హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నిమ్స్‌లో కోవ్యాక్సిన్‌ రెండో దశ ట్రయల్స్‌ ప్రారంభించిన భారత్ బయోటెక్ ఫార్మాసూటికల్స్

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రం నుండే కరోనా వైరస్ కు ముందుగా వ్యాక్సిన్ వస్తుందని, దీని కోసం దేశం మొత్తం హైదరాబాద్ వైపే చూస్తోంది. హైదరాబాద్ కు చెందిన ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ సంస్థ నుండి కరోనా వైరస్ కు తొలి వ్యాక్సిన్ రూపొందుతుందని మంత్రి కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేసిన సమయంలో క్లినికల్ ట్రయల్స్ శరవేగంగా జరుగుతున్నాయి.

కరోనా చివరిది కాదు ...తరువాత మహమ్మారికి సిద్ధంగా ఉండండి : డబ్ల్యూహెచ్ఓ సంచలన హెచ్చరికకరోనా చివరిది కాదు ...తరువాత మహమ్మారికి సిద్ధంగా ఉండండి : డబ్ల్యూహెచ్ఓ సంచలన హెచ్చరిక

ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ క్లినికల్ ట్రయల్స్

ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ క్లినికల్ ట్రయల్స్

ఇప్పుడు ప్రపంచమంతా కరోనా వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఆరోగ్య సంక్షోభంతో పాటుగా,ఆర్థిక సంక్షోభం కూడా నెలకొంది. ఈ సంక్షోభాల నుండి బయటపడడం కోసం ప్రపంచ దేశాలు పోటీపడి మరి కరోనా వ్యాక్సిన్ తయారీలో నిమగ్నమయ్యాయి.

ఇక భారతదేశం విషయానికి వస్తే దేశంలోనే ఫార్మా దిగ్గజం, తెలంగాణా రాష్ట్రానికి చెందిన భారత్ బయోటెక్ ఫార్మాస్యూటికల్ సంస్థ కరోనా వ్యాక్సిన్ కు సంబంధించి క్లినికల్ ట్రయల్స్ లో నిమగ్నమైంది.

మొదటిదశ సక్సెస్ .. రెండో దశ ట్రయల్స్ ప్రారంభం

మొదటిదశ సక్సెస్ .. రెండో దశ ట్రయల్స్ ప్రారంభం


ఇప్పటికే భారత్ బయోటెక్ ఫార్మాస్యూటికల్స్ తయారు చేస్తున్న కోవ్యాక్సిన్ టీకా ప్రయోగానికి దేశంలోని 12 ఆసుపత్రుల ఎంపిక చేసిన విషయం తెలిసిందే . అందులో హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రి కూడా ఒకటి. మొదటి దశ క్లినికల్ ట్రయల్స్ ను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసిన భారత్ బయోటెక్ ఇప్పుడు రెండవ దశ ట్రయల్స్ ను ప్రారంభించింది.

మొదటిదశలో టీకా వేయించుకున్న వారంతా ఆరోగ్యంగానే ఉన్నారు. ఈ నేపథ్యంలో మొదటి దశ సక్సెస్ అయినట్లుగా ప్రకటించిన భారత్ బయోటెక్ , ఇప్పుడు రెండవ దశ ట్రయల్స్ ను ప్రారంభించింది.

నిమ్స్ లో కొనసాగుతున్న హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్

నిమ్స్ లో కొనసాగుతున్న హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్

నిమ్స్ లో కొనసాగుతున్న హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్ లో భాగంగా కోవ్యాక్సిన్ రెండో దశ టీకా ప్రయోగాన్ని మొదలుపెట్టారు వైద్య శాస్త్రవేత్తలు. మంగళవారం నుండి టీకా ప్రయోగం కొనసాగుతుంది. ఈ రెండో దశ ప్రయోగంలో భాగంగా దేశవ్యాప్తంగా 380 మందికి టీకా ప్రయోగాన్ని చేయనున్నారు.
కోవిడ్ వ్యాక్సిన్ ను త్వరగా అభివృద్ధి చేయాలని ఒత్తిడి ఉన్నప్పటికీ , భద్రత ,నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడేది లేదని కోవిడ్ వ్యాక్సిన్ పై భారత్ బయోటెక్ చైర్మన్ కృష్ణ ఎల్ల పేర్కొన్న విషయం తెలిసిందే.

రెండో దశ క్లినికల్ ట్రయల్స్ స్టార్ట్ చేసిన తెలంగాణా ఫార్మా దిగ్గజం

రెండో దశ క్లినికల్ ట్రయల్స్ స్టార్ట్ చేసిన తెలంగాణా ఫార్మా దిగ్గజం

కోవిడ్ వ్యాక్సిన్ ను అత్యుత్తమ నాణ్యత ప్రమాణాలతో, సురక్షితంగా, అందుబాటు ధరలో ఆవిష్కరిస్తామని పేర్కొన్న కృష్ణ ఎల్ల అత్యున్నత ప్రమాణాలతోనే క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయని పేర్కొన్నారు. కోవ్యాక్సిన్‌ టీకా రెండోదశ ట్ర‌య‌ల్స్‌కు భారత్‌ బయోటెక్‌ కు అనుమతి లభించిందని పీజీఐ వైస్‌ఛాన్సెల‌ర్‌ డాక్టర్‌ ఓపీ కల్రా తెలిపిన విషయం తెలిసిందే . కోవ్యాక్సిన్ రెండో ద‌శ ట్ర‌య‌ల్స్‌కు 12 ఏండ్ల‌ నుంచి 65 ఏండ్ల మ‌ధ్య వ‌యసు కలిగిన వాలెంటీర్‌ల‌ను సిద్ధంగా ఉంచిన‌ట్లు ఓపీ క‌ల్రా చెప్పారు. వారికి స్క్రీనింగ్‌ కూడా పూర్త‌య్యింది . ట్రయల్స్ కూడా నిర్వహిస్తున్నారు.

English summary
It is learned that 12 hospitals in the country have been selected for the covaxin test manufactured by Bharat Biotech Pharmaceuticals. Nims Hospital in Hyderabad is one of them. Medical scientists have begun testing the second phase of the covaxin as part of ongoing human clinical trials in Nims. The vaccine trial will continue from Tuesday. As part of this second phase of the experiment, 380 people across the country will be vaccinated.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X