• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Big Boss 3: పవన్ పరువు తీస్తుందా ఆ అమ్మాయి? గతంలో జరిగిందేంటీ..ఇప్పుడేంటీ?

|

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. వెండితెర మీద కనిపించి సుమారు మూడేళ్లవుతోంది. పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా మారిపోయారు. జనసేన పార్టీని స్థాపించి, మొన్నటి అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేశారు. ఎన్నికల ఫలితాల మాట ఎలా ఉన్నప్పటికీ.. ఆయనకు ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. సినిమాల్లోనూ అంతే! జయాపజయాలతో సంబంధం లేని కేరీర్ ఆయనది. ఏళ్ల తరబడి ఒక్క హిట్టూ లేకపోయినా ఒక్క ఇంచి కూడా ఆయనపై ఉన్న అభిమానం తగ్గదు. రాజకీయాల్లో ఆయన వెంట నిలిచింది, నడిచింది కూడా అభిమానులు మాత్రమే.

కొండవీటి శునకం..వెన్నుపోటు వేటగాడు! బెజవాడను దివాళా తీయిస్తోన్న ఇస్మార్ట్ నాని: పీవీపీ

తొలి రెండు సీజన్ల విజేతలు పవన్ ఫ్యాన్సే

తొలి రెండు సీజన్ల విజేతలు పవన్ ఫ్యాన్సే

ఆయన ఇమేజ్‌ను తమకు అనుకూలంగా మలుచుకున్న వాళ్లు చాలామందే ఉన్నారు. తోటి నటీనటులు పవన్ కల్యాణ్ అభిమానులుగా మారిపోయి.. విజయం సాధించిన వాళ్లే. ఉదాహరణకు బిగ్ బాస్ రియాలిటీ షో. బిగ్ బాస్ తొలి సీజన్ విజేతగా నిలిచిన నటుడు శివ బాలాజీ గానీ, సీజన్- 2 టైటిల్ ను సొంతం చేసుకున్న కౌశల్ గానీ కరడు గట్టిన పవన్ కల్యాణ్ అభిమానులుగా గుర్తింపు పొందారు. వారిద్దరూ ఆ టైటిల్ ను అందుకోవడానికి పవన్ కల్యాణ్ అభిమానులు అనే ట్యాగ్ ప్రధాన కారణమైందనడంలో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. పవన్ అభిమానులు అనే ఒకే ఒక్క కారణంతో ఆయన అభిమానులందరూ వారిద్దరికి గంపగుత్తగా ఓట్లు పడేశారు.

అషూ రెడ్డిపై పవన్ ఫ్యాన్ ముద్ర

అషూ రెడ్డిపై పవన్ ఫ్యాన్ ముద్ర

ఇక బిగ్ బాస్ సీజన్ 3లోనూ అదే పరిస్థితి తలెత్తే అవకాశాలు ఉన్నాయా? అని అనుకుంటే లేదనే అనుకోవాల్సి ఉంటుంది. ఈ సీజన్ లో కూడా పవన్ కల్యాణ్ అభిమాని ఒకరు బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ గా ఉన్నారు. ఆమే- అషూ రెడ్డి. డబ్ స్మాష్ స్టార్ గా సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకున్న అషూ రెడ్డి ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో కొనసాగుతున్నారు. ఆమె ప్యూర్ పవన్ కల్యాణ్ ఫ్యాన్. తొలి రెండు సీజన్ల తరహాలోనే ఈ సారి అషూ రెడ్డి సైతం పవన్ కల్యాణ్ అభిమానిగా ముద్ర పొందే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నాలు ఆమెకు బెడిసి కొడుతున్నాయి. ఆమె చేస్తోన్న అతి కాస్తా పవన్ అభిమానులకు మింగుడు పడట్లేదు.

ఓవర్ యాక్షన్ చేస్తోందా?

ఓవర్ యాక్షన్ చేస్తోందా?

తాను పవన్‌కల్యాణ్‌కి వీరాభిమానని ఆషూ రెడ్డి తన బిగ్ బాస్ హౌస్ మేట్స్ తో చాలా సార్లు చెప్పుకున్నారు. అవసరం ఉన్నా, లేకపోయినా ఆమె ఈ విషయాన్ని పదే పదే చెప్పుకోవడం ఓవర్ యాక్షన్ గా మారిందని స్వయంగా అభిమానులే వ్యాఖ్యానిస్తుండటం చెప్పుకోదగ్గ విషయం. ఇది వరకు అషూ రెడ్డి తన గుండెలపై పవన్ పేరును టాటూ వేయించుకున్నారు. దీన్ని ఆమె బహిరంగంగా ప్రదర్శించారు కూడా. దీనికి సంబంధించిన ఓ పిక్ ను సోషల్ మీడియాలో విడుదల చేశారు. ప్రత్యేకించి- పవన్ కల్యాణ్, కత్తి మహేష్ మధ్య నెలకొన్న వివాదం సమయంలో ఈ పిక్ పై సోషల్ మీడియాలో భలేగా చర్చ నెలకొంది.

 మొహం మొత్తుతోందంటోన్న ఫ్యాన్స్

మొహం మొత్తుతోందంటోన్న ఫ్యాన్స్

పవన్‌కల్యాణ్‌తో కత్తి మహేశ్ వివాదం జరిగేటప్పుడు తన ఎదపై పవన్‌కల్యాణ్ అంటూ టాటూ వేయించుకుని ఆ ఫొటోను పోస్ట్ చేస్తూ `నేను కూడా పవన్ అని టాటూ వేయించుకున్నాను. అంటే ఆయనతో నాకు ఎఫైర్ ఉన్నట్లా?` అంటూ ప్రశ్నించారు. అప్పట్లో ఆషూ రెడ్డి చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా అయింది. పవన్ అభిమానులందరూ ఆమె ఫొటోను వైరల్ గా చేశారు. రాను రాను.. బిగ్ బాస్ హౌస్ లో అషూ రెడ్డి ప్రవర్తన కాస్తా శృతి మించిందని, అదే పనిగా పవన్ అభిమానినంటూ చెప్పుకోవడం వల్ల మొహం మొత్తుతోందనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ఆమె దీని నుంచి బయటపడాల్సిన అవసరం ఉందని అంటున్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Jana Sena Party Chief, Tollywood Power Star Pawan Kalyan fan Ashoo Reddy is participate in Big Boss Telugu Season 3. Currently, she is in Big Boss house and she has got good craze from Pawan Kalyan's fans, but now a days she fails to attract the Pawan Kalyan' fans.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more