• search
 • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Bigg Boss Nominations: ఈవారం ఎలిమినేషన్ లిస్ట్‌లో ఉన్నది వీరే..ఎలిమినేట్ వేటు ఎవరిపై?

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5.. ప్రయాణం మరింత రసవత్తరంగా మారుతోంది. రోజులు గడుస్తున్న కొద్దీ బిగ్‌బాస్ హౌస్‌లో ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంటోంది. అంచనాలకు ఏ మాత్రం అందని విధంగా కంటెస్టెంట్లు ఎలిమినేట్ అవుతున్నారు. హమీద ఖాతూన్, శ్వేతావర్మ ఎలిమినేషన్స్.. ఈ కోవకు చెందినవే. ఎప్పుడు, ఎవరి మీద ఎలిమినేషన్ వేటు పడుతుందో ఊహకు అందట్లేదంటూ నెటిజన్లు సైతం అభిప్రాయపడుతున్నారు.

వీకెండ్‌లో లోబో మెయిన్ హౌస్‌లోకి..

వీకెండ్‌లో లోబో మెయిన్ హౌస్‌లోకి..

ఈ రియాలిటీ షో సెవెన్త్ వీక్‌లో అడుగు పెట్టింది. దానికి అనుగుణంగా కంటెస్టెంట్ల సంఖ్య కూడా తగ్గుతూ వస్తోంది. శ్వేతావర్మతో కలుపుకొని ఇప్పటిదాకా ఆరుమంది ఎలిమినేట్ అయ్యారు. లోబో సీక్రెట్ రూమ్‌కు పరిమితం అయ్యాడు. కంటెస్టెంట్ల సంఖ్య 19 నుంచి 12కు పడిపోయింది. సీక్రెట్ రూమ్‌లో బందీగా ఉంటోన్న లోబో బిగ్‌బాస్ మెయిన్ హౌస్‌లో అడుగు పెట్టడానికి ఇంకా అయిదు రోజుల గడువు ఉంది. శనివారం అతను మెయిన్ హౌస్‌లోకి ప్రవేశించి- తోటి కంటెస్టెంట్లందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తాడని అంటున్నారు.

10కి తగ్గకుండా..

10కి తగ్గకుండా..

హౌస్ నుంచి బయటికి వెళ్లే కంటెస్టెంట్లను ఎంపిక చేసే ప్రక్రియ ప్రతి సోమవారం ఉంటుందనే విషయం తెలిసిందే. తమకు నచ్చని, స్ట్రాంగ్ కాంపిటిటర్‌గా భావించిన వారిని కంటెస్టెంట్లు నామినేట్ ప్రాసెస్ కోసం సెలెక్ట్ చేస్తుంటారు. ఇదివరకు ఎప్పుడూ పెద్దగా లేనివిధంగా ఓ కొత్త ఫార్ములాను బిగ్ బాస్ ఆర్గనైజర్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అయిదు లేదా ఆరుమందిని నామినేట్ చేస్తుండే వారు. ఈ సంఖ్య తొలుత ఎనిమిదికి, ఆ తరువాత 10కి చేరింది. ఈ ట్రెండ్‌ను కంటిన్యూ చేస్తోన్నాడు బిగ్‌బాస్.

ఏడోవారంలో అదే ట్రెండ్..

ఏడోవారంలో అదే ట్రెండ్..

ఏడోవారం కూడా తొమ్మిదిమంది కంటెస్టెంట్లు ఎలిమినేషన్‌ జోన్‌లోకి వచ్చినట్లు సమాచారం. ప్రియాంక సింగ్ ఆలియాస్ పింకీ, ఆర్జే కాజల్, సిరి హన్మంతు, యాంకర్ రవి, శ్రీరామచంద్ర, లోబో, జెస్సీ, ప్రియా, అనీ మాస్టర్.. ఈ వారం ఎలిమినేషన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. కంటెస్టెంట్లలో 80 శాతం మంది ఎలిమినేషన్స్ జోన్‌లోకి వచ్చినట్టే. మానస్ నాగులపల్లి, షణ్ముఖ్ జస్వంత్, వీజే సన్నీ, విశ్వ మాత్రమే ఈ వేటు నుంచి తప్పించుకున్నట్టయింది.

బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటికి వెళ్లేదెవరు?

బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటికి వెళ్లేదెవరు?

ఈ తొమ్మిదిమందిలో ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఉత్కంఠతకు గురి చేస్తోంది. రెండు-మూడు వారాలుగా పోల్ అవుతోన్న ఓట్ల ట్రెండ్‌ను బట్టి చూస్తోంటే.. లోబో, జెస్సీ, ప్రియా, సిరి హన్మంతు కొంత ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనడానికి అవకాశాలు లేకపోలేదు. ఈ నలుగురిలో ఎవరో ఒకరికి- బిగ్‌బాస్ హౌస్‌లో కొనసాగే విషయంలో చుక్కెదురు కావచ్చని టాక్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది. డేంజర్ జోన్‌లో చివరి వరకూ ఉంటారనే అభిప్రాయాలు ఉన్నాయి.

తక్కువ ఓట్లు..

తక్కువ ఓట్లు..

వారందరూ వరుసగా ఎలిమినేషన్ ప్రక్రియ కోసం ఎంపిక అవుతూనే వస్తోన్నారు. తక్కువ ఓట్ల శాతాన్ని నమోదు చేస్తోన్నారు. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్‌తో పోల్చుకుంటే.. వారికి పడుతోన్న ఓట్ల షేర్ కాస్త ఎక్కువగా ఉంటోందంతే. నటరాజ్ మాస్టర్ ఎలిమిట్ అయిన సమయంలో లోబో చివరి వరకూ డేంజర్‌ జోన్‌లో ఉన్నాడు. ప్రియ కూడా అంతే. ఈ ఇద్దరికీ తోటి కంటెస్టెంట్ల నుంచే సపోర్ట్ ఉండట్లేదు. హౌస్‌లో కొనసాగడానికి వారిద్దరూ అన్‌ఫిట్‌గా తేల్చేస్తున్నారు.

  Bigg Boss Telugu 5 : సిరి ని ఘోరంగా అవమానించిన షణ్ముఖ్..తెగ ఏడ్చేసిన సిరి..!
  నాగార్జునతో షేర్..

  నాగార్జునతో షేర్..

  కిందటివారం హోస్ట్ అక్కినేని నాగార్జున సేకరించిన ఒపీనియన్ ప్రకారం.. మొత్తం ఎనిమిది మంది కంటెస్టెంట్ల ఈ ఇద్దరికీ వ్యతిరేకంగా ఉన్నారు. లోబో, ప్రియలకు బిగ్‌బాస్ హౌస్‌లో కొనసాగే అర్హత లేదంటూ తోటి కంటెస్టెంట్లు సైతం అభిప్రాయపడ్డారు. తమ ఒపీనియన్‌ను అక్కినేని నాగార్జునతో షేర్ చేసుకున్నారు. వీక్షకులు కూడా దాదాపు అదే ఒపీనియన్‌తో ఉన్నారని తెలుస్తోంది. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఇప్పటి నుంచి ఆసక్తిగా మారుతోంది. డిబేట్లకు దారి తీస్తోంది.

  English summary
  Bigg Boss 5 Telugu Nominations This Week: Ravi, Siri, Sree Ram Chandra And 5 Others Gets Nominated.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X