వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వీకి భారత రత్న ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం ... సీఎం కేసీఆర్ నిర్ణయం

|
Google Oneindia TeluguNews

బహుముఖ ప్రజ్ఞాశాలి, వివిధ రంగాల్లో కృషి చేసిన మాజీ భారత ప్రధాని పీవీ నరసింహారావు కు భారతరత్న పురస్కారం ప్రకటించాలని వచ్చే నెలలో జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేయనున్నట్టు ముఖ్యమంత్రి కెసిఆర్ వెల్లడించారు. నెక్లెస్ రోడ్డుకు పివి జ్ఞానమార్గ్ గా పేరుపెట్టాలని, అలాగే హైదరాబాద్లో పివి మెమోరియల్ నిర్మించాలని ఆయన పేర్కొన్నారు. భారతదేశంలో అనేక సంస్కరణలు తీసుకు వచ్చిన గొప్ప సంస్కర్తగా, మహా మనీషిగా పీవీ నరసింహారావు కు మంచి పేరు ఉందన్నారు.

తెలంగాణ అస్తిత్వానికి పీవీ నరసింహారావు ప్రతీక అని సీఎం కేసీఆర్ కొనియాడారు.
పీవీ శతజయంతి ఉత్సవాల నిర్వహణ పై ప్రగతి భవన్ లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి కెసిఆర్ పీవీ నరసింహారావు ఖ్యాతి ఇనుమడింపజేసేలా ఆయన గురించి అందరికీ తెలియాలని అనేక నిర్ణయాలు తీసుకున్నారు. దేశ ప్రధాని గా ఎదిగిన తెలంగాణ తొలి బిడ్డ గొప్పతనాన్ని రాష్ట్ర అసెంబ్లీలో చర్చించాలని, అసెంబ్లీ సమావేశాల్లో ఆయన గురించి విస్తృత చర్చ చేపట్టాలని నిర్ణయించారు.

Bharat Ratna for ex-PM PV Narasimha Rao.. resolution in ts assembly

పీవీకి భారతరత్న పురస్కారం ఇవ్వాలని తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే తెలంగాణ అసెంబ్లీలో పీవీ నరసింహారావు చిత్రపటాన్ని పెట్టాలని నిర్ణయించారు. భారత పార్లమెంట్ లో కూడా ఆయన చిత్రపటాన్ని పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరతామని పేర్కొన్నారు.

పీవీ అత్యంత సాహసోపేతంగా భూసంస్కరణలు అమలు చేశారని తెలంగాణలో 93 శాతం చిన్న సన్నకారు రైతుల చేతికి భూమి వచ్చిందని, పీవీ ప్రధానిగా చేపట్టిన ఆర్థిక సంస్కరణల ఫలితంగా దేశం ఆర్థికంగా నిలదొక్కుకుని పేర్కొన్నారు.

హైదరాబాదులో పివి నెలకొల్పిన సెంట్రల్ యూనివర్సిటీకి పీవీ నరసింహారావు పేరు పెట్టాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేస్తామని కూడా సీఎం కేసీఆర్ ప్రకటించారు. పీవీ నరసింహారావు శత జయంతి వేడుకల సందర్భంగా ఆ మహనీయుని అద్భుతంగా స్మరించుకోవాలని, భావితరాలకు పీవీ గొప్పతనం తెలిసేలా గా కార్యక్రమాలు రూపొందించాలని సీఎం కమిటీ సభ్యులకు సూచించారు.

English summary
Telangana Rashtra Samithi president and Chief Minister K Chandrashekhar Rao on Friday announced that in the forthcoming Legislature sessions, a resolution will be passed demanding ‘Bharat Ratna’ for the departed veteran politician former Prime Minister PV Narasimha Rao
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X