India
  • search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇంట్లో మచ్చా.!బయట రచ్చ.!భవోద్వేగాలను రెచ్చగొడుతున్న బిగ్ బాస్.!నిషేదంపై అమీత్ షాకి రాజాసింగ్ లేఖ.!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : వినోదంతో పాటు కాస్త మానసిక పరక్వత కోసం ప్రేక్షకులముందుకు వచ్చిన బిగ్ బాస్ రియాలిటీ షో ప్రేక్షకాదరణ పొందుతున్నప్పటికి అంతే స్తాయిలో వివాదాస్పదమవుతోంది. కంటెస్టెంట్లు ఇంట్లోకి వచ్చేటప్పుడు ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కావడం లేదు గానీ ఇంట్లో నుంచి బయటకు వెళ్లేప్పుడు మాత్రం అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. వినోదాత్మకంగా కాకుండా ప్రాంతీయతత్వంతోనే, భాషాపరంగానో, మతం కులం నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకుని బిగ్ బాస్ షోని చూస్తున్నట్టు యంకర్ రవి నిష్క్రమణ దృవీకరిస్తోంది. రాజకీయ నాయకులు కూడా షో పట్ల తీవ్రంగా స్పందించడం విస్మయానికి గురిచేస్తోంది. బీజేపి ఎమ్మెల్యే రాజాసింగ్ బిగ్ బాస్ ను నిషేదించాలని డిమాండ్ చేయడం విస్మయానికి గురిచేస్తోంది.

ఇంట్లోకొస్తున్నప్పుడు మచ్చా.. బయటకెళ్తున్నప్పుడు రచ్చ

ఇంట్లోకొస్తున్నప్పుడు మచ్చా.. బయటకెళ్తున్నప్పుడు రచ్చ

బిగ్ బాస్ షోను బ్యాన్ చేయాలని ఎమ్మెల్యే రాజా సింగ్ డిమాండ్ చేశారు. తెలంగాణలో బిగ్ బాస్ గేమ్ షోను బ్యాన్ చేయాలని, అసలు ఆ షోలో ఏం జరుగుతుందో అర్ధంకావడంలేదన్నారు గోషామహల్ బీజేపి ఎమ్మెల్యే రాజాసింగ్. యాంకర్ రవి ఎలిమినేన్ సందర్బంగా రచ్చ చోటుచేసుకుందని, అసలు ఏం జరిగిందో చెప్పాలని ఎమ్మెల్యే రాజాసిండ్ డిమాండ్ చేసారు. భావోద్వేగాలను రెచ్చగొడుతున్న బిగ్ బాస్ షో తెలుగు ప్రేక్షకులకు అవసరమా అని ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రశ్నిస్తున్నారు. బిగ్ బాస్ షో నిషేదించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి లేఖ రాస్తానని రాజాసింగ్ స్పష్టం చేసారు.

తెలుగు ప్రజల మధ్య భావోద్వేగాలను రెచ్చగొడుతున్న బిగ్ బాస్.. నిషేదించాలంటున్న బీజేపి ఎమ్మెల్యే..

తెలుగు ప్రజల మధ్య భావోద్వేగాలను రెచ్చగొడుతున్న బిగ్ బాస్.. నిషేదించాలంటున్న బీజేపి ఎమ్మెల్యే..

బిగ్ బాస్ కార్యక్రమం ప్రారంభమైన ప్రతిసారి ఇంటి సభ్యుల విషయంలో విమర్శలు వస్తూనే ఉన్నాయి. మొదటి సీజన్ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పుడు ఐదో సీజన్ వరకూ ప్రతి సీజన్ ఏదో వివాదం రాజుకొంనడం సర్వసాధారణంగా మారిపోయింది. ప్రేక్షకుల్లో ఒక వర్గం బిగ్ బాస్ షో నిషేదించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంకొందరు కోర్టును ఆశ్రయిస్తామని బెదిరిస్తుంటారు. కాని కొన్ని రోజులకు అన్నీ సర్ధుకున్నట్టు కనిపిస్తుంది. షో చివరి దశలో ఇంటి సభ్యులు ఎలిమినేట్ అవుతున్న సందర్బంగా మళ్లీ వివాదాలు రాజుకుంటాయి. ఈ సారి ఏకంగా రాజకీయ కోణంలో విమర్శలు తలెత్తడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

బిగ్ బాస్ పై రచ్చ.. జోక్యం చేసుకున్న రాజకీయ నేతలు

బిగ్ బాస్ పై రచ్చ.. జోక్యం చేసుకున్న రాజకీయ నేతలు

తాజాగా బిగ్ బాస్ షోపై నెలకొన్న వివాదం విస్మయానికి గురిచేస్తోంది. ఆదివారం నాటి ఎపిసోడ్‌‌లో యాంకర్ రవి ఎలిమినేట్ కావడంతో బిగ్ బాస్‌పై అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతుడుతున్నాయి. యాంకర్ రవి ఎలిమినేట్ అయినట్లు ప్రకటించగానే, కొంత మంది ఆయన అభిమానులు బిగ్ బాస్ సెట్ ఉండే అన్నపూర్ణ స్టూడియోస్ ఎదుట నిరసన చేశారు. ప్రాంతీయ అభిమానం జోడించి తెలంగాణ వ్యక్తిని ఏ కారణం లేకుండా ఎలా ఎలిమినేట్ చేస్తారని ప్రశ్నించారు. ఇక ఇదే అంశంపై బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ స్పందన అగ్గకి ఆజ్యం తోడైనట్టేందనే చర్చజరుగుతోంది.

బిగ్ బాస్ కు ప్రాంతీయ సెగ.. బిగ్ బాసే పరిష్కరించాలంటున్న ప్రేక్షకులు

బిగ్ బాస్ కు ప్రాంతీయ సెగ.. బిగ్ బాసే పరిష్కరించాలంటున్న ప్రేక్షకులు

తాజాగా బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ మండిపడ్డారు. అన్న పూర్ణ స్టూడియో ముందు జాగృతి సంస్ధ వారు చేసిన ఆందోళనకు రాజా సింగ్ వ్యాఖ్యలు ఊతమిచ్చినట్టు తెలుస్తోంది. బిగ్ బాస్ వల్ల నెలకొంటున్న ఉద్రిక్త పరిస్ధితులను కేంద్రం దృష్టికి తీసుకెళ్తానని రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేసారు. కాని వినోదాత్మక కార్యక్రమాన్ని అదే కోణంతో చూడకపోతే అనేక సమస్యలు తలెత్తుతాయని తెలుస్తోంది. తెలుగు బిగ్ బాస్ పట్ల కొంత మంది వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలు దేశ వ్యప్తంగా వినిపిస్తే పరిస్ధితి ఏంటన్నది నిర్వహకులు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. భావోద్వేగాలు నిజంగా రెచ్చగొట్టబడుతున్నాయా.?లేక ఆదిపత్యాన్ని ప్రదర్శించడానికి కొంత మంది చేస్తున్న నిరాధారమైన కార్యక్రమాలా అర్థం కాని పరిస్థితులకు బిగ్ బాసే పరిష్కారం చూపించాలి.

English summary
MLA Rajasinghe is questioning whether the Telugu audience needs the Bigg Boss show which is provoking emotions. Rajasinghe clarified that he would write a letter to Union Home Minister Amit Shah to ban the Bigg Boss show.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X