వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉల్లి మార్కెట్ బంద్ కు పెద్ద నగదు నోట్ల రద్దే కారణం

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: పెద్ద నగదు నోట్ల రద్దు ఉల్లి మార్కెట్ పై పడింది. ఏకంగా మార్కెట్ ను మూసివేశారు వ్యాపారులు. పెద్ద నగదు నోట్లు రద్దు కావడం, చిల్లర నగదు నోట్లు అందరికీ అందుబాటులోకి రాని కారణంగా హైద్రాబాద్ లోని ఉల్లి మార్కెట్ ను బంద్ చేశారు.

పెద్ద నగదు నోట్ల రద్దు ప్రభావం అందరిపై ఉంది. కొందరు వ్యాపారులు రద్దు చేసిన నగదు నోట్లను తీసుకొనేందుకు ముందుకు వస్తున్నారు. అయితే చిల్లర నగదు అందుబాటులో లేని కారణంగా క్రయవిక్రయాలకు ఇబ్బందులు ఎదురౌతున్నాయి.

banned currency effect on an onion market

ఉల్లగడ్డ రైతులు ప్రతి రోజు హైద్రాబాద్ లో ని మలక్ పేట మార్కెట్ లో విక్రయాలు చేస్తుంటారు.తాము పండించిన ఉల్లిగడ్డను ఈ మార్కెట్ లో విక్రయిస్తుంటారు. అయితే పెద్ద నగదు నోట్ల రద్దు తో ఈ నోట్లను తీసుకొనేందుకు రైతులు ముందుకు రావడం లేదు. తమ సరుకును విక్రయించిన తర్వాత రద్దుచేసిన నగదును తీసుకోవడానికి రైతులు అంగీకరించడం లేదు.

మార్కెట్ ను మూసివేయడమే శరణ్యంగా భావించారు వ్యాపారులు. మార్కెట్ మూతపడిన కారణంగా ఉల్లిగడ్డ క్రయవిక్రయాలు నిలిచిపోయాయి.ప్రతి రోజు ఈ మార్కెట్ కు 60 నుండి 70 లోడుల ఉల్లి వస్తోంది. చిల్లర కొరతతో మార్కెట్ ను మూసివేశారు.

English summary
banned currency effect on an onion market. new currency not available everyone. everyday 60 to 70 lorries of an onion come to market. lakhs of rupees turnover every day. new currency not available businessmen close the market today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X