హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఓయులో బీఫ్ ఫెస్టివల్ ఉద్రిక్తత: ఎమ్మెల్యే రాజా సింగ్ అరెస్టు

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: విద్యార్థి సంఘాలు హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయం (ఓయు)లో బీఫ్ ఫెస్టివల్ తలపెట్టిన నేపథ్యంలో గురువారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీఫ్ ఫెస్టివల్‌ను అడ్డుకుంటామని హెచ్చరించిన బిజెపి శాసనసభ్యుడు రాజా సింగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆయన ఇంటి వద్ద పెద్ద యెత్తన పోలీసులు మోహరించారు. ఆయనను గోషామహల్ ఎసిపి కార్యాలయానికి తరలించారు.

ఓయులో పెద్ద యెత్తున పోలీసులు మోహరించారు. ముందస్తుగా విద్యార్థులను కొంత మందిని అదుపులోకి తీసుకున్నారు. ఓయుకు వెళ్లే దారులను దిగ్భంధం చేశారు. బీఫ్ ఫెస్టివల్‌కు గానీ పోర్క్ ఫెస్టివల్‌కు గానీ అనుమతి లేదని అధికారులు ప్రకటించినప్పటికీ బీఫ్ ఫెస్టివల్‌ను నిర్వహించి తీరుతామని విద్యార్థులు చెప్పారు.

OU tension

ఈ నేపథ్యంలో పోలీసులు ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని హాస్టళ్లను తనిఖీ చేశారు. బీఫ్ పెస్టివల్‌కు అనుమతి లేదని హైకోర్టు కూడా స్పష్టం చేసింది. బుధవారం ఆర్థరాత్రి సమయంలో త్రివేణి హాస్టల్ వద్ద విద్యార్థి నాయకులు కోట శ్రీనివాస్ గౌడ్, బద్రిలతో పాటు మరో ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు.

అంతకు ముదము ఓ చానెల్ కార్యక్రమంలో పాల్గొనడానికి బయటకు వచ్చిన ఓయూ మాదిగ విద్యార్థి సమాఖ్య ఇంచార్జీ అలెగ్జాండర్, ఫెస్టివల్ నిర్వాహకులు సోలంకి శ్రీనివాస్, విహెచ్‌పి నేత శశిధర్‌లను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు.

English summary
Beef festival tension: BJP MLA Raja singh arrested
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X