వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బతుకమ్మ చీరల పంపిణీ షురూ... తొలి చీరలు సమ్మక్క సారలమ్మలకు సమర్పించిన మంత్రి

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ చీరల పంపిణీ ప్రారంభమైంది. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ఒక పండుగలా జరగాలని నిర్ణయించిన ప్రభుత్వం చీరల పంపిణీ సంబరాన్ని ప్రారంభించింది. తొలి చీరలు సమ్మక్క-సారలమ్మలకు సమర్పించటంతో బతుకమ్మ చీరల పంపిణీ షురూ అయ్యింది.

ఆ జిల్లా మహిళలకు బతుకమ్మ చీరలు లేనట్టే ... ఎందుకంటేఆ జిల్లా మహిళలకు బతుకమ్మ చీరలు లేనట్టే ... ఎందుకంటే

సమ్మక్క సారలమ్మలకు బతుకమ్మ తొలిచీరలు సమర్పించిన మంత్రి సత్యవతి రాథోడ్

సమ్మక్క సారలమ్మలకు బతుకమ్మ తొలిచీరలు సమర్పించిన మంత్రి సత్యవతి రాథోడ్

ఇటీవల మంత్రి వర్గ విస్తరణలో భాగంగా గిరిజన శిశు సంక్షేమ శాఖ మంత్రి గా బాధ్యతలు చేపట్టిన సత్వవతి రాథోడ్ మేడారంలో నేడు సమ్మక్క-సారలమ్మ వారిని దర్శించుకుని బతుకమ్మ తొలి చీరలు అమ్మవార్లకు సమర్పించారు. ఇక ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి సత్యవతి రాథోడ్ గిరిజనుల ఆరాధ్య దైవం అయిన సమ్మక్క సారలమ్మ లకు బతుకమ్మను తొలి చీరలను సమర్పించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. తన తొలి పర్యటన గిరిజన ప్రాంతంలో జరపడం బతుకమ్మ పండగ చీరల పంపిణీతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం తనకు ఆనందాన్ని కలిగిస్తుందని ఆమె తెలిపారు.

బతుకమ్మ చీరల పంపిణీతో మంత్రిగా తోలి కార్యక్రమంలో పాల్గొన్న సత్యవతి

బతుకమ్మ చీరల పంపిణీతో మంత్రిగా తోలి కార్యక్రమంలో పాల్గొన్న సత్యవతి

గిరిజన తండాలో పుట్టి, పెరిగిన తనకు ముఖ్యమంత్రి మంత్రివర్గంలో స్థానం కల్పించడం మరింత బాధ్యత పెంచిందన్నారు. సీఎం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టాలనే కోరికతో మేడారం సమ్మక్క-సారలమ్మ ఆశీర్వాదం తీసుకొని, బతుకమ్మ తొలి చీరలను అమ్మవార్లకు సమర్పించానన్నారు. అనంతరం ఆమె ములుగులో చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఇక రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు తెలంగాణ ఆడపడుచులకు చీరలను అందజేస్తున్నారు.

నల్గొండలో కేటీఆర్ బతుకమ్మ చీరలపంపిణీ

నల్గొండలో కేటీఆర్ బతుకమ్మ చీరలపంపిణీ

ఇక నల్గొండ లో పర్యటించిన మంత్రి కేటీఆర్ తెలంగాణ ఆడబిడ్డల సంబరంగా జరుపుకునే పండుగ బతుకమ్మ అని, ఈ పండుగ సందర్భంగా కోటి మంది ఆడపిల్లలకు చిరుకానుక ఇవ్వాలనే ఉద్దేశంతో బతుకమ్మ చీరలను అందిస్తున్నామని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ మహిళలు సంతోషంగా పండుగ జరుపుకోవాలని సంకల్పించారని అందుకే ఇలా ప్రతి ఏడు చీరలను నేయించి కానుకగా ఇస్తున్నారని చెప్పారు. ఇక బతుకమ్మ చీరల వల్ల నేత కార్మికుల బతుకులు బాగు పడుతున్నాయని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. వంద రకాల వెరైటీలలో , 10 డిజైన్లలో, పది రంగుల లో బతుకమ్మ చీరలను నేత కార్మికులతో నేయించామని చెప్పిన కేటీఆర్ తెలంగాణ ఆడపడుచులు అంతా సంతోషంగా బతుకమ్మ పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు.

కరీం నగర్ చీరల పంపిణీలో కాంగ్రెస్ పై గంగుల వ్యాఖ్యలు

కరీం నగర్ చీరల పంపిణీలో కాంగ్రెస్ పై గంగుల వ్యాఖ్యలు

ఇక కరీంనగర్ లో మంత్రి గంగుల కమలాకర్ బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడపిల్లలపై ఎంతో ప్రేమతో సీఎం కేసీఆర్ బతుకమ్మ చీరలను కానుకగా అందిస్తున్నారన్న మంత్రి గతంలో కాంగ్రెస్ నేతలు బతుకమ్మ చీరలు తగలబెట్టడం వల్లే గత ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు అని వ్యాఖ్యానించారు. కరీంనగర్ లో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించడం కోసం అన్ని రకాల ఏర్పాట్లు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఇలా రాష్ట్ర వ్యాపతంగా ప్రజా ప్రతినిధులు బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మహిళలకు చీరలు అందజేస్తున్నారు.

English summary
Distribution of Batukamma sarees across Telangana state has started. The Telangana Government's most prestigious Batukamma Sarees Distribution Program has decided to celebrate the launch of the Sarees. The distribution of the Batukamma sarees became started as the first sarees were submitted to the sammakka-sarlamma
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X