హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెరపైకి నిషిత్ కేసు: అది కావాలంటే.. పోలీసులకు బెంజ్ కంపెనీ షాక్

నిషిత్ నారాయణ, అతడి స్నేహితుడు రాజారవిచంద్ర ప్రమాదం కేసులో విచారణ కొనసాగుతోంది.నిషిత్ నడిపిన వాహన వివరాలు కావాలని పోలీసులు కోరగా.. బెంజ్ సంస్థ నుంచి విస్తుగొలిపే జవాబు వచ్చింది.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ తనయుడు నిషిత్ నారాయణ, అతడి స్నేహితుడు రాజారవిచంద్ర ప్రమాదం కేసులో విచారణ కొనసాగుతోంది. నిషిత్ నడిపిన వాహన వివరాలు కావాలని పోలీసులు కోరగా.. బెంజ్ సంస్థ నుంచి విస్తుగొలిపే జవాబు వచ్చింది.

మంత్రి నారాయణ కొడుకు నిషిత్ మృతి: విచారణలో షాకింగ్ విషయాలు మంత్రి నారాయణ కొడుకు నిషిత్ మృతి: విచారణలో షాకింగ్ విషయాలు

దీనిపై జూబ్లీహిల్స్ పోలీసులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది. రహస్యంగా ఉంచాల్సిన దర్యాఫ్తు వివరాలను ఇవ్వడం ఎలా కుదురుతుందని వారు అంటున్నారని సమాచారం.

బెంజ్ అడగడంపై పోలీసుల ఆశ్చర్యం

బెంజ్ అడగడంపై పోలీసుల ఆశ్చర్యం

వాహనానికి సంబంధించిన వివరాలు కావాలంటే కేసు దర్యాప్తు వివరాలు, పోస్టుమార్టం నివేదిక పంపాలని బెంజ్ కంపెనీ కోరింది. దీనిపై పోలీసులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది. మే 10వ తేదీ ఉదయం నిషిత్‌ ప్రయాణిస్తోన్న బెంజ్‌ కారు జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 36లో ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే.

కంపెనీ నుంచి వివరాలు రాబట్టే ప్రయత్నం..

కంపెనీ నుంచి వివరాలు రాబట్టే ప్రయత్నం..

అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లు ఉన్న కారు అయినప్పటికీ ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. అతివేగం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని ప్రాథమికంగా అంచనాకు వచ్చిన పోలీసులు దర్యాప్తులో భాగంగా కార్ల కంపెనీ నుంచి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు.

ఈ ప్రశ్నలకు జవాబు చెప్పేందుకు..

ఈ ప్రశ్నలకు జవాబు చెప్పేందుకు..

ప్రమాద సమయంలో సకాలంలో బెలూన్లు తెరుచుకున్నాయా? ఒకవేళ బెలూన్లు ఓపెన్‌ అయితే వారి ప్రాణాలు పోవటానికి కారణాలేంటి? వాహనంలో సాంకేతిక లోపం తలెత్తిందా? తదితర వివరాలు ఇవ్వాలని బంజారాహిల్స్‌ పోలీసులు బెంజ్‌ కార్ల కంపెనీకి గతంలో లేఖ రాశారు.

పోలీసుల అవాక్కు

పోలీసుల అవాక్కు

వారి నుంచి సమాధానం రాకపోవడంతో ఇటీవల మెయిల్‌ ద్వారా విషయాన్ని మరోసారి గుర్తు చేశారు. దీనిపై స్పందించిన కంపెనీ ప్రమాదానికి సంబంధించిన దర్యాప్తు వివరాలు ఇవ్వాలని అడగడంతో పోలీసులు అవాక్కయ్యారు. రహస్యంగా ఉంచాల్సిన వివరాలు ఇవ్వడంపై తర్జన భర్జన పడుతున్నారు. ఉన్నతాధికారుల సూచన మేరకు పోలీసులు నడుచుకోనున్నారు.

English summary
Benz seeks Nishith Narayana's report from Hyderabad police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X