వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అందుకే ఎన్‌కౌంటర్: ఎస్పీ, మృతుల్లో ఆరుగురు మహిళలు, అడవిలోనే 8మంది మృతదేహాలు

|
Google Oneindia TeluguNews

భద్రాచలం: తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల సరిహద్దులో శుక్రవారం ఉదయం భారీ ఎన్‌కౌంటర్‌ జరిగిందని భద్రాచలం జిల్లా ఎస్పీ అంబర్‌ కిశోర్‌ ఝా తెలిపారు. ఇరు రాష్ట్రాలకు చెందిన పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో 10 మంది మావోయిస్టులు మృతిచెందినట్టు ఆయన వెల్లడించారు. ఓ గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ మృతి చెందాడని ఎస్పీ చెప్పారు.

ఆత్మరక్షణ కోసమే

ఆత్మరక్షణ కోసమే

పూజారికాంకేడ్‌ ప్రాంతంలో గత కొంతకాలంగా మావోయిస్టుల కదలికలు ఉన్నట్టు తమకు సమాచారం అందిందని ఎస్పీ తెలిపారు. పూజారికాంకేడ్‌లో మావోయిస్టులు పోలీసులపై కాల్పులు జరపడంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు సైతం ఎదురుకాల్పులకు దిగారని తెలిపారు.

ఆరుగురు మహిళలు.. హరిభూషణ్..

ఆరుగురు మహిళలు.. హరిభూషణ్..

అనంతరం పోలీసులు సోదాలు జరిపి పది మంది మావోయిస్టుల మృతదేహాలు గుర్తించినట్టు ఎస్పీ చెప్పారు. చనిపోయిన మావోయిస్టుల్లో ఆరుగురు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నట్టు వివరించారు. పూజారికాంకేడ్‌ ప్రాంతంలో ఇంకా ఎదురు కాల్పులు జరుగుతున్నాయన్నారు. మృతుల్లో హరిభూషణ్‌ ఉన్నాడా? లేదా? అనేది ఇంకా నిర్థారణ కాలేదన్నారు.

మావోల కార్యకలాపాలు పెరిగాయి

మావోల కార్యకలాపాలు పెరిగాయి

మృతుల ఆచూకీ గుర్తించి మృతదేహాలను బంధువులకు అప్పగించనున్నట్టు చెప్పారు. మూడు నెలలుగా మావోయిస్టుల కార్యకలాపాలు ఎక్కువయ్యాయని తెలిపారు. ఘటనాస్థలి నుంచి మృతదేహాలను భద్రాచలం తీసుకువస్తున్నామని అన్నారు. ఘటనా స్థలిలో ఒక ఏకే 47, ఇంకొక ఎస్‌ఎల్‌ఆర్‌, రాకెట్‌ బాంబులు, రూ.43వేల నగదు స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ వివరించారు.

కానిస్టేబుల్ మృతి

కానిస్టేబుల్ మృతి

ఎదురు కాల్పుల్లో గ్రేహౌండ్స్‌ కానిస్టేబుల్‌ సుశీల్‌కుమార్‌ మృతిచెందాడని తెలిపారు. ఇప్పటివరకు అమరుడైన కానిస్టేబుల్‌తో పాటు ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలను భద్రాచలం ఆస్పత్రికి తరలించినట్టు చెప్పారు.

అడవిలోనే 8మంది మావోల మృతదేహాలు

అడవిలోనే 8మంది మావోల మృతదేహాలు

కాగా, ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతంలోనే మరో 8మంది మావోయిస్టుల మృతదేహాలున్నాయి. మృతదేహాలను ఆస్పత్రులకు తరలించేందుకు వెళ్లిన రెండు హెలికాప్టర్లలో ఒకటి.. మూడు మృతదేహాలను భద్రాచలం తీసుకురాగా, మరో హెలికాప్టర్ ల్యాండ్ సమస్య ఏర్పడటంతో మృతదేహాలను తీసుకురాకుండానే తిరిగి హైదరాబాద్ వెనుదిరిగింది. దీంతో మావోయిస్టు మృతదేహాలకు కాపలాగా భద్రతా దళాలు కూడా అటవీ ప్రాంతంలోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. మావోయిస్టు ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ప్రాంతం కావడంతో అప్రమత్తంగా ఉన్నాయి. కాగా, శనివారం ఉదయం 8మంది మృతదేహాలను భద్రాచలంకు తీసుకువచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

English summary
Ten Maoists and a constable of elite commando force Greyhounds were killed in an encounter in the forests of Chhattisgarh’s Bijapur district bordering Telangana, the police said on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X