బండి శభాష్.!బాగా పనిచేస్తున్నారు.!ఫోన్ ద్వారా ప్రధాని ప్రశంసలు.!పరవశించిపోయిన బండి సంజయ్.!
ఢిల్లీ/హైదరాబాద్ : ఒక్క పలకరింపు, ఒక్క కుశల ప్రశ్న, ఒక్క చిరునవ్వు ఎంతో సంతృప్తిగా పరిణమిస్తుంది. తాను పడ్డ కష్టం మొత్తం ఆ పలకరింపుతో పాటాపంచలై నూతన శక్తి సంతరించుకుంటుంది. బీజేపి తెలంగాణ అద్యక్షుడు బండి సంజయ్ అంశంలో ఇదే జరిగింది. ఒక్క ఫోన్ కాల్ బండి సంజయ్ కు వంద సునామీల బలాన్నిచ్చినట్టు తెలుస్తోంది. ఎర్రటి ఎండలో 31రోజులుగా పాదయాత్ర చేసిన బండి సంజయ్ కుమార్ కు ప్రధాన మంత్రి నుండి ఫోన్ రాగానే సంభ్రమాశ్చర్యాలకు గురైనట్టు తెలుస్తోంది. ఇక మోదీ వేసిన కుశల ప్రశ్నలకు బండి సంజయ్ ఉబ్బితబ్బిబ్బైపోయారని తెలుస్తోంది.

శభాష్ బండి.. కష్టపడి పని చేస్తున్నారని పీఎం ఫోన్ కాల్ పలకరింపు..
ప్రజా సంగ్రామ యాత్ర రెండో విడత పూర్తి చేసుకున్న రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొద్ది సేపటి క్రితం ఫోన్ చేశారు. సాయి గణేశ్ కుటుంబాన్ని పరామర్శించేందుకు ఖమ్మం వెళ్తుండగా మార్గ మధ్యలో బండి సంజయ్ కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నుంచి కాల్ వచ్చింది. కష్టపడి పని చేస్తున్నారంటూ బండి సంజయ్ కుమార్ ను మోదీ అభినందించారు. ప్రజా సంగ్రామ సేనతోపాటు పాదయాత్రలో పాల్గొన్న కార్యకర్తలకు అభినందనలు చెప్పాలని సంజయ్ కుమార్ కు ప్రధాని మోదీ సూచించారు.

తుక్కుగూడ సభ విజయవంతం.. ప్రజా సంగ్రామ యాత్ర పై ప్రధాని ఆరా..
ప్రధాని
మోదీ
కాల్
చేయడంతో
బండి
సంజయ్
పరవశించిపోయారు.
మోదీ
తో
ఉద్వేగ
భరితంగా
మాట్లాడారు.
తమరి
స్ఫూర్తితో,
సూచనలతోనే
పాదయాత్ర
చేపట్టానని,
రెండు
విడతల్లో
కలిపి
770
కి.మీలు
నడిచానని
మోదీకి
బండి
సంజయ్
వివరించారు.
నడిచింది
తానయినా,
నడిపించింది
తమరేనిన
అన్నారు.
తమరు
చెప్పిన
సబ్
కా
సాథ్,
సబ్
కా
వికాస్,
సబ్
కా
విశ్వాస్,
సబ్
కా
ప్రయాస్
పాలన
రాష్ట్రంలో
తెచ్చేందుకు
పాదయాత్ర
చేస్తున్నామని
బండి
సంజయ్
ప్రధానికి
వివరించారు.
పాదయాత్రలో
ప్రజలు
ఏమంటున్నారని
సంజయ్
ను
మోదీ
ప్రశ్నించారు.
చంద్రశేఖర్
రావు
పాలనపై
తీవ్ర
ఆగ్రహంతో
ఉన్నారని
బండి
సంజయ్
మోదీ
కి
వివరించారు.

పాదయాత్ర చేసిన కార్యకర్తలకు ప్రత్యేక అభినందనలు.. తెలంగాణపై ప్రధాని ప్రత్యేక ఫోకస్
కేంద్ర
పథకాలు
తెలంగాణలో
అమలు
చేయకుండా
చంద్రశేఖర్
రావు
తెరమరుగు
చేసే
కుట్ర
చేస్తున్నారని
బండి
సంజయ్
వివరించారు.
పాదయాత్రలో
కేంద్రం
పేదల
కోసం
అమలు
చేస్తున్న
పథకాలను
వివరిస్తుండంతో
చంద్రశేఖర్
రావు
పై
ప్రజలు
తీవ్ర
అసంతృప్తితో
ఉన్నారని
సంజయ్
స్పష్టం
చేసారు.
తెలంగాణ
లోనూ
తమరి
లాంటి
నీతివంతమైన
పాలన
కావాలని
ప్రజలు
కోరుకుంటున్నారని
బండి
సంజయ్
వివరించారు.
కష్టాల్లో
ఉన్న
ప్రజలకు
భరోసా
ఇచ్చానని
ప్రధానికి
బండి
సంజయ్
తెలిపే
ప్రయత్నం
చేసారు.

నడిచింది నేనైనా.. నడిపించింది మీ సంకల్పమే సర్.. ప్రధానికి వివరించిన సంజయ్
కేంద్ర
హోం
మంత్రి
అమిత్
షా,
బిజెపి
జాతీయ
అధ్యక్షులు
జె.పి.
నడ్డాల
రాకతో
కార్యకర్తల్లో
మరింత
జోష్
పెరిగిందని
బండి
సంజయ్
వివరించారు.
రాష్ట్ర
ఇంచార్జ్
తరుణ్
చుగ్
సూచనలు
సత్ఫలితాలు
ఇచ్చాయని
బండి
సంజయ్
మోదీకి
తెలిపారు
తమరి
స్పూర్తితో
కార్యకర్తలు,
శ్రేణులు
పార్టీ
బలోపేతం
కోసం
కష్టపడి
పనిచేస్తున్నారని
బండి
సంజయ్
తెలిపారు.
ప్రధానమంత్రి
కాల్
తో
కార్యకర్తల్లో
నూతనోత్సాహం
వస్తుందంటూ
బండి
సంజయ్
సంతోషం
వ్యక్తం
చేసారు.
ఇలాంటి
ప్రజా
కార్యక్రమాలనే
మరికొన్నింటిని
రూపొందించుకొని
ముందుకు
వెళ్లాల్సిందిగా
బండి
సంజయ్
కు
మోదీ
సూచించారు.