వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసీఆర్‌పై రాష్ట్రపతికి, ప్రధానికి ఫిర్యాదు, అంతా అశాస్త్రీయమే : రేవంత్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : తెలంగాణ సీఎం కేసీఆర్‌పై రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖర్జీ, ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ సహా జాతీయ‌ ఎన్నిక‌ల క‌మిష‌న్‌కు ఫిర్యాదు చేశారు టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ లేఖాస్త్రాలు సంధించారు రేవంత్.

Revanth

ముఖ్యంగా కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ అత్యంత అశాస్త్రీయంగా జరిగిందని, మండ‌లాలు, రెవ‌న్యూ డివిజ‌న్ల ఏర్పాటు స‌రిగా లేదని పేర్కొంటూ రాష్ట్రపతికి లేఖ రాశారు రేవంత్. సీఎం కేసీఆర్ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్న రేవంత్.. ఇదే ఫిర్యాదును ప్రధాని మోడీకి, జాతీయ ఎన్నికల కమిషన్ కు లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు.మార్కెటింగ్ ఆఫీసర్‌లా గవర్నర్, సంక్షేమాన్ని గాలికొదిలేసిన కేసీఆర్

మార్కెటింగ్ ఆఫీసర్‌లా గవర్నర్ : భట్టి

ఖమ్మం: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ తో పాటు తెలంగాణ సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క. ముఖ్యంగా గవర్నర్ వ్యవహారశైలిని తప్పుబడుతూ.. రాజ్యాంగ పరిరక్షకునిగా వ్యవహరించాల్సిన గవర్నర్ అందుకు పూర్తి విరుద్దంగా ఉంటున్నారని మండిపడ్డారు.

గవర్నర్ వ్యవహారశైలి ప్రభుత్వానికి చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తున్నట్టు ఉందని తీవ్ర ఆరోపణ చేశారు. ఇక సీఎం కేసీఆర్ గురించి ప్రస్తావిస్తూ.. రాష్ట్రంలో సంక్షేమ పథకాలను కేసీఆర్ గాలికొదిలేశారని అసహనం వ్యక్తం చేశారు. ఓవైపు ఫీజు రీయింబర్స్ మెంట్ ను చెల్లించలేని ప్రభుత్వం.. మరోవైపు ఉన్న సచివాలయాన్ని కూల్చివేసి, కొత్తదాన్ని నిర్మించడం అవసరమా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను కేసీఆర్ మోసం చేస్తున్నారని భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు.

English summary
TPCC wise president Mallu Bhatti vikramarka fired on Governor Narasimhan. He alleged that governor was behaving like a marketing officer for govt
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X