వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కారు ఎక్కిన సారయ్య, 'సుప్రీం కోర్టు తీర్పు ఉల్లంఘిస్తున్న టిఆర్ఎస్'

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బస్వరాజు సారయ్య సోమవారం నాడు తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో ఆయన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును కలిసి, ఆయన సమక్షంలో కారు ఎక్కారు. సారయ్యకు కేసీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

రంగారెడ్డి నేతలతో రేవంత్ రెడ్డి సమావేశం

రంగారెడ్డి జిల్లా నేతలతో తెలంగాణ టిడిపి నేతలు ఎల్ రమణ, రేవంత్ రెడ్డిలు మంగళవారం సమావేశమయ్యారు. రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడి నియామకంపై వారు చర్చిస్తున్నారు.

 Baswaraju Saraiah joins TRS

గ్రేటర్లో టిఆర్ఎస్ అందుకే గెలిచింది: శ్రవణ్

గ్ర్టేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టిఆర్ఎస్ అక్రమాలకు పాల్పడి గెలిచిందని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్ మండిపడ్డారు. నిజాయితీగా అయితే వారికి గెలుపు అసాధ్యమన్నారు. తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టు తీర్పును ఉల్లంఘిస్తోందన్నారు.

ఈవీఎంలకు ప్రింటర్ అమర్చాలని ఆదేశించినా పట్టించుకోలేదన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం తెరాసకు అనుకూలంగా వ్యవహరిస్తోందన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో నోటా పెట్టకపోవడమే అందుకు నిదర్శనం అన్నారు. ఖమ్మం, వరంగల్ ఎన్నికల్లో నోటా పెట్టారని, అది కాంగ్రెస్ ఒత్తిడితోనే సాధ్యమైందన్నారు.

English summary
Congress Party senior leader and Former Minister Baswaraj Saraiah joined TRS on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X