హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆకట్టుకున్న ‘బంగారు తెలంగాణ’ నాటకం(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సమాజంలో పరివర్తన తెచ్చి సామాజిక స్పృహను రగిలించేదే నాటకమని తెలంగాణ శాసనసభ స్పీకర్‌ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. వంశీ థియేటర్‌ ఆర్ట్స్ ఇంటర్నేషనల్ 42వ వార్షికోత్సవం సందర్భంగా రవీంద్రభారతిలో మూడురోజులపాటు నిర్వహించనున్న ‘బంగారు తెలంగాణ' నాటకోత్సవాలను మధుసూదనాచారి శుక్రవారం ప్రారంభించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. గతంలో నాటకాలకు మంచి ఆదరణ ఉండేదన్నారు. నాటకాలు కూడా స్ఫూర్తి, చైతన్యం నింపేవిగా ఉండేవన్నారు. ప్రస్తుతం నాటకాలకు ఆదరణ తగ్గిందన్నారు. బంగారు తెలంగాణ కోసం నాటకరంగం కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వ సలహాదారు కేవీ రమణచారి మాట్లాడుతూ వంశీ సంస్థ కళారంగాన్ని ప్రొత్సహించాలన్నారు.

త్వరలో సురభి సప్తాహం నిర్వహిస్తామన్నారు. రచయిత సిఎస్‌రావు మాట్లాడుతూ.. భాషను బతికించాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం నాటక పోటీలను నిర్వహించాల్సిన అవసరముందన్నారు. అనంతరం కాళోజీపై ప్రయోగాత్మక నాటిక ‘నా కవితలు- నా కలలు'తోపాటు కుటుంబ విలువలు తెలిపే ‘ఇక్కడ కాసేపు ఆగుదాం', కుక్క నాటికలను ప్రదర్శించారు. నటీనటులు అద్భుత నటనతో ప్రేక్షకుల మనసు దోచుకున్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్ దీక్షిత్, దైవజ్ఞ శర్మ, నిర్వాహకులు వంశీ రామారాజు, తేనేటి సుధాదేవి, శైలజ పాల్గొన్నారు.

నాటక ప్రారంభోత్సవం

నాటక ప్రారంభోత్సవం

సమాజంలో పరివర్తన తెచ్చి సామాజిక స్పృహను రగిలించేదే నాటకమని తెలంగాణ శాసనసభ స్పీకర్‌ సిరికొండ మధుసూదనాచారి అన్నారు.

మధుసూదనాచారి

మధుసూదనాచారి

వంశీ థియేటర్‌ ఆర్ట్స్ ఇంటర్నేషనల్ 42వ వార్షికోత్సవం సందర్భంగా రవీంద్రభారతిలో మూడురోజులపాటు నిర్వహించనున్న ‘బంగారు తెలంగాణ' నాటకోత్సవాలను మధుసూదనాచారి శుక్రవారం ప్రారంభించారు.

ఆకట్టుకున్న నాటకం

ఆకట్టుకున్న నాటకం

అనంతరం మధుసూదనాచారి మాట్లాడుతూ.. గతంలో నాటకాలకు మంచి ఆదరణ ఉండేదన్నారు.

ఆకట్టుకున్న నాటకం

ఆకట్టుకున్న నాటకం

నాటకాలు కూడా స్ఫూర్తి, చైతన్యం నింపేవిగా ఉండేవన్నారు. ప్రస్తుతం నాటకాలకు ఆదరణ తగ్గిందన్నారు.

ఆకట్టుకున్న నాటకం

ఆకట్టుకున్న నాటకం

బంగారు తెలంగాణ కోసం నాటకరంగం కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వ సలహాదారు కేవీ రమణచారి మాట్లాడుతూ వంశీ సంస్థ కళారంగాన్ని ప్రొత్సహించాలన్నారు.

ఆకట్టుకున్న నాటకం

ఆకట్టుకున్న నాటకం

త్వరలో సురభి సప్తాహం నిర్వహిస్తామన్నారు. రచయిత సిఎస్‌రావు మాట్లాడుతూ.. భాషను బతికించాలని కోరారు.

ఆకట్టుకున్న నాటకం

ఆకట్టుకున్న నాటకం

తెలంగాణ ప్రభుత్వం నాటక పోటీలను నిర్వహించాల్సిన అవసరముందని సిఎస్ రావు అన్నారు.

ఆకట్టుకున్న నాటకం

ఆకట్టుకున్న నాటకం

అనంతరం కాళోజీపై ప్రయోగాత్మక నాటిక ‘నా కవితలు- నా కలలు'తోపాటు కుటుంబ విలువలు తెలిపే ‘ఇక్కడ కాసేపు ఆగుదాం', కుక్క నాటికలను ప్రదర్శించారు.

ఆకట్టుకున్న నాటకం

ఆకట్టుకున్న నాటకం

నటీనటులు అద్భుత నటనతో ప్రేక్షకుల మనసు దోచుకున్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్ దీక్షిత్, దైవజ్ఞ శర్మ, నిర్వాహకులు వంశీ రామారాజు, తేనేటి సుధాదేవి, శైలజ పాల్గొన్నారు.

English summary
Bangaru Telangana drama performed some artists at Ravindra bharathi, Hyderabad on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X