వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సాయంత్రం వస్తానని చెప్పిన శిరీష.. ఎఫ్ఐఆర్‌లో ఇలా: 'ఒత్తిడి వల్లే సూసైడ్‌గా..'

బ్యూటీషియన్ శిరీష కేసులో ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. శిరీష కేసుకు చెందిన ఎఫ్ఐఆర్‌లో పోలీసులు పలు అంశాలను పొందుపర్చారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: బ్యూటీషియన్ శిరీష కేసులో ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. శిరీష కేసుకు చెందిన ఎఫ్ఐఆర్‌లో పోలీసులు పలు అంశాలను పొందుపర్చారు.

<strong>ఆ గదిలోనే..: శిరీషని చంపేసి గేమ్ ఆడారా, మరో అమ్మాయితో వెళ్లారా?</strong>ఆ గదిలోనే..: శిరీషని చంపేసి గేమ్ ఆడారా, మరో అమ్మాయితో వెళ్లారా?

మ్యారేజ్ అపాయింటుమెంట్ ఉందని భర్తకు చెప్పిన శిరీష

మ్యారేజ్ అపాయింటుమెంట్ ఉందని భర్తకు చెప్పిన శిరీష

శిరీష 12వ తేదీ మధ్యాహ్నం గం.2.30 నిమిషాలకు ఇంట్లో నుంచి వెళ్లింది. మ్యారేజ్ అపాయింటుమెంట్ ఉందని, సాయంత్రం వస్తానని ఇంట్లో వారికి చెప్పి వెళ్లింది. ఆ తర్వాత రాత్రి గం.8.40 నిమిషాలకు భర్తకు ఫోన్ చేసింది. తనకు ఆలస్యం అవుతుందని చెప్పింది.

ఉదయం కాల్ లిఫ్ట్ చేయలేదు.. డ్యూటీకి భర్త

ఉదయం కాల్ లిఫ్ట్ చేయలేదు.. డ్యూటీకి భర్త

రాత్రి 11 గంటలకు భర్త సతీష్ చంద్ర, కూతురు దివ్యలు భోజనం చేసి పడుకున్నారు. అనంతరం 13వ తేదీ ఉదయం గం.4.10 నిమిషాలకు శిరీషకు భర్త సతీష్ చంద్ర ఫోన్ చేశాడు. ఆమె కాల్ లిఫ్ట్ చేయలేదు. ఆ తర్వాత అతను ఉదయం గం.5.40 నిమిషాలకు బేగంపేటలో తన ఉద్యోగానికి వెళ్లిపోయాడు.

భర్తకు మృతి సమాచారం..

భర్తకు మృతి సమాచారం..

అదే రోజు ఉదయం గం.6.40 నిమిషాలకు పోలీసులు భర్తకు ఫోన్ చేసి నీ భార్య శిరీష మృతి చెందిందని చెప్పారు. అనంతరం సతీష్ చంద్ర ఆర్జే ఫోటో స్టూడియోకు వచ్చారు. అక్కడ శిరీష విగతజీవిగా పడి ఉండటాన్ని భర్త గుర్తించాడు. పోలీసులతో మాట్లాడారు. తన భార్య ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని సతీష్ చంద్ర తెలిపాడు.

ఆధారాలు దొరక్కుండా పోలీసులు హడావుడి

ఆధారాలు దొరక్కుండా పోలీసులు హడావుడి

మరోవైపు, బ్యూటీషియన్ శిరీషది కచ్చితంగా హత్యే అని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఓవైపు రాజీవ్, శ్రవణ్‌లను పోలీసులు తమ కస్టడీకి తీసుకొని అన్ని కోణాల్లో దర్యాఫ్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శిరీష మేనమామ గోపాలకృష్ణ స్పందించారు. శిరీషది కచ్చితంగా హత్యనే అని మేనమామ గోపాలకృష్ణ అన్నారు. ఆధారాలు దొరకకుండా పోలీసులు హడవుడి చేశారని ఆయన ఆరోపించారు.

ఒత్తిడి కారణంగా సూసైడ్‌గా నిర్ధారించారని..

ఒత్తిడి కారణంగా సూసైడ్‌గా నిర్ధారించారని..

శిరీష మృతదేహాన్ని కూడా చూసే అవకాశం తమకు పోలీసులు ఇవ్వలేదని మండిపడ్డారు. శిరీష మృతిపై ఫిర్యాదు చేశామని, కానీ పోలీసులు మాత్రం ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒత్తిడి కారణంగానే పోలీసులు సూసైడ్‌గా నిర్ధారించారని చెప్పారు. మృతదేహంపై రక్తపు మరకలు ఉన్నాయన్నారు.

English summary
Police on Monday disclosed that Vallabhaneni Rajeev Kumar intentionally took Sirisha to Kukunoorpally and that she was unaware of the true intentions of Rajeev and Sravan Kumar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X