వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నటుడు భరత్ మృతికి ఇవీ కారణాలే: లారీని తరలించి ఉంటే..

టాలీవుడ్ హీరో రవితేజ సోదరుడు భరత్ రాజు ప్రమాదానికి గురైన ప్రాంతాన్ని పోలీసులు గతంలోనే యాక్సిడెంట్ స్పాట్‌గా గుర్తించారు. ఎదురుగడ్డ ఎక్కువగా ఉండటం వల్ల వాహనాల్లో వెళ్లే వారు వేగంగా వస్తున్నారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: టాలీవుడ్ హీరో రవితేజ సోదరుడు భరత్ రాజు ప్రమాదానికి గురైన ప్రాంతాన్ని పోలీసులు గతంలోనే యాక్సిడెంట్ స్పాట్‌గా గుర్తించారు. ఎదురుగడ్డ ఎక్కువగా ఉండటం వల్ల వాహనాల్లో వెళ్లే వారు వేగంగా వస్తున్నారు.

<strong>మద్యం సేవించినట్లు సిసిటీవీల్లో..: భరత్ మృతి కేసులో షాకింగ్ విషయాలు</strong>మద్యం సేవించినట్లు సిసిటీవీల్లో..: భరత్ మృతి కేసులో షాకింగ్ విషయాలు

అందుకే అక్కడ రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని పోలీసులు గుర్తించారు. కొన్ని నెలల వ్యవధిలో 10 మంది ఆ ప్రాంతంలో చనిపోయారని చెబుతున్నారు. దీనిని భట్టి చూస్తే నిర్లక్ష్యం కూడా భరత్ సహా వారి ప్రాణాలకు కారణమంటున్నారు.

ఔటర్‌ను స్పీడ్ ట్రాక్‌గా భావిస్తూ..

ఔటర్‌ను స్పీడ్ ట్రాక్‌గా భావిస్తూ..

ఔటర్ రింగ్ రోడ్డు పైన ప్రమాదాలు అందరినీ కలవరపెడుతున్నాయి. ఔటర్ రోడ్డు పైన ఎక్కువ ప్రమాదాలకు అతి వేగమే కారణంగా కనిపిస్తోంది. కొందరు ఔటర్‌ను స్పీడ్‌ ట్రాక్‌గా భావిస్తూ ఇంపోర్టెడ్‌ వాహనాలతో దూసుకెళ్తున్నారు.

నూతన మార్గాలు అమలు చేస్తామన్నారు..

నూతన మార్గాలు అమలు చేస్తామన్నారు..

ఔటర్‌పై నూతన మార్గదర్శకాలను అమలు చేస్తున్నామని, వేగం 100 దాటితే ఇంటికే చలానా పంపిస్తామని, హెచ్‌ఎండీఏ కూడా 30 బ్రీత్‌ ఎనలైజర్లు, 5 స్సీడ్‌ గన్‌లను అందచేసిందని, టోల్‌ప్లాజాల వద్ద నిత్యం డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీలు చేపడతామని, ఈ ఏడాది 10శాతం ప్రమాదాలు తగ్గిస్తామని ఔటర్‌పై పెట్రోలింగ్‌ వాహనాలు, స్పీడ్‌ లేజర్‌గన్స్‌, బ్రీత్‌ ఎనలైజర్లను ప్రారంభిస్తున్నప్పడు ఉన్నతాధికారులు చెప్పారు. కానీ వాటి వల్ల ఫలితం లేకుండా పోయిందనే వాదనలు వినిపిస్తున్నాయి. పోలీసులు ఔటర్ పైన డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరం చేశారు కూడా. అయినప్పటికీ ప్రమాదాలు మాత్రం తగ్గడం లేదు. పోలీసులతో పాటు వాహనదారులు కూడా జాగ్రత్తలు పాటించాలని అంటున్నారు.

లారీని తరలించి ఉంటే ప్రాణాలతో బయటపడేవాడు

లారీని తరలించి ఉంటే ప్రాణాలతో బయటపడేవాడు

లారీ యాక్సిడెంట్‌ స్పాట్‌ వద్ద బ్రేక్‌ డౌన్‌ అయింది. అక్కడ పోలీసులు బోలార్డ్స్ ఏర్పాటు చేశారు. భరత్ ప్రయాణిస్తున్న కారు 145 కిలోమీటర్ల వేగంతో దూసుకు పోయిందని, స్పీడ్ లేజర్ గన్‌లో నమోదయిందని తెలుస్తోంది. అయితే, అక్కడి నుంచి లారీని తరలించి ఉంటే భరత్‌ ప్రాణాలతో భయటపడేవాడని స్థానికులు చెబుతున్నారు.

నెల రోజుల క్రితమే..

నెల రోజుల క్రితమే..

సైబరాబాద్‌ పరిధిలో ఔటర్ రింగ్ రోడ్డుపై ఆరు పెట్రోలింగ్‌ వాహనాలు, ఐదు స్పీడ్‌ లేజర్‌ గన్స్‌, 30 బ్రీత్‌ ఎనలైజర్లను మే 25న హెచ్‌ఎండీఏ పోలీసులకు అందించింది. తనిఖీలు చేయడం వల్ల ప్రమాదాలను నివారించవచ్చని ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. నూతన మార్గదర్శకాలను కూడా విడుదల చేశారు. ఇది జరిగిన సరిగ్గా నెల రోజులకే రవితేజ సోదరుడు భరత్‌ దుర్మరణం చెందాడు.

ప్రతి వారం కౌన్సెలింగ్

ప్రతి వారం కౌన్సెలింగ్

ఔటర్ రింగ్ రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం డ్రంకెన్‌ డ్రైవ్‌. మద్యం మత్తువల్లే మితిమీరిన వేగంతో దూసుకుపోతున్నారు. పోలీసులు కౌన్సెలింగ్ ఇస్తున్నారు కూడా. ఔటర్ రింగు రోడ్డులో మందుబాబులకు కళ్లెం వేయడానికి 30 అత్యాధునిక బ్రీత్ ఎనలైజర్లు ఇటీవలే మంజూరు చేశారు.

English summary
Bharath Raj, popular Tollywood actor Ravi Teja’s brother, died in a road accident on the Outer Ring Road late on Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X