ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

4మండలాల్ని ఇటు తెలంగాణ, అటు ఏపీ పట్టించుకోవట్లేదు: రాజయ్య

By Srinivas
|
Google Oneindia TeluguNews

ఢిల్లీ: భద్రాచలం నియోజకవర్గంలోని నాలుగు మండలాలను అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సిపిఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య బుధవారం ఆవేదన వ్యక్తం చేశారు.

ఆయన కేంద్ర ఎన్నికల కమిషనర్‌ను కలిశారు. ఏపీ అసెంబ్లీలో తనకు అసోసియేటెడ్ సభ్యుడిగా అవకాశం కల్పించాలని అక్కడి ప్రభుత్వానికి సూచనలు చేయాలని ఆయన వినతి పత్రం ఇచ్చారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుర. ఇటీవల ఏపీలో కలిసిన నాలుగు మండలాలను ఏ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఇది అన్యాయమన్నారు. తనను గెలిపించిన ప్రజలకు తాను న్యాయం చేయలేకపోతున్నానని చెప్పారు. నాలుగు మండలాల అభివృద్ధికి ఏపీ, తెలంగాణలు నిధులివ్వాలన్నారు.

Bhadrachalam MLA meets CEC

గృహనిర్మాణ లబ్ధిదారుల ఇళ్ల బిల్లులను వెంటనే చెల్లించాలి: రమణ

గృహ నిర్మాణ లబ్ధిదారుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ తెలుగుదేశం పార్టీ తెలంగాణ అధ్యక్షులు ఎల్ రమణ డిమాండ్‌ చేశారు.

గృహ నిర్మాణ లబ్ధిదారులకు బిల్లులు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ వరంగల్‌ జిల్లా హన్మకొండలో ఎర్రబెల్లి దయాకర రావు చేపట్టిన దీక్షా శిబిరం వద్ద రమణ మాట్లాడారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రాు వెంటనే ఇళ్ల బిల్లులు చెల్లించాలన్నారు. గృహ నిర్మాణ లబ్ధిదారులు ఇళ్లు కట్టుకొని అప్పులపాలు అయ్యారన్నారు. రాష్ట్రంలోని రైతుల సమస్యలపై పోరాటంలో రాజీలేదన్నారు.

English summary
Bhadrachalam MLA Sunnam Rajaiah has met the Central Election Commission on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X