వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజీవ్-శ్రవణ్‌ల తీరు: పోలీసుల విస్మయం, శిరీష-తేజస్వినిలను అలా వదిలించుకోవాలని..

బ్యూటీషియన్ శిరీష మృతి కేసుపై బంజారాహిల్స్ పోలీసులకు ఫోరెన్సిక్ నివేదిక ప్రాథమిక నివేదిక అందింది. శిరీషపై అత్యాచారం జరగలేదని ఫోరెన్సిక్ నివేదికలో తేలిన విషయం తెలిసిందే.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: బ్యూటీషియన్ శిరీష మృతి కేసుపై బంజారాహిల్స్ పోలీసులకు ఫోరెన్సిక్ నివేదిక ప్రాథమిక నివేదిక అందింది. శిరీషపై అత్యాచారం జరగలేదని ఫోరెన్సిక్ నివేదికలో తేలిన విషయం తెలిసిందే.

<strong>శిరీష-ఎస్సై ఆత్మహత్యలో కీలక ఆధారం మాయం? టీవీ ఎందుకు తీసుకెళ్లారు?</strong>శిరీష-ఎస్సై ఆత్మహత్యలో కీలక ఆధారం మాయం? టీవీ ఎందుకు తీసుకెళ్లారు?

కాగా, శిరీష మృతి కేసులో నిందితులు రాజీవ్, శ్రవణ్‌లు పోలీసుల విచారణలో ఒకే మాట చెప్పినట్లుగా తెలుస్తోంది. చెప్పిన విషయాన్నే పదేపదే చెప్పి, పోలీసులకు విసుగు తెప్పించారని కూడా సమాచారం.

ఎలా విచారించినా.. పోలీసుల విస్మయం

ఎలా విచారించినా.. పోలీసుల విస్మయం

ఓ విధంగా చెప్పిందే.. చెప్పి తమకు అంతకుమించి ఏం తెలియదని చెప్పారు. పోలీసులు వారిని రెండు రోజులు విచారించిన విషయం తెలిసిందే. శిరీష ఆత్మహత్య చేసుకుంటుందని భావించలేదని వారు పోలీసులకు చెప్పారు. ఇద్దరినీ కలిపి, వేర్వేరుగా దశలవారీగా ప్రశ్నించినా వారి నుంచి ఒకేవిధమైన సమాధానం రావటం పోలీసు అధికారులనూ విస్మయానికి గురి చేసిందని తెలుస్తోంది.

అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా..

అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా..

అరెస్టుకు ముందు ఇద్దరు నిందితులు ఎవరికివారే ఎదుటి వారిపై తప్పును మోపేలా ఆరోపించుకున్నారని చెబుతున్నారు. అరెస్టైన అనంతరం విచారణలో మాత్రం దానికి భిన్నంగా కూడబలుక్కున్నట్టు ఒకే వాదన వినిపించటం ఆశ్చర్యం కలిగిస్తోందని పోలీసులే ఆశ్చర్యపోతున్నారంటున్నారు.

డ్రామాలు.. కాదు

డ్రామాలు.. కాదు

రాజీవ్‌ను ఏ 2 నిందితుడిగా చేర్చటంపై శిరీష బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో కీలకమైన రాజీవ్‌ను తప్పించేందుకే ఈ డ్రామా ఆడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇద్దరు నిందితులు కూడా తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసమే ఎస్సైని ఆశ్రయించారని పోలీసులు గుర్తించారని తెలుస్తోంది. ఎస్సై తనపై ఆత్యాచారయత్నం చేయడంతో ఆమె మనస్తాపానికి గురయిందని తేలిందని సమాచారం.

శిరీష, తేజస్వినిలను కూడా అలాగే వదిలించుకోవాలని..

శిరీష, తేజస్వినిలను కూడా అలాగే వదిలించుకోవాలని..

రాజీవ్‌, శ్రవణ్‌ ఇద్దరూ అమ్మాయిల వ్యామోహంలో చాలామందిని మోసగించారని పోలీసుల విచారణలో తేలిందని సమాచారం. గతంలో మహిళలతో తలెత్తిన వివాదాలను పోలీసు కేసులని భయపెట్టి బయటపడ్డారని, అదే విధంగా శిరీష, తేజస్వినిలను కూడా వదలించుకోవాలనే ప్లాన్‌లో భాగంగానే ఇదంతా చేసినట్టు పోలీసులు గుర్తించారని సమాచారం.

ఎస్సై ఫోన్ రికార్డులు

ఎస్సై ఫోన్ రికార్డులు

ఇదిలా ఉండగా, ఆత్మహత్య చేసుకున్న శిరీష, ఎస్సై ప్రభాకర్ రెడ్డి, నిందితులు రాజీవ్‌, శ్రవణ్‌ రెండునెలలుగా మాట్లాడిన ఫోన్ నెంబర్ల డేటాను సేకరించే పనిలో పోలీసులు ఉన్నారని తెలుస్తోంది. మరోవైపు, ఎస్సై తన వ్యక్తిగత ఫోన్‌ నెంబరు ద్వారా సాగించిన సంభాషణలను తాను రికార్డు చేసిన విషయం వెలుగు చూసినట్లుగా సమాచారం. ఆ మొబైల్‌ ఎక్కడుందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

English summary
In the case of Beautician Sirisha's suicide, Osmania Hospital Forensic experts have submitted the primary forensic report to the Banjara Hills police station.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X