వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆమరణ దీక్షను విరమించిన భట్టి విక్రమార్క...

|
Google Oneindia TeluguNews

సీఎల్పీ విలీనాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క చేస్తున్న అమరణ దీక్షను విరమించారు. కాగా ఆయన దీక్షను కాంగ్రెస్ పార్టీ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి , జానరెడ్డిలు నిమ్మరసం ఇచ్చి విరమింప చేశారు.అంతకుం ముందు కాంగ్రెస్ పార్టీ జాతీయ నేతలలతోపాటు రాష్ట్ర్ర నేతలు పరామర్శించి సంఘీభావం వ్యక్తం చేశారు.

గత శుక్రవారం కాంగ్రెస్ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడీ టీఆర్ఎస్‌లో చేరారు, అనంతరం స్పికర్‌ను కలిసి టీఆర్ఎస్‌లో విలీనం చేయాలంటూ లేఖను ఇచ్చారు. దీంతో మొత్తం 12మంది ఎమ్మెల్యేలను టీఆర్ఎస్‌ఎల్పీలో చేరుస్తూ బులెటిన్ కూడ విడుదల అయింది. దీంతో ఈ చర్యను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలోనే నిరసన దీక్షకు దిగింది. అనంతరం శనివారం నుండి సీఎల్పి నేతగా ఉన్న బట్టి విక్రమార్క అమరణ నిరహార దీక్షకు దిగారు.

Bhatti Vikramarka call off the hunger strike

దీంతో మూడు రోజులుగా ఇందిరాపార్క్ వద్ద అమరణ నిరహార దీక్షను చేపట్టిన భట్టి విక్రమార్కను అరెస్ట్ చేసి దీక్షను భగ్నం చేశారు.అనంతరం ఆయన్ని అరెస్ట్ చేసి పోలీసులు ఇందిరా పార్క్ నుండి నిమ్స్‌కు తరలించారు.అయితే నిమ్స్‌లో కూడ భట్టి దీక్షను కొనసాగించారు. దీంతో పలువురు నేతలు ఆయనకు సంఘీభావం తెలిపారు. మరోవైపు ఆయన దీక్షను విరమించాలంటూ రాష్ట్ర్ర నేతలతో పాటు ఏఐసీసీ నేతలు కూడ ఫోన్ చేయడంతో ఆయన దీక్షను విరమించారు.

English summary
Congress leader Bhatti Vikramarka call off the hunger strike. who opposed the CLP's merger into TRSLP for last three days.Party leaders Uttam Kumar Reddy and Jana Reddy gave the lemon juice to batti.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X