ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆవు మూత్రం పోసింది..జరిమాన ఎంత విధించారో తెలుసా..?

|
Google Oneindia TeluguNews

భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో ఓ వింత ఘటన చోటుచేసుకుంది.ఇల్లందు పట్టణంలోని రెండవ బస్తీలో నివసించే సుందర్ లాల్ స్థానికంగా ఉంటూ ఎద్దుల బండిని కిరాయికి తోలుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఎద్దుల బండితో పరిసర ప్రాంతాల్లోని మట్టి, ఇసుకలను తోలుకుంటూ వచ్చే డబ్బులతో కుటుంబాన్ని పోషించు కుంటున్నాడు. ఈ క్రమంలో స్థానిక సింగరేణి జిఎం కార్యాలయం ముందు నుండి మట్టి తీసుకొని వచ్చేందుకు వెళుతున్న క్రమంలో కార్యాలయం ముందు ఎద్దు ఆగి మూత్రం పోసింది. దీంతో ఆగ్రహం చెందిన జీఎం సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో పోలీసులు సుందర్‌లాల్‌నుపిలిపించి జిఎం కార్యాలయం ముందు ఎద్దు మూత్రం పోసినందుకు ఫిర్యాదు అందిందని అందుకు కేసు నమోదు చేసి కోర్టు కు పంపిస్తామని అన్నారు. పోలీసుల పిలుపుతో కంగుతున్న సుందర్ లాల్ ఆశ్చర్యానికి గురయ్యాడు ఎద్దు మూత్రం పోస్తే కేసు పెట్టడం ఏంటి సార్.. అని అడిగాడుదీంతో కేసు నమోదయిందని కోర్టుకి పోయి ఫైన్ చెల్లించాలని చెప్పినట్లు సుందర్‌లాల్ వెల్లడించాడు, చెల్లించకపోతే జైలుకు పోవాల్సి వస్తుందని అన్నారని సుందర్ లాల్ ఆవేదన వ్యక్తం చేశాడు.

 Bhadradri kothagudem:Ox owner was fined Rs 100-Do you for which reason,check here

కిరాయికి తోలుకొని జీవించే నాకు ఎద్దులను పోషించే కష్టమవుతున్న తరుణంలో మూత్రం పోసినందుకు ఫైన్ కట్టడం ఏంటి సార్ అని పోలీసుల ఎదుట బాధపడుతుండడంతో స్థానిక కోర్టు పోలీస్ కానిస్టేబుల్ స్పందించి స్థానిక ఇల్లందు మున్సిపల్ మేజిస్ట్రేట్ కోర్టులో అతనికి ఫైన్ చెల్లించి రసీదు ఇవ్వడం జరిగింది.

 Bhadradri kothagudem:Ox owner was fined Rs 100-Do you for which reason,check here
పోలీసులు సహాయం చేశారని సింగరేణి అధికారులు మాత్రం కేసు పెట్టి ఆందోళన గురి చేశారని అన్నారు. ఏది ఏమైనా ఎద్దు మూత్రం పోసినందుకు కేసు పెట్టి ఫైన్ విధించడం చర్చనీయాంశమైంది..
 Bhadradri kothagudem:Ox owner was fined Rs 100-Do you for which reason,check here
English summary
Owner of an ox was fined Rs 100 for the ox had peed in fron of Singareni GM office.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X