వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేపే రాములోరి లగ్గం.. శ్రీరామ నవమికి ముస్తాబైన భద్రాద్రి

|
Google Oneindia TeluguNews

Recommended Video

శ్రీరామనవమికి ముస్తాబైన భద్రాద్రి..!! || Oneindia Telugu

భద్రాచలం : భద్రాద్రి ముస్తాబైంది. సీతారాముల కల్యాణానికి సర్వం సిద్ధమైంది. జానకిరాముల వివాహ వేడుకను వైభవంగా నిర్వహించడానికి అధికార యంత్రాంగం తలమునకలైంది. వసంతపక్ష ప్రయుక్త శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా.. శ్రీ సీతారాముల తిరు కల్యాణోత్సవం ఆదివారం (14.04.2019) నాడు నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు. అలాగే సోమవారం (15.04.2019) నాడు రఘురాముడికి పట్టాభిషేకం జరపనున్నారు.

భద్రాద్రి రాములోరి గుడి విద్యుత్ దీపాల కాంతులతో కొత్త శోభ సంతరించుకుంది. భద్రాచలంలోని ప్రధాన కూడళ్లతో పాటు మెయిన్ సెంటర్లలో స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. ఆలయ పరిసరాలతో పాటు స్వామివారి వివాహ వేడుక జరగనున్న మిథిలా ప్రాంగణంలో వేసవిని దృష్టిలో పెట్టుకుని చలువ పందిళ్లు వేయించారు. భక్తులకు ఉక్కపోత నుంచి ఉపశమనం కలిగించేలా కూలర్లు, ఫ్యాన్లు ఏర్పాటు చేయించారు.

Bhadradri Ramalayam ready for Sri Rama Navami Celebrations

<strong>ఓటరన్నకు కోపమొచ్చిందా?.. పోలింగ్ శాతం భారీగా ఎందుకు తగ్గింది?</strong>ఓటరన్నకు కోపమొచ్చిందా?.. పోలింగ్ శాతం భారీగా ఎందుకు తగ్గింది?

భద్రాద్రిలో జరిగే శ్రీ సీతారాముల కల్యాణం కనులారా వీక్షించేందుకు.. రాష్ట్రం నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రల నుంచి కూడా పెద్దసంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. రెండు లక్షల మేర లడ్డు ప్రసాదాలు సిద్ధం చేశారు ఆలయ అధికారులు. అంతేకాదు రాములోరి లగ్గం సందర్భంగా వినియోగించే ముత్యాల తలంబ్రాలను భక్తులకు అందించేందుకు ప్రత్యేక కౌంటర్లను సిద్ధం చేశారు.

English summary
Bhadradri Ramalayam ready for Sri Navami Celebrations. Temple and District Officials made arrangements according to devotees rush. Seetharama Marriage held on sunday and Coronation on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X