వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రిజర్వేషన్ల ఆంతర్యమేంటి?.. బీసీ నేతల అర్ధనగ్న ప్రదర్శన

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : అగ్రవర్ణాల పేదలకు రిజర్వేషన్లు కల్పించడంపై జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య మండిపడ్డారు. తెలంగాణలో 9శాతం మాత్రమే ఉన్న అగ్రకులాలకు 10శాతం రిజర్వేషన్లు కేటాయించడటం సరికాదన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో దాదాపు 100 మంది బషీర్‌బాగ్‌ మెయిన్ రోడ్డుపై అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. అడగనివారికి రిజర్వేషన్లు కల్పించడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు.

bc leaders protest on reservations at hyderabad

కీలక పదవులను అనుభవిస్తున్నవారిలో 80శాతం అగ్రకులాలకు చెందినవారేనని.. అలాంటి నేపథ్యంలో 10శాతం రిజర్వేషన్లు కల్పించడంలో అర్థం లేదని ఎద్దేవా చేశారు కృష్ణయ్య. బీసీలకు అన్యాయం చేయాలని చూస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా ముప్పయి మంది ముఖ్యమంత్రులుగా పనిచేస్తే.. అందులో ఒక్కరూ కూడా బీసీ కులాలకు చెందినవారు లేరని వాపోయారు.

English summary
National BC Welfare association President R. Krishnaiah has condemned the reservation for the poor of the upper castes. It is not correct to allocate 10 per cent reservation to the upper strata of 9 per cent in Telangana. Opposing the central government's decision, the BC Welfare Association conducted a protest on nearly 100 members at Basheerbagh Main Road.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X