వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శిరీష కేసులో మరో ట్విస్ట్: దుస్తులు వాష్ చేశాకే.., ఎస్సై సూచనతో డ్రామా

బ్యూటీషియన్ శిరీష మృతి కేసులో మరో కొత్త ట్విస్ట్. శిరీషది ఆత్మహత్యగా తేల్చేసి, కేసును క్లోజ్ చేయాలని పోలీసులు చూస్తున్నారని ఆమె కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: బ్యూటీషియన్ శిరీష మృతి కేసులో మరో కొత్త ట్విస్ట్. శిరీషది ఆత్మహత్యగా తేల్చేసి, కేసును క్లోజ్ చేయాలని పోలీసులు చూస్తున్నారని ఆమె కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

చదవండి: 'తేజస్విని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు'

శిరీష, కుకునూరుపల్లి ఎస్సై ప్రభాకర్ రెడ్డి సంచలనం రేపిన విషయం తెలిసిందే. శిరీషది ఆత్మహత్య అని పోలీసులు చెబుతుండగా, కుటుంబ సభ్యులు మాత్రం అనుమానాలు లేవనెత్తారు. వారి అనుమానాలను తొలగించేందుకు పోలీసులుచేసిన ప్రయత్నాలు ఫలించనట్లుగా కనిపిస్తోంది.

ఎస్సై సలహాతోనే శిరీషది ఆత్మహత్య అని డ్రామా

ఎస్సై సలహాతోనే శిరీషది ఆత్మహత్య అని డ్రామా

శిరీష పైన అత్యాచారం జరిపి, హత్య చేశారని కుటుంబ సభ్యులు మొదటి నుంచి ఆరోపిస్తున్నారు. శిరీషను కొట్టి చంపారని, ఈ విషయాన్ని వారు ఎస్సైకి చెప్పారని, ఆయన సూచనతోనే శిరీషది ఆత్మహత్య అని రాజీవ్, శ్రవణ్‌లు డ్రామా నడిపారని వారు మరో ఆరోపణ కూడా చేస్తున్నారు.

దుస్తులు, లోదుస్తులను వాష్ చేశాక ఫోరెన్సిక్‌కు పంపించారని..

దుస్తులు, లోదుస్తులను వాష్ చేశాక ఫోరెన్సిక్‌కు పంపించారని..

శిరీషపై అత్యాచారం జరగలేదని, ఆమెది ఆత్మహత్య అని పోలీసులు తేల్చి చెబుతున్నారు. అంతేకాదు, ఫోరెన్సిక్ నివేదికలోను శిరీష దుస్తులపై ఉన్నవి తినే పదార్థాలని తేలిందని, ఎలాంటి రక్తపు మరకలు లేవని గుర్తించారని పోలీసులు చెప్పారు. కానీ తాజాగా కుటుంబ సభ్యులు మాత్రం దుస్తులను, లో దుస్తులను వాష్ చేసిన తర్వాత ల్యాబ్‌కు పంపించారని సంచలన ఆరోపణలు చేస్తున్నారు. కేసును మళ్లీ విచారించాలని డిమాండ్ చేస్తున్నారు.

భయంతోనే ఆత్మహత్య అని..

భయంతోనే ఆత్మహత్య అని..

శిరీష, ఎస్సై ప్రభాకర్ రెడ్డి ఇద్దరిదీ ఆత్మహత్యేనని పోలీసులు చెప్పారు. ఇద్దరూ భయంతోనే ఆత్మహత్యకు పాల్పడ్డారని ఈ కేసు దర్యాప్తు చేసిన పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ఈ కేసులో ప్రారంభం నుంచి తాము ఆత్మహత్యలేనని చెబుతున్నామని, టెక్నికల్ ఆధారాలు, ఇతర ఆధారాలు చూసిన తర్వాతే తాము వీటిని ఆత్మహత్యలుగా నిర్ధారించామన్నారు. తమ వాదనను ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ నిర్ధారించిందన్నారు.

అది సభ్యత కాదు

అది సభ్యత కాదు

శిరీష ఆల్కహాల్ తీసుకుందని పోలీసులు తెలిపారు. లోదుస్తులపై మరకల గురించి మాట్లాడడం సభ్యత కాదన్నారు. వైద్య నివేదికను శిరీష కుటుంబ సభ్యులకు ఇస్తామన్నారు. ఇంకా తమపై ఆరోపణలు చేయడం సరికాదని తెలిపారు. అలా కాకుండా వారి దగ్గర ఏవైనా ఆధారాలు ఉంటే తమకు ఇవ్వవచ్చునని చెప్పారు.

English summary
The forensic analysis report confirmed that beautician Vijayalakshmi alias Sirisha was not raped.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X