి పదవికి కేటీఆర్ సమర్ధుడు అని వ్యాఖ్యానించడం, ఈటెల రాజేందర్ సైతం కేటీఆర్ సీఎం అయితే తప్పేంటి అని వ్యాఖ్యానించడం కేటీఆర్ ని సీఎం చేయడానికి కెసిఆర్ నిర్ణయం తీసుకున్నట్లు గా అందుకోసమే ఈ లీకులు ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. దీంతో తాజాగా జరుగుతున్న పరిణామాలను విశ్లేషించిన బండి సంజయ్ ఈరోజు కేటీఆర్ తన కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు. ఎందుకంటే కేటీఆర్ సీఎం కావటం కోసం ఇంట్లో ప్రత్యేక పూజలు ఉన్నాయంటూ వ్యాఖ్యానించారు.

 కేటీఆర్ ను సీఎంను చేయాలని ప్రగతి భవన్ లో టీవీలు పగులుతున్నాయట

కేటీఆర్ ను సీఎంను చేయాలని ప్రగతి భవన్ లో టీవీలు పగులుతున్నాయట

అంతేకాదు కేటీఆర్ ను సీఎంను చేయాలని ప్రగతి భవన్ లో టీవీలు పగులుతున్నాయి అన్న బండి సంజయ్, ఇక ఈ విషయాన్ని టిఆర్ఎస్ పార్టీ నేతలే చెబుతున్నారు అంటూ సెటైర్లు వేశారు. మొత్తానికి మూడు రోజులుగా సీఎం కేసీఆర్ దోష నివారణ పూజలు చేశారని, కాళేశ్వరం వెళ్లి గోదావరిలో కలిపి వచ్చారని, ఇక ఈ రోజు కొడుకు కేటీఆర్ తో ప్రత్యేక పూజలు చేయిస్తున్నారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్.

English summary
Bandi Sanjay criticized that KCR had done Dosha prevention pujas at his farm house for three days and then went to mix them in Kaleswaram. KCR was criticized for going to Kaleswaram after performing pujas and to make his son the CM. KCR Yajnas and pujas are all for selfishness, said Bandi Sanjay. Unexpectedly, all of a sudden everyone got suspicious of CM KCR Kaleswaram's visit. Bandi Sanjay commented that the people of Telangana know all the stories of KCR.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X