India
  • search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆర్ఆర్ఆర్ రిలీజ్ వాయిదా : ఏపీ - ఒమిక్రాన్ ఎఫెక్ట్ : విడుదల ఎప్పుడంటే..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

నూతన సంవత్సరం ప్రారంభం నాడు సినీ ఫ్యాన్స్ కు నిరాశ పరిచే వార్త బయటకు వచ్చింది. రాంచరణ్.. జూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు నిరాశ తప్పటం లేదు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించారు. భారీ ఖర్చు తో ప్రమోషన్స్ విషయంలోనూ ఏ మాత్రం తగ్గకుండా సినిమా విడుదలకు సిద్దమయ్యారు. ఈ నెల 7వ తేదీన ఆర్ఆర్ఆర్ విడుదలకు ముహర్తంగా నిర్ణయించారు. ఇప్పటికే నాలుగు సార్లు విడుదల వాయిదా పడిన ఈ సినిమా విడుదల మరోసారి వాయిదా పడింది. పాన్ ఇండియా మూవీగా అనేక భాషల్లో విడుదల చేయాల్సి ఉంది. దేశ వ్యాప్తంగా పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులతో అనేక రాష్ట్రాల్లో ఆంక్షలు అమలవుతున్నాయి.

RRR, Radhe Shyam ఒకవైపు..Omicron టెన్షన్ మరోవైపు | Pan India | Oneindia Telugu
అనేక రాష్ట్రాల్లో అమలవుతున్న ఆంక్షలు

అనేక రాష్ట్రాల్లో అమలవుతున్న ఆంక్షలు

ప్రస్తుతం మహారాష్ట్ర, కర్ణాటక, న్యూఢిల్లీ, తమిళనాడు రాష్ట్రాల్లో రాత్రిపూట కర్ఫ్యూలతో పాటు థియేటర్లలో 50% ఆక్యుపెన్సీ, ఇంకా పలు ఆంక్షలు విధించారు. ఒమిక్రాన్ వేరియంట్ విస్తృతంగా వ్యవథి చెందుతున్న తరుణంలో ఇతర రాష్ట్రాలు లాక్డౌన్ దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇప్పటిదాకా తగ్గేదే లే అంటూ సినిమా విడుదలపై క్లారిటీ ఇస్తూ వచ్చిన మేకర్స్ మరి ఇప్పుడు ఏమంటారనేది ఆసక్తికరంగా మారింది. 1920 నాటి పీరియాడిక్ డ్రామా 'ఆర్ఆర్ఆర్'లో ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియా భట్ మరియు ఒలివియా మోరిస్ ప్రధాన పాత్రలు పోషించారు.

ప్రమోషన్స్ తో మంచి ఊపు

ప్రమోషన్స్ తో మంచి ఊపు

ఈ సినిమాకు సంబంధించిన టీజర్స్. .పాటలు ఊహించిన దాని కంటే భారీ స్పందనతో మంచి వ్యూస్ దక్కించుకున్నాయి. ఇక, జూనియర్ ఎన్టీఆర్ - రాం చరణ్ కాంబినేషన్ లో వస్తున్న మల్టీ స్టారర్ మూవీ కావటంతో మరింత క్రేజ్ పెరిగింది. రాజమౌళి తన పని తనం మొత్తం ఈ సినిమాలో చూపించారు. నిర్మాత దానయ్య ఖర్చు విషయంలో ఏ మాత్రం వెనక్కు తగ్గలేదు. ముంబైతో పాటుగా చెన్నై..తిరువనంతపురంలోనూ సినిమా ప్రమోషన్స్ జరిగాయి. ఇక, ఏపీలోనూ కొనసాగుతున్న టిక్కెట్ల ధరల వ్యవహారం మరో కారణంగా తెలుస్తోంది.

ఏపీలో పరిస్థితుల ప్రభావం సైతం

ఏపీలో పరిస్థితుల ప్రభావం సైతం

ఇప్పటికే ఆర్ఆర్ఆర్ టిక్కెట్ల ధరల పెంపు అంశం పైన నిర్మాత దానయ్య ఏపీ మంత్రి పేర్ని నానితో పలు మార్లు ఫోన్ ద్వారా చర్చించారు. అయితే, ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం టిక్కెట్ల ధరల వ్యవహారం పైన కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సంప్రదింపులు ప్రారంభించింది. శుక్రవారం తొలి సమావేశం జరగ్గా..తరువాతి సమావేశం ఈ నెల 11వ తేదీకి వాయిదా వేసారు.

ఆర్ఆర్ఆర్ ఈ నెల 7వ తేదీన విడుదల కావాల్సి ఉంది. ఇక, ఆర్ఆర్ఆర్ తో పాటుగా రాధే శ్యామ్ సైతం పాన్ ఇండియా మూవీ. ఈ రెండు సినిమాల కోసం సినీ ప్రముఖులు చర్చలు జరిపి...భీమ్లా నాయక్ ను ఫిబ్రవరిలో విడుదలయ్యేలా ఒప్పించారు. ఈ రెండు సినిమాలే సంక్రాంతి బరిలో ఉండేలా నిర్ణయించారు.

ఆర్ఆర్ఆర్ తిరిగి రిలీజ్ ఎప్పుడంటే..

ఆర్ఆర్ఆర్ తిరిగి రిలీజ్ ఎప్పుడంటే..

అయితే, తిరిగి ఈ సినిమాను ఏప్రిల్ మొదటి వారంలో రిలీజ్ చేయాలని మూవీ మేకర్స్ నిర్ణయించారు. సంక్రాంతి కోసం ఇతర సినిమాల విడుదల వాయిదా వేయటంతో.. ఆ సినిమాల విడుదల పూర్తయిన తరువాతనే తిరిగి ఆర్ఆర్ఆర్ విడుదలకు నిర్ణయించారు. దీనికి సంబంధించి రేసులో ఉన్న ఇతర నిర్మాతలతో సంప్రందింపులు చేసినట్లు సమాచారం. కరోనా తగ్గుముఖం.. ఆంక్షల సడలింపు.. ఏపీలో సినిమా టిక్కెట్ల ధరల తగ్గింపు అంశం పరిష్కారం ఇవన్నీ ఈ లోగా సమిసిపోతాయని అంచనా వేస్తున్నారు. అయితే, సంక్రాంతి సమయంలో తమ అభిమాన హీరోల మూవీ కోసం నిరీక్షిస్తున్న వారికి మాత్రం ఇది షాకింగ్ న్యూస్ గా మారుతోంది.

English summary
Big news from big budget movie RRR that the Rajamouli magnum Opus movie is postponed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X