వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసీఆర్ కు దిమ్మతిరిగే షాక్ .. మల్కాజ్ గిరిలో రేవంత్ రెడ్డి విజయం

|
Google Oneindia TeluguNews

తెలంగాణా రాష్ట్రంలో జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో నువ్వా నేనా అంటూ కేసీఆర్ తో తలపడిన ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి కొడంగల్ లో ఓటమి పాలయ్యారు. అయితే లోక్ సభ ఎన్నికల్లో మల్కాజ్ గిరి నుండి పోటీ చేసిన రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థికి గట్టి పోటీ ఇచ్చారు. తెలంగాణా రాష్ట్రంలో మొత్తం లోక్‌సభ స్థానాలను క్లీన్ స్వీప్ చేయబోతున్నామని చెప్పుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలంగాణా ప్రజలు షాక్ ఇచ్చారు. లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో ఇప్పటికి రెండు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సొంతం చేసుకుంది. ఇక తాజాగా రేవంత్ రెడ్డి విజయంతో కేసీఆర్ కు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది కాంగ్రెస్ .

ప్రతిపక్ష పార్టీల అవసరం గుర్తించిన తెలంగాణా ప్రజలు .. రేవంత్ రెడ్డి కి ఎంపీగా అవకాశం

ప్రతిపక్ష పార్టీల అవసరం గుర్తించిన తెలంగాణా ప్రజలు .. రేవంత్ రెడ్డి కి ఎంపీగా అవకాశం

ఆరు నెలలు. కేవలం ఆరు నెలలు. తెలంగాణ ఓటరు మనసు ఊహించని విధంగా మారిపోయింది. గతేడాది నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు గతం కంటే ఎక్కువగా మెజార్టీ కట్టబెట్టిన తెలంగాణ ఓటర్లు... ఆరు నెలలు తిరిగేసరికి కేసీఆర్‌కు షాక్ ఇచ్చేలా తీర్పు ఇవ్వాలని డిసైడయ్యారు. రేవంత్ రెడ్డిని ఓడించి టీఆర్ ఎస్ కు పట్టం కట్టిన ప్రజలు రేవంత్ రెడ్డిని గెలిపించాల్సిన అవసరం వుందని గుర్తించారు. తెలంగాణా రాష్ట్రంలో ప్రతిపక్షం లేకపోతే అధికార పక్షం పనులు చెయ్యడాని ఆలస్యంగా అర్ధం చేసుకున్న ప్రజలు లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు, బీజేపీ కి అవకాశం ఇచ్చారు.

మల్కాజ్ గిరి నుండి రేవంత్ రెడ్డి విజయం .. కేసీఆర్ కు బిగ్ షాక్

మల్కాజ్ గిరి నుండి రేవంత్ రెడ్డి విజయం .. కేసీఆర్ కు బిగ్ షాక్

లోక్‌సభ ఎన్నికల ఫలితాలు తెలంగాణలోని టీఆర్ఎస్ ప్రభుత్వానికి షాక్ మీద షాక్ ఇస్తున్నాయి. టి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఫైర్ బ్రాండ్ , టీఆర్ఎస్‌ను విమర్శించడంలో అందరికంటే ముందుండే రేవంత్ రెడ్డి మల్కాజ్ గిరిలో విజయం సాధించారు. అతిపెద్ద లోక్ సభ నియోజకవర్గమైన మల్కాజ్ గిరి నుంచి కాంగ్రెస్ తరపున బరిలోకి దిగిన రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డిపై 6 వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మల్కాజ్ గిరి నుంచి పోటీ చేసిన రేవంత్ రెడ్డిని ఓడించేందుకు టీఆర్ఎస్ ఎంతగానో ప్రయత్నించింది. మొదట నుండీ రేవంత్ రెడ్డి ని టార్గెట్ చేసుకున్న గులాబీ బాస్ కేసీఆర్ రేవంత్ ఓటమి కోసం విఫల యత్నం చేశారు .అయినప్పటికీ రేవంత్ దీటుగా పోరాటం చేశారు.

మూడు స్థానాల్లో కాంగ్రెస్ విజయం .. మూడు చోట్ల బీజేపీ విజయం

మూడు స్థానాల్లో కాంగ్రెస్ విజయం .. మూడు చోట్ల బీజేపీ విజయం

రేవంత్ రెడ్డి, టీఆర్ఎస్ మధ్య చివరి రౌండ్ వరకు గెలుపు దోబూచులాడుతూ వచ్చింది. అయితే చివరి రౌండ్ వరకు స్వల్ప అత్యధికను ప్రదర్శిస్తూ వచ్చిన రేవంత్ రెడ్డినిఆ ఖరి రౌండ్‌లో విజయం వరించింది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నల్గొండ, భువనగిరిలో విజయ బావుటా ఎగురవేసింది. ఇప్పటికే ఉత్తర తెలంగాణలోని అదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ స్థానాలను ఎవరూ ఊహించని విధంగా బీజేపీ సొంతం చేసుకుంది. ఈ షాక్ నుంచి కోలుకోలేకపోతున్న టీఆర్ఎస్‌కు, గులాబీ బాస్ కేసీఆర్ కు రేవంత్ రెడ్డి విజయం మాత్రం దిమ్మతిరిగే షాక్ అని చెప్పక తప్పదు.

English summary
The results of the Lok Sabha elections across the country are coming out. The unexpected results of Telangana Lok Sabha elections are coming. Congress party gave a shock to Telangana Chief Minister KCR . The Congress party has won two seats in the Lok Sabha polls. Uttam Kumar Reddy, who was in the fray from Nalgonda,The nearest rival, TRS candidate vemreddy Narsimha Reddy . Uttam won by 23,000 votes. Komatireddy Venkata Reddy who won from Bhuvanagiri seat won by over 5,000 votes. Now revanth reddy also own in malkaj giri parliament constituency with 6000 votes. This is a big to the TRS and KCR
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X