వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాసర కీచక ప్రొఫెసర్ అరెస్ట్.. నిందితుడిపై పోక్సో, నిర్భయ కేసులు..

|
Google Oneindia TeluguNews

నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ కీచక ప్రొఫెసర్ దొరికాడు. కెమిస్ట్రీ హెచ్ఓడీ రవి వరాలను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్యలో తలదాచుకుంటున్న అతన్ని పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. అమ్మాయిలపై లైంగిక వేధింపులతో పాటు క్వశ్చన్ పేపర్ లీకేజీ కేసు నమోదుచేశారు. ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో మరో అసిస్టెంట్ ప్రొఫసెర్, ఎగ్జామ్ వాల్యుయేషన్ ఇన్‌ఛార్జీని కటకటాల వెనక్కి నెట్టారు.

తప్పు ఒప్పుకున్న రవి

తప్పు ఒప్పుకున్న రవి

పోలీసుల అదుపులో ఉన్న రవి తాను చేసిన తప్పులన్నీ అంగీకరించినట్లు తెలుస్తోంది. విద్యార్థినుల మొబైల్‌లకు అసభ్యకరమైన మెసేజ్‌లు పంపడంతో పాటు వారిని కారులో ఆదిలాబాద్, కరీంనగర్ తీసుకెళ్లినట్లు అంగీకరించాడు. ప్రశ్నాపత్రాల లీకేజీతో పాటు మైనర్ విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించినందుకు గానీ ఐపీసీతో పాటు పోక్సో చట్టం కింద కేసు నమోదుచేశారు. మరికొందరు బాధితులు మేజర్లు కావడంతో నిర్భయ చట్టంలోని పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదుచేశారు.

జీతం చాలక క్వశ్చన్ పేపర్ లీకేజీ

జీతం చాలక క్వశ్చన్ పేపర్ లీకేజీ

ఇదిలా ఉంటే కాంట్రాక్టు ఉద్యోగం కావడం, చాలీచాలని వేతనం ఉండటంతో క్వశ్చన్ పేపర్ లీక్ చేసినట్లు రవి చెప్పాడు. ఈ వ్యవహారంలో నిందితునికి ఎగ్జామ్ వాల్యుయేషన్ ఇంఛార్జ్ విశ్వనాథ్ సహకరించేవాడు. విద్యార్థినుల నుంచి రూ.15వేల చొప్పున తీసుకుని తెలియని ప్రశ్నలకు జవాబులు రాయకుండా పేపర్ ఖాళీగా వదిలేయమని చెప్పేవాడు. ఆ తర్వాత విశ్వనాథ్ నుంచి ఆ ఆన్సర్ షీట్లు తీసుకుని విద్యార్థినులను ఇంటికి రప్పించుకుని వారితో ఖాళీగా వదిలిన ప్రశ్నలకు సమాధానాలు రాయించేవాడు. స్టూడెంట్స్ నుంచి వసూలు చేసిన డబ్బును రవి, విశ్వనాథ్‌లు పంచుకునేవారు.

ప్రశ్నాపత్రం లీకేజీలో మరో సూత్రధారి

ప్రశ్నాపత్రం లీకేజీలో మరో సూత్రధారి

మరో అసిస్టెంట్ ప్రొఫెసర్ మాధవేది సుధాకర్ కూడా విద్యార్థినులతో బేరాలు కుదుర్చుకుని విశ్వనాథ్ సాయంతో వారిని పాస్ చేయించేవాడని పోలీసుల విచారణలో తేలింది. దీంతో క్వశ్చన్ పేపర్ లీకేజీ కేసులో రవి, విశ్వనాథ్, సుధాకర్‌లను అరెస్ట్ చేసిన పోలీసులు వారి నుంచి ఒక కారు, మూడు సెల్‌ఫోన్లు, రూ.3.70లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి మరికొంత మంది విద్యార్థినులను విచారించి వారిచ్చే సమాచారం ఆధారంగా ఇంకెవరైనా బాధ్యులు ఉంటే వారిపై కేసు నమోదుచేస్తామని పోలీసులు చెప్పారు. మరోవైపు రవి చాట్ చేసిన 30 నుంచి 40 మంది విద్యార్థినులను కూడా విచారించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.

English summary
Basara IIIT Professor Arrested Due To Misbehave with girl Students. cases have been booked under pocso and nirbhaya act. two other persons also held in question paper leakage case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X