బతుకమ్మ, బోనాలకు అరుదైన ఘనత: ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో చోటు, కవిత ట్వీట్
హైదరాబాద్: బతుకమ్మ, బోనాలకు అరుదైన గౌరవం దక్కింది. ఈ పదాలను తమ నిఘంటువులో చేర్చేందుకు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ సుముఖత వ్యక్తం చేసింది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను బతుకమ్మ, బోనాలు ప్రతిబింబిస్తాయి.
'కొత్త దోస్తీ'తో చక్రం తిప్పుతారా: తెలంగాణపై బీజేపీ 'థర్డ్' ఆలోచన, 20 సీట్లపై కన్ను
ఈ పదాలను ఆక్స్ఫర్డ్ తమ డిక్షనరీలో చేర్చేందుకు సుముఖత వ్యక్తం చేసిందని, ఈ మేరకు తనకు లేఖ అందిందిందని తెలంగాణ నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఈ పదాలను డిక్షనరీలో చేర్చాలని నిర్ణయించినట్లు ఆక్స్ఫర్డ్ యాజమాన్యం తెలిపింది.
ఇందుకు సంబంధించిన పత్రాన్ని కవితకు పంపించారు. దీనిపై ఎంపీ కవిత తన సామాజిక అనుసంధన వేదిక ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ సంస్కృతికి చెందిన బతుకమ్మ, బోనాలకు ఈ గౌరవం దక్కడం మంచిదని పేర్కొన్నారు.
So happy to receive this letter from the Oxford English Dictionary @oed acknowledging our request to include the words “Bathukamma” and “Bonalu” in the English dictionary!
— Kavitha Kalvakuntla (@RaoKavitha) October 26, 2018
Two new nouns in the English language from the Telangana culture ! - sounds good 😊 pic.twitter.com/gEapB0pgba