వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బతుకమ్మ ఫిల్మోత్సవ్ : ఆకట్టుకున్న బతుకమ్మ నృత్య రూపకం

|
Google Oneindia TeluguNews

రవీంద్రభారతిలో జరుగుతున్న బతుకమ్మ సంబరాలు నేటితో 7వ రోజుకు చేరుకున్నాయి. ఇందులో భాగంగా ఈ రోజు రవీంద్రభారతి ప్రధాన వేదికలో డా. కోట్ల హనుమంతరావు దర్శకత్వంలో రూపొందిన బతుకమ్మ నృత్య రూపకం ప్రదర్శన ఆహుతులను ఆకట్టుకుంది.

బతుకమ్మ ఎందుకు జర్పుకుంటారు?, బతుకమ్మ పండుగకి సంబందించిన కథలు, మొత్తం దాని ప్రాశస్త్యం తెలిపే విధంగా ఈ బతుకమ్మ నృత్య రూపకం సాగింది. బతుకమ్మ సంబరాల్లో భాగంగా ఇటీవల దేశ రాజధాని అయిన ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో ఈ నృత్య రూపకం ప్రదర్శనని హిందీలో చేశారు. కార్యక్రమానికి హాజరైన పలువురు కేంద్రమంత్రులు బతుకమ్మ నృత్య రూపకాన్ని ప్రశంసించారు.

ఇక డా. ప్రశాంతి ప్రొడక్షన్ మేనేజర్, ఫరెవర్ ఫెంటాస్టిక్ థియేటర్స్ , సూర్యాపేట- ఖాజా పాషా వారి ద్వారా, ఋషి కృష్ణ పాటలతో, పెరల్స్ కల్చరల్ అసోసియేషన్, సిద్దిపేట శరత్ నృత్య దర్శకత్వంలో రూపొందిన "ఇంటింటి బతుకమ్మ నృత్య రూపకం" ప్రదర్శన ప్రేక్షక మహాశయులను మంత్రముగ్దులను చేసింది.

Bathkamma Filmotsav at ravindra bharati

సావిత్రి బాయి ఫూలే, ఝాన్సీ లక్ష్మీబాయి, చాకలి ఐలమ్మ, ఇలా.. మన దేశంలో ఎంతో మంది మహిళలు ఆదర్శమూర్తులుగా ఉన్నారు. తెలంగాణ ఆడబిడ్డలు మహిళల రక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన షీ టీం గురించి తెలిపే విదంగా ఉంది. మానవ మృగాలను అట్టుడుకిస్తూ, మహిళలకు రక్షణగా నిలుస్తున్న "షీ టీమ్" అంటూ ఈ నాటకం ద్వారా చాలా అద్భుతంగా తెలిపారు.

ఈ కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వ అధికారి శ్రీ వేణుగోపాల చారి, సతీమణి శ్రీమతి రేవతి వేణుగోపాల చారి, దామోదర్ రెడ్డి (వీ6 డైరెక్టర్ !), ఈటీవీ స్టార్ మహిళా డైరెక్టర్ శ్రీ శ్రీధర్ రెడ్డి, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, తదితరులు హాజరయ్యారు.

7వ తేదీ కార్యక్రమాల వివరాలు:-
రవీంద్రభారతి, పైడి జయరాజ్ హాల్:-
రవీంద్రభారతి, పైడి జయరాజ్ సమావేశమందిరంలో (మొదటి అంతస్తులో) "ఫిల్మోత్సవం -2" చివరి రోజులో భాగంగా వివిధ ఛానెల్స్ రూపొందించిన బతుకమ్మ పాటల ప్రదర్శనలు ఉంటాయి. రేపు ఈ "బతుకమ్మ ఫిల్మోత్సవం" ముగింపు కార్యక్రమానికి "పెళ్ళిచూపులు సినిమా టీమ్" హాజరు కానున్నారు. వివిధ చానెల్లో బతుకమ్మ పాటలను రూపొందించిన టీమ్స్ కూడా రానున్నారు.
రవీంధ్రభారతి, ప్రధాన వేధిక:-
1) రవీంధ్రభారతి, ప్రధాన వేధికలో సాయంత్రం 6గంఈఈలకు "బ్రహ్మకుమారిస్" తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ సంయుక్త ఆద్వర్యంలో 8 దేశాల నుంచి విదేశీ మహిళలతో బతుకమ్మ సంబరాల ప్రదర్శన ఉంటుంది. అలాగే...
2) రవీంధ్రభారతి, ప్రధాన వేధికలో సాయంత్రం 6గంఈఈలకు శ్రీ రవీందర్ రాజు శిష్య బృందంచే "కథక్ నృత్య ప్రదర్శన" ఉంటుంది.

English summary
Bathukamma Filmotsav will be Held from October 3rd to 7th says telangana cultural department Director Mamidi Harikrishna.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X