హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భాను కిరణ్ తరలింపునకు కోర్టు అనుమతి: ప్రత్యేక బ్యారక్ ఏర్పాటు

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మద్దెలచెర్వు సూర్యనారాయణ రెడ్డి అలియాస్ మద్దెలచెర్వు సూరి హత్య కేసులో నిందితుడు భాను కిరణ్‌ను చర్లపల్లి జైలు నుంచి చంచల్‌గుడా జైలుకు తరలించేందుకు హైదరాబాదులోని నాంపల్లి కోర్టు శనివారంనాడు అనుమతి ఇచ్చింది. భాను కిరణ్‌ను చంచలగుడా జైలుకు తరలించాలని ఇటీవల చర్లపల్లి జైలు అధికారులు కోర్టును కోరిన విషయం తెలిసిందే.

ప్రాణహాని ఉన్న కారణంగా భాను కిరణ్‌కు ప్రత్యేక బ్యారక్‌ను ఏర్పాటు చేయనున్నారు. గత నాలుగేళ్లుగా భాను కిరణ్ చర్లపల్లి జైలులో ఉంటున్నాడు. భాను కిరణ్‌ను చర్లపల్లి జైలు నుంచి తరలించాలని స్వయంగా జైలు సూపరిండెంట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

జైలు నుంచి భాను కిరణ్ దందాలు నిర్వహించడమే దీనికి కారణమని భావిస్తున్నారు. ఈ పిటిషన్‌ రేపు శుక్రవారం విచారణకు రానుంది. ఇటీవల వెలుగు చూసిన ఓ దందాలో భాను కిరణ్ ప్రమేయం ఉన్నట్లు బయటపడిందని అంటున్నారు. చంచల్‌గూడా జైలులో ప్రత్యేక బ్యారక్‌లు ఉన్నందున భాను కిరణ్‌ను అక్కడికి మార్చాలని చర్లపల్లి జైలు అధికారులు కోరారు.

Bhanu Kiran to be shifted to Chanchalguda jail

గతంలో చంచల్‌గుడా జైలులో బ్యారక్‌లు లేనందున భాను కిరణ్‌ను చర్లపల్లి జైలుకు పంపించారని, ఇప్పుడు బ్యారక్‌లు అందుబాటులో ఉన్నాయని వారు వాదిస్తున్నారు. చంచల్‌గుడా జైలులో 200 బ్యారక్‌లు ఉన్నాయని, ఆ జైలులో కట్టుదిట్టమైన భద్రత ఉంటుందని వారు అంటున్నారు.

మద్దెలచెర్వు సూరి హత్య కేసులో భాను కిరణ్ అరెస్టయిన విషయం తెలిసిందే. ఆ కేసుతో పాటు అతనిపై పలు కేసులు కూడా ఉన్నాయి. వాటి విచారణ సందర్బంగా భాను కిరణ్‌ను వివిధ కోర్టులకు తరలించి, తిరిగి తీసుకుని రావాల్సి ఉంటుంది.

English summary
Nampally court has permitted to shift Bhanu kiran, accused in Maddelachervu suri murder case, from Cherlapally jail to Chanchalguda jail in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X