• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

నిబంధనలు సడలించుకున్న బిగ్ బాస్..! ఎలిమినేషన్‌ ఓటింగ్‌ ఫార్మెట్‌ లో అనూహ్య మార్పులు..!!

|

హైదరాబాద్ : ఎన్ని వివాదాలు చుట్టి ముట్టినా డోంట్ కేర్ అన్నట్టుగా వ్యవహరిస్తూ తన పనేంటో తాను చేసుకెళ్తోంది బిగ్ బాస్. దేశంలోనే అత్యంత ఆదరణ పొందిన టీవీ షోలలో బిగ్‌బాస్‌ రియాలిటీ షో ఒకటి. హిందీలో ఇప్పటికే బిగ్‌బాస్‌ 12వ సీజన్‌ ముగిసింది. త్వరలోనే 13వ ఎడిషన్‌ రానుంది. ఇక, తమిళంలో బిగ్‌బాస్‌-3 ప్రారంభం కాగా.. తెలుగులో రేపు (ఆదివారం) బిగ్‌బాస్‌-3 అట్టహాసంగా ప్రారంభం కాబోతుంది. ఈసారి సీనియర్‌ నటుడు, అక్కినేని నాగార్జున బిగ్‌బాస్‌-3కి హోస్ట్‌గా వ్యవహరిస్తుండటంతో ఈసారి అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. ఈ షో పట్ల జనాలకు ఉన్న ఆసక్తి నేపథ్యంలో పలు కథనాలు, వదంతులు చక్కర్లు కొడుతున్నాయి.

ఇప్పటికే బిగ్‌బాస్‌-3లోకి ఎంటరయ్యే కంటెస్టెంట్స్‌ వీరేనంటూ ఓ జాబితా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ జాబితా ప్రకారం చూసుకుంటే.. బిగ్‌బాస్‌ సీజన్‌ 3లో న్యూస్‌ యాంకర్‌ తీన్‌మార్‌ సావిత్రి, జర్నలిస్టు జాఫర్‌, యాంకర్‌ శ్రీముఖి, నటీమణులు హేమ, హిమజ, ఉయ్యాల జంపాల ఫేం పునర్ణవి భూపాలం, వరుణ్‌ సందేశ్‌, అతడి భార్య వితికా షేరు, సింగర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌, భరణి, దుర్గ, అషూరెడ్డి(డబ్‌స్మాష్‌ స్టార్‌), రఘు మాస్టర్‌‌, ఫన్‌ బకెట్‌మహేష్‌ విట్టా, తమన్నా సింహాద్రిలు పాల్గొనబోతున్నట్టు తెలుస్తోంది.

Bigg Boss 3 Telugu Elimination Voting Format Changed..!

ఈసారి షో ఫార్మెట్‌ను బిగ్‌బాస్‌ నిర్వాహకులు కొంత మార్చారు. గత బిగ్‌బాస్‌ హౌజ్‌లో సామాన్యులకు ఎంట్రీ ఇవ్వగా.. ఈసారి అలాంటి ప్రయోగమేమీ చేయడం లేదు. ఈసారి హౌజ్‌లో దాదాపు అందరూ ప్రముఖులే కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. సినిమా, టీవీ రంగాలతోపాటు మీడియా, సోషల్‌ మీడియా, యూట్యూబ్‌ స్టార్లకు ఈసారి పెద్ద పీట వేసినట్టు కనిపిస్తోంది. బిగ్‌బాస్‌-3 షో గురించి అనేక రకాల కథనాలు వినిపిస్తున్నాయి. ఈసారి ఎలిమినేషన్‌ ఓటింగ్‌ ఫార్మెట్‌ను మార్చబోతున్నట్టు తెలుస్తోంది. గతంలో 'గూగుల్‌ ఓటింగ్‌ సిస్టమ్‌' ను ఉపయోగించి..

ఆన్‌లైన్‌లో వచ్చిన ఓట్ల ద్వారా ఎలిమినేషన్‌ ప్రక్రియ చేపట్టేవారు. అయితే, ఈసారి ఎలిమినేషన్‌ ప్రక్రియ హాట్‌స్టార్‌ ఓటింగ్‌ ద్వారా, ఫోన్‌లైన్‌ ఓటింగ్‌ ద్వారా చేపట్టవచ్చునని వినిపిస్తోంది. ఇదెంత వరకు నిజమో రేపటి నుంచి ప్రారంభం కానున్న బిగ్‌బాస్‌-3షోతో తేలిపోనుంది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The BigBass reality show is one of the most popular TV shows in the country. Big Boss 12th season has already ended in Hindi. The 13th edition is coming soon. Bigg Boss 3 starts in Tamil .. Bigg Boss 3 starts in Tamil tomorrow (Sunday). Expectations are high this time as senior actor, Akkineni Nagarjuna will host Bigg Boss-3.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more