హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబు వద్ద లాబీయింగ్ చేసినా దక్కలేదు, బండ్ల గణేష్‌కు కాంగ్రెస్ కీలక పదవి

|
Google Oneindia TeluguNews

Recommended Video

Telangana Elections 2018 : తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధిగా బండ్ల గణేష్‌

హైదరాబాద్: రాజేంద్రనగర్ టిక్కెట్ ఆశించి భంగపడిన ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్‌కు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కీలక పదవిని ఇచ్చింది. ఈ మేరకు తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సోమవారం ప్రకటన విడుదల చేశారు.

<strong>నోరు కట్టుకొని...: మీటింగ్ ముగించాలన్న పోలీసులు, రేవంత్ రెడ్డి ఏం చేశారంటే?</strong>నోరు కట్టుకొని...: మీటింగ్ ముగించాలన్న పోలీసులు, రేవంత్ రెడ్డి ఏం చేశారంటే?

సినీ నిర్మాత బండ్ల గణేష్‌ను తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధిగా నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రముఖ నిర్మాత బీఏ రాజు కూడా ఈ విషయాన్ని తన సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. బండ్ల గణేష్ టీపీసీసీ అధికార ప్రతినిధిగా నియమితులయ్యారని పేర్కొన్నారు.

చంద్రబాబు వద్ద లాబీయింగ్ చేసినా

చంద్రబాబు వద్ద లాబీయింగ్ చేసినా

నటుడి నుంచి నిర్మాతగా ఎదిగి, ఆ తర్వాత ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన బండ్ల గణేష్ రాజేంద్రనగర్ స్థానం నుంచి పోటీ చేయాలని భావించారు. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు వద్ద కూడా ఆయన లాబీయింగ్ చేసినట్లుగా వార్తలు వచ్చాయి. చంద్రబాబు ఢిల్లీకి వెళ్లినప్పుడు అక్కడ బండ్ల ఆయనను కలిశారు.

 అసంతృప్తి, ఈ పదవితో బుజ్జగింపు!

అసంతృప్తి, ఈ పదవితో బుజ్జగింపు!

రాజేంద్రనగర్ నుంచి తాను కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తానని, కాబట్టి మహాకూటమి పొత్తులో భాగంగా ఆ సీటును తెలుగుదేశం పార్టీ కోరుకోవద్దని, ఆ సీటును తనకు వదిలేయాలని ఆయన చంద్రబాబు వద్ద విజ్ఞప్తి చేసినట్లుగా వార్తలు వచ్చాయి. కానీ కాంగ్రెస్ పార్టీ ఆయనకు ఆ టిక్కెట్ ఇవ్వలేదు. దీంతో ఆయన ఒకింత అసంతృప్తికి లోనయ్యారు. ఇప్పుడు ఆయనకు అధికార ప్రతినిధి పదవిని కట్టబెట్టింది.

మహాకూటమిలో భాగంగా టీడీపీకి సీటు

మహాకూటమిలో భాగంగా టీడీపీకి సీటు

బండ్ల గణేష్ రాజేంద్ర నగర్ లేదంటే షాద్ నగర్ స్థానం నుంచి పోటీ చేస్తారని ప్రచారం సాగింది. చంద్రబాబును కోరినప్పటికీ రాజేంద్రనగర్ స్థానం తెలుగుదేశం పార్టీకి వెళ్లింది. ఇక్కడి నుంచి మహాకూటమి తరఫున టీడీపీ నేత గణేష్ గుప్తా పోటీ చేస్తున్నారు. రాజేంద్రనగర్ సీటును సబితా ఇంద్రా రెడ్డి తనయుడు కార్తీక్ రెడ్డి కూడా ఆశించారు. కానీ దక్కలేదు.

 పలువురు అసంతృప్తులు

పలువురు అసంతృప్తులు

మహాకూటమిలో భాగంగా పలు చోట్ల ఇతర పార్టీలు సీట్లు దక్కించుకున్నాయి. దీంతో కాంగ్రెస్ నేతల్లో తీవ్ర అసంతృప్తి రాజుకుంది. వారంతా కలిసి కాంగ్రెస్ రెబల్స్ కూటమిగా ఏర్పడి పోటీ చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఇప్పటికే పలువురు నేతలు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల పర్వం సోమవారం మధ్యాహ్నం మూడు గంటలతో పూర్తయింది.

English summary
Tollywood producer Bandla Ganesh on monday appointed as official spokesperson of Telangana Pradesh Congress Committee.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X