• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జగన్ మాజీ అనుచరులకు కేసీఆర్ ఊరట- మానుకోట కాల్పుల కేసు ఉపసంహరణ ?

|

2010 నాటి మానుకోట కాల్పుల కేసుపై జరుగుతున్న విచారణను ఉపసంహరించుకోవాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించిందా ? అప్పట్లో తెలంగాణ వాదులు వర్సెస్ వైఎస్ జగన్ అనుచరులుగా సాగిన ఈ ఘటనపై సీబీసీఐడీ చేస్తున్న విచారణ తుది దశకు చేరుకున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును వెనక్కి తీసుకోబోతోందా ? ప్రస్తుతం ఈ కేసులో నిందితులుగా ఉన్న వారిలో కొందరు చనిపోవడం, తెలంగాణ ఏర్పాటు నేపథ్యంలో కేసు ప్రాధాన్యం కోల్పోవడం వంటి కారణాలే ఇందుకు దారి తీస్తున్నాయా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. త్వరలో కేసీఆర్ సర్కారు దీనిపై కీలక ఆదేశాలు ఇవ్వబోతోంది.

మానుకోట కాల్పుల కేసు..

మానుకోట కాల్పుల కేసు..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం సాగుతున్న దశలో చోటు చేసుకున్న మానుకోట కాల్పుల ఘటనపై జరుగుతున్న విచారణ దాదాపుగా తుది దశకు చేరుకుంది. అప్పట్లో కాంగ్రెస్ నేతగా ఉన్న వైఎస్ జగన్ ఓదార్పు యాత్ర కోసం వెళ్లినప్పుడు చోటు చేసుకున్న కాల్పుల్లో 13 మంది ఉద్యమకారులు గాయపడటం, ఇందులో జగన్ అనుచరులుగా ఉన్న కాంగ్రెస్ నేతల పాత్ర ఉండటంతో అప్పట్లో ఈ కేసుకు చాలా ప్రాధాన్యం ఉండేది. అప్పట్లో ప్రభుత్వం సీబీసీఐడీ విచారణకు ఆదేశాలు ఇవ్వడంతో అది కాస్తా ఇంకా సాగుతూనే ఉంది. చివరికి ఈ కేసు తుది దశకు చేరుకోవడంతో దీనిపై ఓ కీలక నిర్ణయం తీసుకునే దిశగా కేసీఆర్ సర్కారు అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది.

జగన్ టూర్‌ లో జరిగిందిదీ...

జగన్ టూర్‌ లో జరిగిందిదీ...

అది 2010 మే నెల. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతున్న రోజులు. అప్పటి కాంగ్రెస్ నేతగా ఉన్న వైఎస్ జగన్ తన తండ్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు వరంగల్ జిల్లా మానుకోట వెళ్లాలని నిర్ణయించారు. కానీ అప్పటికే తెలంగాణకు వ్యతిరేకంగా పేరు తెచ్చుకున్న వైఎస్ కుమారుడిగా జగన్‌ పర్యటనను అంగీకరించేందుకు అక్కడి ప్రజలు సిద్ధంగా లేరు. దీంతో జగన్ పర్యటన ప్రకటన రాగానే అడ్డుకుంటామన్న హెచ్చరికలు మొదలయ్యాయి. చివరికి రోశయ్య ప్రభుత్వం కూడా ఆ పరిస్ధితుల్లో మానుకోట వెళ్లడం మంచిది కాదని జగన్‌కు సూచించింది. అయినా వినకుండా మానుకోట రైల్వేస్టేషన్ వస్తున్న జగన్‌కు స్వాగతం పలికేందుకు అప్పటి మంత్రి కొండా సురేఖతో పాటు ఆమె భర్త మురళి, భూమా నాగిరెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి వంటి వారు అక్కడికి చేరుకున్నారు. వీరి రాకతో అక్కడ తెలంగాణవాదులు ఆగ్రహంతో ఊగిపోయారు. రాళ్ల దాడులు మొదలుపెట్టారు. దీంతో కొండా సురేఖ, మురళి గన్‌మెన్లు కాల్పులు ప్రారంభించారు. చివరికి పోలీసులు రంగ ప్రవేశం చేసి వీరితో పాటు జగన్‌కు కూడా అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి వెనక్కి పంపారు. ఈ ఘటనలో 13 మంది ఉద్యమకారులు గాయపడ్డారు. అప్పటి ప్రభుత్వం ఈ ఘటనపై సీబీసీఐడీ దర్యాప్తుకు ఆదేశించింది.

నత్తనడకన సాగిన దర్యాప్తు

నత్తనడకన సాగిన దర్యాప్తు

2010 లో మానుకోట కాల్పులు చోటు చేసుకుని పదేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో తాజాగా ఈ దర్యాప్తుకు ఓ ముగింపు ఇచ్చేందుకు తెలంగాణ సీబీసీఐడీ సిద్దమవుతోంది. పదేళ్ల కాలంలో పలు దఫాలుగా సాగిన దర్యాప్తులో ఏం తేలిందో తేలియదు కానీ ఇంత సుదీర్ఘంగా సాగిన ఈ కేసు మాత్రం తీవ్ర చర్చనీయాంశమైంది. ముఖ్యంగా కేసీఆర్ నేతృత్వంలో 2014లో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇందులో నిందితులుగా ఉన్న వారంతా కాంగ్రెస్ నేతలే కావడంతో ఇది ఓ కొలిక్కి వస్తుందని భావించారు. కానీ అలా జరగలేదు. కేసీఆర్ ఐదేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్నా కేసు మాత్రం తేలలేదు. ఆ తర్వాత కేసీఆర్ మరోసారి గెలిచి అధికారం చేపట్టినా దీనికి ఓ ముగింపు లభించలేదు. చివరికి ఈ కేసును ముందుకు తీసుకెళ్లే పరిస్ధితి లేదని భావిస్తున్న సీఐడీ రాష్ట్ర ప్రభుత్వ సలహా మేరకు కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్దమవుతోంది.

  School Bus Drivers Facing Problem In Lockdown లాక్ డౌన్ లో స్కూల్ బస్ డ్రైవర్ల ఇబ్బందులు!!
   ఉపసంహరణ దిశగా అడుగులు..

  ఉపసంహరణ దిశగా అడుగులు..

  మానుకోటలో కాల్పుల ఘటనపై అప్పట్లో తెలంగాణ జేఏసీ ప్రతినిధిగా ఉన్న డాక్టర్ డోలి సత్యనారాయణ పలువురు కాంగ్రెస్ నేతలపై ఫిర్యాదు చేశారు. ఈ పిర్యాదు ఆధారంగానే సీబీసీఐడీ కేసు నమోదు చేసింది. ఇప్పుడు మారిన పరిస్దితుల్లో కేసు ముందుకు కొనసాగించలేని పరిస్ధితి ఉందనే కారణంతో విచారణ నిలిపేస్తే అప్పటి కేసులను ఉపసంహరించుకుంటూ ఫిర్యాదు చేసిన డోలి సత్యనారాయణకు సీబీసీఐడీ నోటీసులు పంపింది. దీనిపై ఆయన అభ్యంతరాలు వ‌్యక్తం చేయకుంటే కేసులు ఉపసంహరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసే అవకాశముంది. అభ్యంతరాలు వ్యక్తం చేస్తే మాత్రం మరికొంతకాలం ఈ ప్రక్రియ కొనసాగనుంది.

  English summary
  kcr led telangana government is planning to withdraw manukota firing case of 2010 against congress leaders and then ys jagan's close aides also.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X