హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్ బ్యాంకులో కరోనా కలకలం.. 11 మంది క్వారెంటైన్‌కు తరలింపు..

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌లో కరోనా వ్యాప్తి ఆగట్లేదు. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రతీరోజూ కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. తాజాగా ఈ వైరస్ బ్యాంకులను కూడా తాకింది. పురానా పూల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ)లో డబ్బులు విత్ డ్రా చేసుకున్నవారిలో ఓ మహిళకు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. దీంతో అధికారులు అప్రమత్తమై ఎస్‌బీఐలోని 11 మంది సిబ్బందిని క్వారెంటైన్‌కు తరలించారు.

Recommended Video

Coronavirus Tension In Hyderabad SBI Bank, 11 Employees Sent To Quarantine

 మీ మొబైల్ ఫోన్లు మంచి కరోనా వాహకాలు! జాగ్రత్తలు తీసుకోకుంటే అంతే సంగతులు మీ మొబైల్ ఫోన్లు మంచి కరోనా వాహకాలు! జాగ్రత్తలు తీసుకోకుంటే అంతే సంగతులు

కరోనా పాజిటివ్‌గా తేలిన ఆ మహిళ శనివారం మధ్యాహ్నం బ్యాంకుకు వచ్చినట్టు అనుమానిస్తున్నారు.బాధిత మహిళ కంటైన్మెంట్ జోన్ నుంచి మహిళ బ్యాంకుకు వచ్చినట్టుగా అధికారులు నిర్ధారించారు. ఇప్పటికే అన్ని కంటైన్‌మెంట్ పరిసర ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ అధికారులు ఇంటింటికీ సర్వే నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా లక్షణాలు ఉన్నవారిని గుర్తించి ఆసుపత్రికి తరలిస్తున్నారు.

bank employees sent to quarantine after coronavirus positive woman visited

కాగా,కరోనా లాక్ డౌన్ కారణంగా మొన్నటివరకు మూతపడ్డ బ్యాంకులు సడలింపులతో తిరిగి తెరుచుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కొద్దిమంది సిబ్బందితో బ్యాంకులు నడుస్తున్నాయి. రాష్ట్రంలో కరోనా కేసుల విషయానికొస్తే... జీహెచ్ఎంసీ పరిధిలో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి.శనివారం నాడు మాదన్నపేటలోని ఒకే అపార్ట్‌మెంట్‌లో 28 మంది కరోనా బారిన పడటం కలకలం రేపింది. ఇప్పటివరకూ రాష్ట్రంలో 1509 కరోనా కేసులు నమోదవగా.. 34 మంది మృత్యువాతపడ్డారు. 971 మంది కోలుకుని డిశ్చార్జి అవగా.. ప్రస్తుతం 504 పాజిటివ్ కేసులు కొనసాగుతున్నాయి.

English summary
A woman who withdrawn cash from a SBI in Puranapool tested coronavirus positive,though that 11 employees of the bank sent into quarantine.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X