
కేసీఆర్ కుటుంబం జైలుకే: బండి సంజయ్ హెచ్చరిక, త్వరలో బస్సు యాత్ర!
హైదరాబాద్: తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రాన్ని దోచుకుంటున్న కేసీఆర్ కుటుంబాన్ని జైలుకు పంపిస్తామన్నారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. తెలంగాణ నిధులను పెట్టుబడులుగా పెట్టి లిక్కర్ దందాను కేసీఆర్ కూతురు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. సీఎం కేసీఆర్ అబద్దాలు మాట్లాడుతూ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. పాదయాత్రలో భాగంగా నిర్మల్‌లోని శివాజీ చౌక్‌లో ప్రజలనుద్దేశించి బండి సంజయ్ ప్రసంగించారు.

తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చుతామని ప్రధాని మోడీ ఎప్పుడన్నారని ప్రశ్నించారు. కేసీఆర్ ఎప్పుడూ అబద్ధాలే చెబుతారని మండిపడ్డారు. తెలంగాణకు ప్రధాని నరేంద్ర మోడీ వచ్చినా సభలకు వెళ్లలేని దద్దమ్మ ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 12 శాతం ముస్లిం ఓట్లున్న బీహార్‌లో ఎంఐఎం పార్టీ ఐదు సీట్లను గెలిస్తే...80 శాతం హిందూ ఓట్లు ఉన్న తెలంగాణలో బీజేపీ ఎందుకు గెలవలేదని బండి సంజయ్ అని ప్రశ్నించారు. మహిళలకు రక్షణ కల్పించే పార్టీ కేవలం బీజేపీయే అని చెప్పారు. లవ్ జిహాద్ పేరుతో హిందూ అమ్మాయిలను ట్రాప్ చేయాలని చూస్తే తాటతీస్తామని హెచ్చరించారు. లవ్ జిహాద్ పేరుతో హిందూ అమ్మాయిలను హత్య చేస్తే కుహనావాదులు, మహిళా సంఘాలు ఎక్కడికి పోయారని నిలదీశారు. హిందూ ధర్మాన్ని, హిందూ దేవతలను కాపాడుకునే బాధ్యత ప్రతి హిందువుపై ఉందన్నారు.
పట్టా భూములు, చెరువు కబ్జాలు చేసి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి రూ. 100 కోట్లు జేబులో వేసుకున్నారని బండి సంజయ్ ఆరోపించారు. నిర్మల్ మున్సిపల్ కార్యాలయంలో నాలుగో తరగతి ఉద్యోగాలు ఇప్పిస్తామని రూ. 10 లక్షలు తీసుకున్నవారు.. జనవరి 10వ తేదీ వరకు బాధితులకు తిరిగి చెల్లించాలని డిమాండ్ చేశారు. లేదంటే నిర్మల్ లో బీజేపీ ఆధ్వర్యంలో భారీ ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. నిర్మల్‌లో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్లను మంత్రి, కలెక్టర్ కలిసి ఒక వర్గం వారికి, తమ అనుచరులకే కేటాయించారన్నారు. నిర్మల్‌లోని మినీ స్టేడియంలో ఒక్క గజం కబ్జా చేసినా ఊరుకోమన్నారు.
Live : Corner Meeting at Shivaji Chowk, Nirmal Town. https://t.co/9ZVIBiMqhc
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) December 4, 2022
నిర్మల్ నియోజకవర్గాన్ని ఒక్కసారి తమకు అప్పగించాలని బీజేపీ నేత బండి సంజయ్ కోరారు. అభివృద్ధి ఏంటో చూపిస్తామన్నారు. భైంసాతోపాటు నిర్మల్, ముధోల్ నియోజకవర్గాల్లో కాషాయ జెండాను ఎగరవేసి ఎంఐఎం ఆగడాలను అరికడతామన్నారు. పార్లమెంటులో సుష్మా స్వరాజ్ జై తెలంగాణ అని మద్దతు తెలపడం వల్లే తెలంగాణ ఏర్పడిందన్నారు. బీజేపీ మద్దతుతో ఏర్పడిన తెలంగాణను దోచుకు తింటున్న కేసీఆర్ మాయ మాటలు, మోసపూరిత వాగ్దానాలను నమ్మవద్దని సూచించారు. ఆలోచించి ఓటు వేయండి..బీజేపీ అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలన్నీ మరింత మెరుగ్గా కొనసాగిస్తామని హామీ ఇచ్చారు బండి సంజయ్.
This video is dedicated to you @trsharish never underestimate the power of @BJP4Telangana.
— 𝓡𝓪𝓱𝓾𝓵 𝓝𝓮𝓽𝓱𝓲𝓴𝓪𝓻 (RN) 🇮🇳 (@Nethikar4BJP) December 4, 2022
Our beloved leader @bandisanjay_bjp addressing the people at shivaji chowk. pic.twitter.com/Q5xkF6F9zb
మరోవైపు, సీఎం కేసీఆర్ త్వరలోనే అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతుండటంతో బీజేపీ రాష్ట్ర నాయకత్వం అందుకు అనుగుణంగా తమ వ్యూహాలకు పదునుపెడుతోంది. ఎన్నికలు ఎప్పుడొచ్చిన సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తోంది. ఇక ఇప్పటికే నిర్వహిస్తున్న పాదయాత్ర స్థానంలో బస్సు యాత్ర చేపట్టాలని బీజేపీ నేతలు కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. పాదయాత్ర ఎక్కువగా సమయం తీసుకుంటుండటంతో అన్ని నియోజకవర్గాలను చుట్టేందుకు బస్సు యాత్రే మంచిదని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే త్వరలో హైదరాబాద్ జంట నగరాల్లో బస్సు యాత్ర చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.