వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఈ-కామర్స్ సైట్ల పేరుతో దోపిడీ, వెలుగులోకి బీహర్ ముఠా నయా ఛీటింగ్

|
Google Oneindia TeluguNews

ఈ-కామర్స్ వెబ్‌సైట్ల నుంచి బల్క్ మేసెజ్‌లు రావని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ స్పష్టంచేశారు. ఒకవేళ అలాంటి ఎస్సెమ్మెస్ వస్తే ఒకటికి రెండుసార్లు నిర్ధారించుకోవాలని సూచించారు. బీహార్‌కు చెందిన నలుగురు సభ్యుల ముఠా ఈ-కామర్స్ వెబ్‌సైట్ల నుంచి డేటా సేకరించి అక్రమాలకు పాల్పడిందని వివరించారు. బహుమతుల పేరుతో భారీగా నగదు వసూల్ చేసిందని తెలిపారు. నలుగురు సభ్యులు గల ముఠాను అరెస్ట్ చేసినట్టు ఆయన వెల్లడించారు.

ఆఫర్ల పేరుతో వల..

ఆఫర్ల పేరుతో వల..

ఏదైనా ఆఫర్ ఉందంటే చాలు జనాలు.. డబ్బులు పంపించేందుకు కూడా వెనకాడరు. వారి నాడీ పట్టుకొన్న ముఠాలు క్యాష్ చేసుకుంటున్నాయి. బీహర్ కబీర్‌పూర్‌కి చెందిన బిపిన్ కుమార్, సందీప్ బిశ్వాస్, మాణిక్‌చంద్ పాశ్వాన్, మరొకరి కలిసి ఈజీగా డబ్బుల సంపాదించడంపై దృష్టిసారించారు. ఇటీవల ఆన్‌లైన్‌లో జనాలు ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారని.. కొన్ని కంపెనీల నుంచి డేటాను సైతం సేకరించారు.

ఇల్లును ఆఫీసుగా మార్చి..

ఇల్లును ఆఫీసుగా మార్చి..

నౌవడ జిల్లాలో ఓ ఇల్లు తీసుకొని.. నాలుగు కంప్యూటర్ల పెట్టి ఆఫీసుల మార్చారని సీపీ సజ్జనార్ తెలిపారు. అమెజాన్, ప్లిప్‌కార్ట్, క్లబ్ ఫ్యాక్టరీ, స్నాప్‌డీల్ నుంచి వినియోగదారుల డేటాను సేకరించారు. ఇంకేముంది వినియోగదారులకు గిప్ట్ పేరుతో వలవేస్తున్నారు. అలా కొందరు విశ్వసించి ముఠా అడిగిన డబ్బులు అకౌంట్‌లో వేయడం ప్రారంభించారు. ఇలా వారి దోపిడీ కొనసాగుతోంది.

తీగలాగితే..

తీగలాగితే..

ఇలా ఉంటే సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదులు వచ్చాయి. ఈ-కామర్స్ సైట్ల పేరుతో మోసపోయామని చెప్పడంతో.. పోలీసు కమిషనర్ సజ్జనార్ ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. బీహార్ పంపించి విచారణ చేపట్టగా ముఠా లీలలు బయటకొచ్చాయి. బహుమతులు వచ్చాయని పెద్ద మొత్తంలో నగదు వసూల్ చేసినట్టు తెలిసింది.

స్కార్పియో కారు కూడా

స్కార్పియో కారు కూడా


బిపిన్ కుమార్ బృందం నుంచి 12 మొబైల్స్, 2 ల్యాప్‌ట్యా‌ప్‌లు, స్కార్పియో వాహనం స్వాధీనం చేసుకున్నామని సీపీ సజ్జనార్ పేర్కొన్నారు. స్కానర్లు, నకిలీ ఆధార్, పాన్ కార్డులు, కొన్ని డేబిట్ కార్డులు కూడా లభించాయని చెప్పారు. ఏ కంపెనీ కూడా బల్క్ మేసెజ్ ఇవ్వదని సీపీ సజ్జనార్ తెలిపారు. ఈ-కామర్స్ పేరుతో వచ్చే ఫోన్ల నుంచి అప్రమత్తంగా ఉండాలని ప్రజలను కోరారు.

English summary
bihar gang cheat people via e-commerce websites cyberabad cp sajjanar said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X