Bigg Boss Elimination:హౌజ్‌లో కార్ఖానా కథ ముగిసింది..?అతని కోసమే ఇతను బలి.. అఖిల్ నెగ్గుతాడా..?
హైదరాబాదు: బిగ్‌బాస్ తెలుగు రియాల్టీ షో ముగింపు దశకు చేరుకుంటోంది. డిసెంబర్ 20వ తేదీన ఫైనల్స్ ఉంటుందని సమాచారం. ఈ క్రమంలోనే ప్రతివారం ఒక్కో కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతూ వస్తున్నారు. గతవారం జబర్దస్త్ అవినాష్ ఇంటిని వీడాడు. ఇక ఈ సారి ఎవరు ఎలిమినేట్ అవుతారా..? టాప్ ఫైవ్ కంటెస్టెంట్లు ఎవరుంటారా అనేదానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలోనే ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారన్నదానిపై లీకులు వచ్చేశాయి.

ఈ వారం చివరి ఎలిమినేషన్
నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బాగ్‌బాస్ తెలుగు సీజన్ 4 గ్రాండ్ ఫినాలే డిసెంబర్ 20వ తేదీన జరిగే అవకాశాలున్నాయి. ఈ క్రమంలోనే ఈ వారం చివరి ఎలిమినేషన్ ఉంటుందని గతవారమే కింగ్ నాగార్జున చెప్పేశారు. అయితే ఈ వారంలో ఎవరు ఎలిమినేట్ అవుతారా అన్న అంశంపై ఇటు షోను వీక్షిస్తున్న ప్రేక్షకుల్లో అటు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఇక టాప్ ఫైవ్‌లో నిలిచేందుకు కంటెస్టెంట్లు ఎవరి తిప్పలు వారు పడుతున్నారు. ఇప్పటికే గ్రాండ్ ఫినాలేకు అఖిల్ సార్థక్ ఎంట్రీ ఇవ్వగా... ఇక నలుగురికి మాత్రమే అవకాశాలున్నాయి. ఈ వారం ఎలిమినేషన్ చివరిది కావడంతో ఫైనల్స్ వరకు ఎవరు చేరుతారు అన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

ఎలిమినేషన్ పై లీకులు
ఈ వారం చివరి ఎలిమినేషన్‌కు సమయం దగ్గరపడటంతో అప్పుడే ఇంటిని వీడే సభ్యుడు ఎవరా అనేదానిపై లీకులు వచ్చేశాయి. ప్రస్తుతం ఇంటిలో ఆరుగురు సభ్యులు మాత్రమే ఉన్నారు. అభిజీత్, అఖిల్, సోహైల్, హారికా, అరియానా మరియు మోనాల్ బిగ్‌బాస్ హౌజ్‌లో ఉన్నారు.వీరిలో సోహైల్, అభిజీత్, హారికా, మోనాల్, అరియానాలు ఎలిమినేషన్‌కు నామినేట్ అయ్యారు. ఈ రోజు ఒకరు ఎలిమినేట్ అయితే మిగతా ఐదుగురు ఫైనల్స్‌కు వెళ్లినట్లే. ఈ క్రమంలోనే కంటెస్టెంట్లు అందరూ ఫైనల్స్‌కు చేరేందుకు చాలా కష్టపడుతున్నారు. మొదట్లో ఎలిమినేషన్ ప్రక్రియపై కొన్ని ఆరోపణలు వచ్చినప్పటికీ ఆ తర్వాత షో నిర్వాహకులు తీసుకున్న జాగ్రత్తలు, బిగ్‌బాస్ ఇచ్చిన ట్విస్టులతో ప్రేక్షకులను టీవీలకు అతుక్కునేలా చేశాయి.

సొహైల్
ఎలిమినేట్ అయ్యే చివరి కంటెస్టెంట్ సొహైల్..?
14వ వారం చివరిగా ఎలిమినేట్ అవుతున్న కంటెస్టెంట్ సోహైల్ అని తెలిసింది. రెడ్ కార్డ్ ద్వారా సోహైల్‌ను బిగ్‌బాస్ ఎలిమినేట్ చేయనున్నట్లు సమాచారం. అయితే దీని వెనక కూడా ఒక కారణం ఉందని లీకులు వస్తున్నాయి. సోహైల్‌ను ఎలిమినేట్ చేయడం ద్వారా అభిజీత్‌కు అసలైన ప్రత్యర్థిగా అఖిల్‌ను నిలపడమే బిగ్‌బాస్ ప్లాన్ ఉన్నట్లుగా తెలుస్తోంది. సోహైల్ అఖిల్ హౌజ్‌లో మంచి స్నేహితులు. అఖిల్ ఎలాగూ ఫైనల్స్‌కు చేరాడు కాబట్టి ... సొహైల్‌ను ఎలిమినేట్ చేస్తే తన ఫ్యాన్స్ ఓట్లు కూడా అఖిల్‌కు పడి అభిజీత్‌కు గట్టి పోటీనిచ్చే అవకాశాలుంటాయని బిగ్‌బాస్ భావిస్తున్నట్లు సమాచారం.

మోనాల్‌ను విజేతగా చేయాలనుకుంటున్నారా..?
ఇదిలా ఉంటే మోనాల్, హారికా, సోహైల్‌లు డేంజర్ జోన్లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరి ముగ్గురిలో ఒకరు ఇంటిని వీడే అవకాశం ఉండగా సొహైల్ ఇంటిని వీడనున్నట్లు సమాచారం. ఓటింగ్ ద్వారా బిగ్‌బాస్ వెళితే హారికా టాప్ ఫైవ్‌లో స్థానం దక్కించుకుంటుంది. ఒకవేళ మోనాల్ హారికలను సేవ్ చేయాలని బిగ్‌బాస్ భావిస్తే సోహైల్ ఎలిమినేట్ అయి వీరిద్దరూ టాప్ ఫైవ్‌లోకి వెళ్లడం జరుగుతుంది. మొత్తానికి ఇది బిగ్‌బాస్ హౌజ్ కనుక ఇక్కడ ఏమైనా జరిగే అవకాశం ఉంది. హోస్ట్ నాగార్జున చెప్పేవరకు ఎలాంటి ట్విస్టులు చోటుచేసుకుంటాయో ఎవరు ఎలిమినేట్ అవుతారో కచ్చితంగా చెప్పడం కష్టమే అవుతుంది.