హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు శ్రీకారం: మొదటి ఇల్లు పోలీసు కిష్టయ్య కుటుంబానికే

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు పలు చోట్ల భూమి పూజ చేశారు. కరీంనగర్‌లోని సప్తగిరి కాలనీలో ఎంపీ వినోద్ కుమార్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ భూమి పూజ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మొట్ట మొదటగా తెలంగాణ అమరవీరుడు పోలీసు కిష్టయ్య కుటుంబానికి అందజేస్తామని వినోద్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలోని నిరుపేదలకు డబుల్ బెడ్ రూం ప్లాట్లు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.

డబుల్‌ బెడ్‌రూమ్ ఇళ్లకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యేలు

Bhoomi pooja for double bedroom flats at karimnagar

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలకు ఆయా నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు శంకుస్థాపన చేశారు. మెదక్ జిల్లా చేగుంట మండలం నార్సింగిలో ఎమ్మెల్యే రామలింగారెడ్డి, నర్సాపూర్ మండలం కాగజ్‌మజ్దూర్‌లో ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, ఆదిలాబాద్ జిల్లా తామ్సి మండలం అర్లీపీలో ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు డబుల్ బెడ్ రూం ఇళ్లకు భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు.

డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల స్థలాలను పరిశీలించిన మంత్రి పోచారం

నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ మండలంలోని పెర్కిడ్‌లో డబుల్‌ బెడ్‌రూమ్ ఇళ్ల స్థలాలను మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం హామీ ఇచ్చినట్టుగా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను నిర్మించి తీరుతామన్నారు. ఈ సందర్భంగా మంత్రి వెంట ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ యోగితా రానా ఉన్నారు.

నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన మహోత్సవానికి వెళ్లిన సీఎం కేసీఆర్ ఈరోజు మధ్యాహ్నం రాష్ట్రానికి చేరుుకని ఆయన సూర్యాపేటలో డబుల్‌బెడ్‌రూం ఇళ్లకు శంకుస్థాపన చేయనున్నారు.

English summary
Bhoomi pooja for double bedroom flats at karimnagar
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X