వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్‌నుంచి పోటీచేస్తా, ఆ సీటు అడగకండి: బాబు వద్ద బండ్ల గణేష్ లాబీయింగ్, టీ కాంగ్రెస్ క్యూ

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును ఢిల్లీలోని ఏపీ భవన్‌లో శనివారం పలువురు కాంగ్రెస్ నేతలు కలుసుకున్నారు. ముఖ్యంగా ఆయన వద్దకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు క్యూ కట్టారు.

Recommended Video

Telangana Elections 2018 : కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా సిద్ధం

<strong>'కొత్త దోస్తీ'తో చక్రం తిప్పుతారా: తెలంగాణపై బీజేపీ 'థర్డ్' ఆలోచన, 20 సీట్లపై కన్ను</strong>'కొత్త దోస్తీ'తో చక్రం తిప్పుతారా: తెలంగాణపై బీజేపీ 'థర్డ్' ఆలోచన, 20 సీట్లపై కన్ను

తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, గజ్వెల్ కాంగ్రెస్ నేత వంటేరు ప్రతాప్ రెడ్డి, డీ శ్రీనివాస్ తదితరులు కలిశారు. కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్ కూడా ఏపీ సీఎంను కలిశారు. ఆయన గత సెప్టెంబర్‌లో ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు.

రాజేంద్రనగర్ సీటు

రాజేంద్రనగర్ సీటు

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బండ్ల గణేష్ పోటీ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇందులో భాగంగా రాజేంద్రనగర్ సీటును ఆశిస్తున్నారని తెలుస్తోంది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలిచారు. ఇప్పుడు మహాకూటమిలో భాగంగా దీనిని టీడీపీ అడుగుతోంది. అలాగే కాంగ్రెస్ కోరుకుంటోంది.

ఆ సీటు నేను కోరుకుంటున్నా.. ప్లీజ్ అడగకండి: చంద్రబాబుతో గణేష్

ఆ సీటు నేను కోరుకుంటున్నా.. ప్లీజ్ అడగకండి: చంద్రబాబుతో గణేష్

రాజేంద్రనగర్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసేందుకు బండ్ల గణేష్ ఆసక్తితో ఉన్నారని తెలుస్తోంది. ఇందుకోసం ఆయన చంద్రబాబును ఢిల్లీలోని ఏపీ భవన్లో కలిశారు. రాజేంద్రనగర్ సీటును కాంగ్రెస్ పార్టీ తరఫున తాను ఆశీస్తున్నానని, తెలుగుదేశం పార్టీ నేతలు పట్టుబట్టకుండా చూడాలని బండ్ల గణేష్ తెలుగుదేశం పార్టీ అధినేతను కోరారని తెలుస్తోంది.

షాద్ నగర్ నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగినా

షాద్ నగర్ నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగినా

తొలుత బండ్ల గణేష్ షాద్ నగర్ నుంచి పోటీ చేస్తారని మీడియాలో ప్రచారం సాగింది. షాద్ నగర్ పరిసర గ్రామాల్లో గణేష్‌కు స్థానికులతో కొంత పరిచయం ఉందని, అందుకే ఆయన అక్కడి నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తారనే వాదనలు వినిపించాయి. కానీ తాజాగా ఆయన చంద్రబాబును కలిసి రాజేంద్రనగర్ సీటు తనకు వదిలేయాలని కోరారని తెలుస్తోంది.

బండ్ల గణేష్ అందుకే రాజేంద్రనగర్ కోరుకుంటున్నారా?

బండ్ల గణేష్ అందుకే రాజేంద్రనగర్ కోరుకుంటున్నారా?

బండ్ల గణేష్ తొలుత షాద్ నగర్ స్థానాన్ని ఆశించినప్పటికీ అది 2014లో పోటీ చేసిన ప్రతాప్ రెడ్డికే ఇవ్వడంతో ఆయన రాజేంద్రనగర్‌లో పోటీకి ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తోంది. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి అంజయ్య యాదవ్ గెలిచారు. ఆయనకే టీఆర్ఎస్ మళ్లీ టిక్కెట్ ఇచ్చింది. 2014లో కాంగ్రెస్ అభ్యర్థి చౌలపల్లి ప్రతాప్ రెడ్డిపై 17వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఈసారి కూడా కాంగ్రెస్ ఆయనకే టిక్కెట్ ఇచ్చింది. దీంతో బండ్ల గణేష్ రాజేంద్ర నగర్ కోరుకుంటున్నారని సమాచారం.

English summary
Tollywood producer Bandla Ganesh met AP CM Nara Chandrababu Naidu for Rajendra Nagar ticket in telangana assembly elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X